BigTV English

Navel Cleaning: నాభిని శుభ్రం చేసుకోకపోతే అంత ప్రమాదమా? ఏం జరుగుతుంది?

Navel Cleaning: నాభిని శుభ్రం చేసుకోకపోతే అంత ప్రమాదమా? ఏం జరుగుతుంది?

స్నానం చేసేటప్పుడు ఒంట్లోని ప్రతి భాగాన్ని సబ్బుతో రుద్దుకుంటారు. కానీ నాభి లేదా బొడ్డును (Navel) మాత్రం పట్టించుకోరు. అందుకే నాభిలో తెల్లటి దూది లాంటి పదార్థం చేరిపోతూ ఉంటుంది. అయితే నాభిని ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలా? లేదా? అనే విషయంపై ఎంతో మందికి అవగాహన లేదు.


నాభిని ఎక్కువ రోజులు పాటు శుభ్రం చేయకపోతే అందులో నూనె, చర్మకణాలు వంటివి చేరిపోతాయి. అవి అక్కడ ఎండిపోయి గట్టిగా మారుతాయి. కొన్నిసార్లు దుర్వాసన కూడా వస్తాయి. దీని వలన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు నాభిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

వారానికోసారి శుభ్రం చేసుకోవాలి


రోజు స్నానం చేసేటప్పుడే నాభిలో ఉన్న బ్యాక్టీరియా, నూనె కణాలు, చర్మ కణాలను సున్నితంగా తొలగించుకోవడం ఉత్తమం. వారానికి ఒక్కసారి అయినా మీ నాభిపై దృష్టి పెట్టండి. దాన్ని శుభ్రపరచడం లక్ష్యంగా పెట్టుకోండి. ప్రతిరోజూ మీకు వీలు కాకపోతే వారానికి ఒకసారి చేసినా కూడా నాభి పరిశుభ్రంగా ఉంటుంది.

ఇలా శుభ్రం చేసుకోవాలి

ముఖాన్ని శుభ్రం చేసుకున్నట్టే నాభిని, నాభి చుట్టూ ఉండే చర్మాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాభి కాస్త లోతుగా ఉంటుంది. కాబట్టి దూదిని లేదా మెత్తటి వస్త్రాన్ని నీళ్లలో తడిపి దానితో నాభిని శుభ్రం చేయడం ఉత్తమం. అయితే చాలా సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. చాలామంది ఆల్కహాల్ కలిపిన హ్యాండ్ వాష్ ను వాడుతూ ఉంటారు. దీన్ని పదేపదే ఉపయోగించడం వల్ల అక్కడున్న చర్మం ఎండిపోతుంది. దురద, దద్దుర్లు వంటివి వస్తాయి. నాభిలో ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి సబ్బులు, హ్యాండ్ వాష్‌లు అవసరం లేదు. కేవలం తడి వస్త్రంతో తుడిస్తే అది శుభ్రపడిపోతుంది.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

నాభిలో నొప్పిగా అనిపించడం, దురదగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే ఇన్ఫెక్షన్ బారిన పడిందేమో చెక్ చేసుకోండి. యాంటీ ఫంగల్ లేదా యాంటీ బ్యాక్టీరియల్ మందులను వైద్యులు సూచిస్తారు. వైద్యులు చెప్పిన మందులనే వాడడం ద్వారా నాభి ఇన్ఫెక్షన్ ను అరికట్టవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో చెమటలు అధికంగా పడుతూ ఉంటాయి. నావిలో కూడా చెమటలు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా చెమట పట్టాక ఇంటికి వచ్చి నాభిని కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తడి ఎక్కువసేపు నాభి లోపల ఉంటే అక్కడ ఇన్ఫెక్షన్ మొదలైపోతుంది.

Also Read: ఈ ఆయిల్స్ వాడితే.. జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా !

నాభి కూడా శరీరంలో ఒక భాగమే. దాన్ని చాలామంది పట్టించుకోకుండా వదిలేస్తారు. పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాంతాల్లో అది కూడా ఒకటి. కాబట్టి నాభిని కూడా పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×