Lava ProWatch V1 : లావా కొత్త ప్రో వాచ్ ఇండియా మార్కెట్లోకి లాంఛ్ అయింది. ఈ వాచ్ అదిరే ఫీచర్స్ తో రూ. 3,000కే అందుబాటులో ఉంది. 4 కలర్స్ లో కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్న ఈ వాచ్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పై ఓ లుక్కేసేయండి.
ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్థ లావా ఇటీవల డీసెంట్ ఫోన్‌లను లాంఛ్ చేయడంతో ఇండియన్ మార్కెట్‌లో మళ్లీ సందడి మెుదలైంది. ఇక బెస్ట్ స్మార్ట్ వాచెస్ ను సైతం మార్కెట్లోకి తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేస్తున్న లావా.. ప్రముఖ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థలకు గట్టి పోటీనే ఇస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఆపిల్, సాంసంగ్ కంపెనీలు అదిరే స్మార్ట్ వాచెస్ ను తీసుకువస్తుండగా.. వాటికి పోటీగా కొత్త వాచెస్ ను తెచ్చే ప్రయత్నం చేస్తుంది. తాజాగా Lava ProWatch V1 పేరుతో కొత్త స్మార్ట్ వాచ్‌ను పరిచయం చేసింది.
లావా కంపెనీ తీసుకువచ్చిన Lava ProWatch V1 మార్కెట్లో రూ.2,399కే అందుబాటులో ఉంది. ఈ గ్యాడ్జెట్ పీచీ హికారి, బ్లూయిష్ రోనిన్, మింట్ షినోబి, బ్లాక్ నెబ్యులా వంటి నాలుగు కలర్స్ లో అందుబాటులో ఉంది. వాచ్ కలర్ ఆప్షన్‌లు జపనీస్ థీమ్‌తో వచ్చేశాయి.
Lava ProWatch V1 Features –
Lava ProWatch V1 రౌండ్ ఎడ్జెస్ తో అష్టభుజి డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ 390×450 పిక్సెల్ రిజల్యూషన్‌తో పాటు 1.85 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మునుపటితో పోలిస్తే అంగుళానికి 42% అధిక పిక్సెల్‌లను అందిస్తుంది. ఇక ఇందులో డిస్ ప్లే ఫీచర్ మరో స్పెషల్ ఎట్రాక్షన్. డిస్ ప్లే కు మరింత ప్రొటెక్షన్ అందిస్తూ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉంది.
సీమ్లెస్ ట్రాన్షిషన్ ఎఫెక్ట్ కోసం 2.5D GPU యానిమేషన్ ఇంజిన్ కూడా ఉంది. ఈ గ్యాడ్జెట్ లో రియల్‌టెక్ 8773 ప్రాసెసర్, బ్లూటూత్ v5.3 సపోర్ట్, స్టాండర్డ్ కనెక్టివిటీ సైతం ఉన్నాయి.
స్మార్ట్‌వాచ్ ప్రయాణాల్లో సైతం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఖచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్ కోసం సహాయక GPS ఫీచర్ ఇందులో ఉంది. ఫిట్‌నెస్, హెల్త్ ట్రాకింగ్‌ను అందించడానికి వాచ్‌లో VC9213 PPG సెన్సార్ కూడా ఉంది. వాటర్ రెసిస్టెన్స్ కోసం వాచ్‌లో IP68 సర్టిఫికేషన్ కూడా ఉంది.
అంతే కాకుండా.. స్మార్ట్‌వాచ్ 100 విభిన్న స్పోర్ట్స్ మోడ్‌లతో పాటు 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను కూడా కలిగి ఉంది. ఇది వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ తో పాటు రెండు సంవత్సరాల వారంటీని సైతం అందిస్తుంది. ఈసారి లావా స్మార్ట్‌వాచ్‌లో క్విక్ రిప్లై ఫీచర్, బిల్ట్ ఇన్ గేమ్‌లను కూడా అందిస్తుంది. ఇది 270mAh బ్యాటరీను కలిగి ఉంటుంది. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 3 రోజుల పాటు పనిచేస్తుంది.
ఇక తక్కువ ధరలోనే బెస్ట్ స్మార్ట్ వాచ్ ను కొనాలనుకునే యూజర్స్ కు ఈ వాచ్ బెస్ట్ ఆప్షన్. రూ.3000లోపే అధునాతన ఫీచర్స్ తో వచ్చేసిన ఈ స్మార్ట్ వాచ్ అన్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో అందుబాటులో ఉండనుంది.
ALSO READ : రిపబ్లిక్ డే సేల్ లో ఐఫోన్స్ పై ఆఫర్సే ఆఫర్స్!