BigTV English

Thandel: బుజ్జితల్లి వీడియో సాంగ్.. సాయిపల్లవి థియేటర్ లో కన్నీరు పెట్టించడం ఖాయం

Thandel: బుజ్జితల్లి వీడియో సాంగ్.. సాయిపల్లవి థియేటర్ లో కన్నీరు పెట్టించడం ఖాయం

Thandel: అక్కినేని  నాగచైతన్య పాన్ ఇండియా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మొదటిసారి చై నటిస్తున్న పాన్ ఇండియా సినిమా తండేల్. కార్తికేయ 2 సినిమాతో మంచి హిట్ అందుకున్న చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. గీతా  ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చై సరసన లేడీ  పవర్ స్టార్ సాయిపల్లవి నటిస్తుంది.


ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ భారీ విజయాన్ని అందుకుంది.  ఇక ఇప్పుడు మరోసారి వీరి కాంబో తండేల్ తో వస్తుండడంతో ప్రేక్షకులు అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్..ఈ సినిమాలోని లిరికల్ సాంగ్స్ తో పాటు వీడియో సాంగ్స్ ను కూడా రిలీజ్ చేసి ఇంకా హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఇప్పటికే తండేల్ నుంచి రిలీజైన  బుజ్జి తల్లి లిరికల్ వీడియో ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుజ్జితల్లే .. వచ్చేస్తున్నా కదే.. కాస్త నవ్వే అని చై చెప్పిన డైలాగ్.. సాయిపల్లవి నవ్వు..  దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రేక్షకుల మనసులను ఫిదా చేసింది. ఇక తాజాగా ఈ సాంగ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు.


Bigg Boss Priyanka Singh: హీరోయిన్ గా బిగ్ బాస్ ప్రియాంక.. హీరో ఎవరంటే..?

గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్స్ లో సర్ ప్రైజ్ గా  ఈ  వీడియో సాంగ్ ను మేకర్స్ యాడ్  చేశారు. ఇక ఇది చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యి.. చాలా బావుంది అంటూ ఆ సాంగ్ ను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మార్చారు. దీంతో మేకర్స్.. అధికారికంగా ఈ వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. గాలిలో ఊగిసలాడే దీపంలా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మొన్నటివరకు ఈ సాంగ్ లిరిక్స్ వినే కంటతడి పెట్టిన ప్రేక్షకులు.. ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా  కంటతడి పెడుతున్నారు.

సముద్రంలో చేపల కోసం వెళ్లిన  ప్రియుడు ఎప్పుడు వస్తాడో అని  ప్రియురాలు ఎదురుచూడడం.. ఆ విరహ వేదనలో  గతంలోని మధుర స్మృతులను తలుచుకుంటూ.. బాధపడడం లాంటి విజువల్స్ ను చూపించారు. ఇక విరహ వేదన చూపించడంలో సాయిపల్లవి బ్రాండ్  అంబాసిడర్.

గతేడాది రిలీజ్ అయిన అమరన్ సినిమాలో కూడా ఆమె తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.  భర్త చనిపోయినా.. ఆయనకు ఇచ్చిన మాట కోసం కన్నీటి బొట్టును కూడా కార్చకుండా ప్రేక్షకులను మరింత ఏడిపించేసింది. ఇక ఇప్పుడు ప్రియుడు కోసం ఎదురుచూసే బుజ్జితల్లి బాధను  చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో చై పాన్ ఇండియా హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×