Japan Traffic Light Colors: ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం కామన్. చిన్నప్పటి నుంచే పిల్లలకు వీటి మీద అవగాహన కల్పించేందుకు పాఠ్యపుస్తకాలలో పెడుతుంటారు. ట్రాఫిక్ లైట్లలో 3 రంగులు ఉంటాయి. వాటిలో ఒకటి ఎరుపు, రెండో ది ఎల్లో, మూడోది గ్రీన్. జనరల్ గా గ్రీన్ లైట్ పడితే వాహనాలు ముందుకు వెళ్లొచ్చని, ఎల్లో పడితే వేచి ఉండాలని, రెడ్ పడితే ఆగాలని వాటి అర్థం. ఈ విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు. కానీ, ప్రపంచంలో ఒకే ఒక్క దేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లో గ్రీన్ లైట్ వాడరు. సాధారణంగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులకు బదులుగా, ఆ దేశంలో ఎరుపు, పసుపు, నీలం రంగులను ఉపయోగిస్తారు. ఇంతకీ, ఆదేశం ఏది? ఎందుకు అలా చేస్తారు? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ట్రాఫిక్స్ సిగ్నల్స్ లో గ్రీన్ కలర్ వాడని ఏకైక దేశం
ట్రాఫిక్ సిగ్నల్స్ లో గ్రీన్ కలర్ వాడని ఏకైక దేశం జపాన్. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా కొనసాగుతున్న ఈ దేశంలో ఆకు పచ్చ రంగుకు బదులుగా నీరం రంగు లైట్లు ఉపయోగిస్తారు. ఎందుకు, నీరం రంగును ఉపయోగిస్తారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. జపనీస్ భాషలో నాలుగు ప్రధాన రంగులు ఉంటాయి. అవి తెలుపు, నలుపు, ఎరుపు, నీలం. ఆకుపచ్చ రంగును వర్ణించే పదం జపాన్ లో లేదు. ఇదో ప్రత్యేకమైన రంగుగా భావిస్తారు. దీనిని జపనీస్ భాషలో Ao అని పిలుస్తారు. ఇది జపనీస్ లో నీలం రంగుకు ఉపయోగించే పదం.
రంగు విషయంలో కన్ ఫ్యూజన్
జపాన్ లో చాలా ఏండ్ల పాటు మిడోరి అనే పదాన్ని ఆకుపచ్చ రంగును వర్ణించడానికి ఉపయోగించారు. కానీ, ఇది ఇప్పటికీ Ao లేదంటే నీలం రంగుగానే పరిగణిస్తున్నారు. మిడోరి, Ao పదాలు ఆకుపచ్చ, నీలం రంగుకోసం పరస్పరం వాడుతున్నారు. ట్రాఫిక్ లైట్ల విషయానికి వచ్చే సరికి గందరగోళం తలెత్తింది. జపాన్ లో తొలుత ప్రపంచ ప్రమాణాల ప్రకారం ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఆకుపచ్చ రంగును ఉపయోగించారు. కానీ, ఆదేశ అధికారిక ట్రాఫిక్ నియమాల డాక్యుమెంట్స్ లో ఆకుపచ్చ రంగును మిడోరి అని కాకుండా Ao అని రాశారు. ఇది భాషా నిపుణులను గందరగోళ పరిచింది. ప్రభుత్వ నియమాల్లో మిడోరి అని కాకుండా Ao అని ప్రస్తావించినట్లు అయితే, ఆకుపచ్చ రంగుకు బదులుగా నీలం రంగును ఉపయోగించాలని వాళ్లు డిమాండ్ చేశారు.
1973 నుంచి బ్లూ కలర్ ట్రాఫిక్ లైట్
అంతర్గత ఒత్తిడి, అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరంతో జపాన్ సరికొత్త ఆలోచన చేసింది. 1973లో ట్రాఫిక్ సిగ్నల్ లో ఆకుపచ్చ రంగుకు బదులుగా బ్లూ కలర్ లైట్లను ఉపయోగించడం ప్రారంభం అయ్యింది. జపాన్ ప్రభుత్వం ప్రకారం కాస్త గ్రీన్ కలర్ లో కనిపించేలా బ్లూ కలర్ ను మార్చింది. అయితే, నిజానికి ఇది కూడా గ్రీన్ కలర్ లైటే అని వాదిస్తున్నది. కానీ, ప్రపంచ దేశాలు మాత్రం జపాన్ ట్రాఫిక్ సిగ్నల్స్ లో గ్రీన్ కు బదులుగా బ్లూ కలర్ వాడుతున్నారని భావిస్తున్నాయి.
Read Also: అమృత్ భారత్ వెర్షన్ 2.0 వచ్చేస్తోంది, బాబోయ్.. ఇన్ని ప్రత్యేకతలా!