LG OLED AI Smart TV: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ LGకి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. స్మార్ట్‌ఫోన్స్, ఫ్రిడ్జ్, ఏసీ, స్మార్ట్‌టీవీల రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ కంపెనీ మరొక ముందడుగు వేసింది. భారతదేశంలో మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో కూడిన స్మార్ట్ టీవీల సిరీస్‌ని విడుదల చేసింది.
ఈ సిరీస్‌లలో ప్రపంచంలోనే అతిపెద్ద OLED Smart TV కూడా ఉంది. ఇది భారీ అంగుళాల స్మార్ట్‌టీవీ. దాదాపు 97 అంగుళాల 4K తో వస్తుంది. ఈ TV LG స్వంత α11 AI ప్రాసెసర్, webOSలో నడుస్తుంది. ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే..
LG OLED AI Smart TV Features
ఈ LG కొత్త సిరీస్ 42 అంగుళాల నుండి 97 అంగుళాల వరకు స్మార్ట్ టీవీలను కలిగి ఉంది. ఈ టీవీలు 4K రిజల్యూషన్, HDMI 2.1 పోర్ట్, 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లతో వస్తాయి. NVIDIA G-SYNC, AMD FreeSync సర్టిఫికేట్ కూడా పొందాయి. ఈ స్మార్ట్ టీవీలను గేమింగ్ మానిటర్‌లుగా కూడా ఉపయోగించవచ్చు.
Also Read: బ్రాండెడ్ స్మార్ట్‌టీవీపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఇప్పుడు సగం ధరకే కోనేయండిలా!
LG ప్రకారం.. ఈ టీవీలు AI అప్‌స్కేలింగ్, AI పిక్చర్ ప్రో వంటి టెక్నాలజీతో అమర్చబడి ఉంటాయి. దీనితో పాటు కలర్‌ను మెరుగుపరచడానికి LG AIని కూడా ఉపయోగిస్తోంది. OLED మోడల్స్ కాకుండా.. LG QNED టెక్నాలజీతో కొన్ని స్మార్ట్ టీవీలను కూడా విడుదల చేసింది. ఈ టెక్నాలజీ క్వాంటం డాట్, నానోసెల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.
ఇది 20-బిట్ ఖచ్చితత్వాన్ని అందిస్తుందని LG పేర్కొంది. ఈ టీవీ వర్చువల్ 9.1.2 సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. ఈ కొత్త సిరీస్ LGలో అందుబాటులో ఉన్న ఇతర ప్రత్యేక ఫీచర్లు.. 5 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ (webOS), Dolby Atmos, Dolby Visionను కలిగి ఉంది. అదనంగా ఈ టీవీలు Apple AirPlay, Google Chromecast వంటి వైర్‌లెస్ స్క్రీన్/కంటెంట్ షేరింగ్ టెక్నాలజీలతో కూడా అమర్చబడి ఉంటాయి.
Also Read: Realme GT 6T Launch: అతిపెద్ద కూలింగ్ సిస్టమ్‌తో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్.. రేపే లాంచ్!
LG OLED AI Smart TV Price
LG కొత్త AI TV సిరీస్ 43-అంగుళాల QNED82T మోడల్‌తో ప్రారంభమవుతుంది. దీని ధర రూ.62,990గా కంపెనీ నిర్ణయించింది. 65 అంగుళాల LG QNED90T (మినీ LED) ధర రూ.1,89,990గా ఉంది. అదేవిధంగా అత్యంత సరసమైన 42-అంగుళాల OLED మోడల్ ధర రూ.1,19,990 కాగా.. 55-అంగుళాల LG OLED evo G4 AI ధర రూ.2,39,990గా ఉంది. అయితే ఇది కాకుండా 97 అంగుళాల 4K LG ఫ్లాగ్‌షిప్ LG OLED97G4 స్మార్ట్‌టీవీ రూ.20,49,990 ధరతో రిలీజ్ అయింది.