BigTV English
Advertisement

Lok Sabha Elections 2024: ముగిసిన ఐదో దశ పోలింగ్.. ఎంత శాతం పోలింగ్ నమోదయ్యిందంటే..?

Lok Sabha Elections 2024: ముగిసిన ఐదో దశ పోలింగ్.. ఎంత శాతం పోలింగ్ నమోదయ్యిందంటే..?

5th Phase Lok Sabha Elections 2024 Highlights: పార్లమెంటు ఎన్నికల ఐదో విడత పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. మొత్తం 8 రాష్ట్రాల్లో 49 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. కాగా, 49 స్థానాలకు మొత్తం 659 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఆయా రాష్ట్రాల్లో ఓటింగ్ సజావుగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.యూపీలోని 14, మహారాష్ట్రలో 13, పశ్చిమబెంగాల్ లో 7, ఒడిశాలో 5, బీహార్ లో 5, జార్ఖండ్ లో 3, జమ్మూకాశ్మీర్, లడఖ్ లో ఒక్కో స్థానానికి పోలింగ్ కొనసాగింది.


ప్రముఖులు పోటీ పడిన పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా ఈ ఐదో దశలోనే పోలింగ్ జరిగింది. వాటిలో అమేథీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నుంచి కేఎల్ శర్మ పోటీ చేశారు. రాజ్ నాథ్ సింగ్ బరిలో ఉన్న లక్నో నియోజకవర్గం, పియూష్ గోయల్ పోటీ చేసిన ముంబై నార్త్ నియోజకవర్గం, రాహుల్ గాంధీ పోటీ చేసిన రాయ్ బరేలీ నియోజకవర్గం, చిరగ్ పస్వాన్ పోటీ చేసిన హజీపూర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కొడుకు శ్రీకాంత్ షిండే బరిలో ఉన్న కల్యాణ్ నియోజకవర్గం, ఓమర్ అబ్దుల్లా – బారాముల్లా నియోజకవర్గం, ఆర్జేడీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహీణి ఆచార్య బరిలో ఉన్న సరన్ నియోజకవర్గాలకు కూడా ఈ ఐదో దశలోనే పోలింగ్ జరిగింది.

Also Read: Rajiv Gandhi 33rd Death Anniversary : రాజీవ్ గాంధీ వర్థంతి.. నివాళులు అర్పించిన ప్రధాని, కాంగ్రెస్ నేతలు


ఈ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖులంతా తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, సామాన్యులతోపాటు లైన్లలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, జాన్వీ కపూర్, ఐరా ఖాన్, ఫర్హన్ అక్తర్, జోయా అక్తర్, రాజ్ కుమార్ రావ్ తోపాటు పలువురు సినిమా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కెనడా పౌరసత్వం కలిగిన అక్షయ్ కుమార్, గతేడాది ఆగస్టులో తొలిసారి భారతీయ పౌరసత్వం పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నేడు మొదటిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.

ఉదయం 11 గంటల వరకు 23.66 శాతం నమోదైంది. ఏ రాష్ట్రాలలో ఎంత శాతం ఓటింగ్ నమోదు అయ్యిందంటే..

పశ్చిమ బెంగాల్ – 32.70 శాతం
యూపీ – 27.76 శాతం
లడఖ్ – 27.87 శాతం
జార్ఖండ్ – 26.18 శాతం
బీహార్ – 21.11 శాతం
జమ్మూ కాశ్మీర్ 21.37 శాతం
ఒడిశా – 21.07 శాతం
మహారాష్ట్ర – 15.93 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి.

Also Read: India Lowers Flag to Half Mast: ఇరాన్ అధ్యక్షుడి మృతికి భారత్ సంతాపం.. రాష్ట్రపతి భవన్ లో జాతీయ జెండా అవనతం

మధ్యాహ్నం 1 గంట వరకు 36.73 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. లడఖ్ లో అత్యధికంగా 52.02 శాతం నమోదయ్యింది. తక్కువగా మహారాష్ట్రలో 27.78 శాతం నమోదయ్యింది.

పశ్చిమబెంగాల్ – 48.4 శాతం పోలింగ్ నమోదు
జార్ఖండ్ – 41.8 శాతం పోలింగ్ నమోదు
ఉత్తర ప్రదేశ్ -39.5 శాతం పోలింగ్ నమోదు
జమ్మూకాశ్మీర్ – 34.79 శాతం పోలింగ్ నమోదు

మధ్యాహ్నం 3 గంటల వరకు 47.53 శాతం పోలింగ్ నమోదయ్యింది. అత్యధికంగా 62.72 శాతం పశ్చిమ బెంగాల్ లో నమోదయ్యింది. అత్యల్పంగా మహారాష్ట్రలో 38.77 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

లడఖ్ – 61.26 శాతం పోలింగ్ నమోదు

జార్ఖండ్ – 53.90 శాతం పోలింగ్ నమోదు

ఒడిశా – 48.95 శాతం పోలింగ్ నమోదు

యూపీ – 47.55 శాతం పోలింగ్ నమోదు

బీహార్ – 45.33 శాతం పోలింగ్ నమోదు

జమ్మూకాశ్మీర్ – 44.90 శాతం పోలింగ్ నమోదు

Also Read: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. జూన్ 3వరకూ జైల్లోనే..

సాయంత్రం 5 గంటల వరకు 56.68 శాతం పోలింగ్ నమోదయ్యింది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో 73 శాతం పోలింగ్ నమోదు. అత్యల్పంగా మహారాష్ట్రలో 48.66 శాతం పోలింగ్ నమోదు.

లడఖ్ లో 67.15 శాతం పోలింగ్ నమోదు

జార్ఖండ్ – 61.90 శాతం పోలింగ్ నమోదు

ఒడిశా – 60.55 శాతం పోలింగ్ నమోదు

యూపీ – 55.80 శాతం పోలింగ్ నమోదు

జమ్మూ కాశ్మీర్ 54.21 శాతం పోలింగ్ నమోదు

బీహార్ – 52.35 శాతం పోలింగ్ నమోదు

Related News

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Big Stories

×