WhatsApp : వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే వీడియో కాల్ క్వాలిటీ, మెసేజ్ డ్రాప్ట్, ట్రాన్స్లేషన్ వంటి ఫీచర్స్ తీసుకురాగా తాజాగా వీడియో కాల్ ఎఫెక్ట్స్ ను సైతం అందుబాటులోకి తెచ్చింది. దీంతో మరింత కొత్తగా వీడియో కాల్స్ ను ఆస్వాదించే అవకాశం ఉండనుంది. ఇందులో వీడియో కాల్ ఎఫెక్ట్‌లతో పాటు కస్టమ్ వీడియో కాల్ సపోర్ట్ వంటి కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇత ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అనే డీటెయిల్స్ తెలుసుకుందాం.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. తాజాగా ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ స్థిరమైన వెర్షన్ కోసం రెండు కొత్త ఫీచర్‌లను పరిచయం చేసింది – కొత్త వీడియో కాల్ ఎఫెక్ట్‌లతో పాటు కస్టమ్ కాల్ సపోర్ట్ ను తీసుకొచ్చింది. ఇప్పటి నుంచి వినియోగదారులందరూ గ్రూప్ కాల్స్ చేయగలరు ఇంకా వాళ్లు యాడ్ చేయాలనుకుంటున్న పార్టిసిపెంట్‌లతో పాటు కాల్ నుంచి తొలగించాలనుకుంటున్న యూజర్స్ ను సైతం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ ఫీచర్ తో ఎవరైనా తమకు ఇష్టమైన వారికి సర్ ప్రైజ్ పార్టీని ప్లాన్ చేయెుచ్చు. కావల్సిన వ్యక్తులను ఈ వీడియో కాల్ లో జోడించి వాళ్లని ఖుషీ చేసే ఛాన్స్ ఉంటుంది.
WhatsApp Latest Updates – వాట్సాప్ తొలిసారిగా వీడియో కాల్ ఎఫెక్ట్‌లను తన యూజర్స్ కోసం పరిచయం చేసింది. WhatsApp లాంఛ్ టైమ్ లోనే కొన్ని ఫీచర్స్ ను తీసుకొచ్చిన మెటా.. తాజాగా మరిన్ని మెరుగులు దిద్దుతుంది. ఎప్పటికప్పుడు వాట్సాప్ కు పెరుగుతున్న ఆదరణతో వీడియో కాల్స్ కు మరిన్ని సొగసులు అద్దింది. ఇప్పుడు డాగ్ ఫిల్టర్‌తో పాటు ప్రేక్షకుల కోసం మరో పది కొత్త ఫీచర్‌లను అందిస్తోంది. స్క్రీన్ కుడి వైపున అందుబాటులో ఉన్న మ్యాజిక్ వాండ్ ఐకాన్‌పై క్లిక్ చేయడంతో ఈ ఫీచర్‌లను ఉపయోగించే అవకాశం ఉంది.
ఇక ఈసారి మెటా తీసుకొచ్చిన ఈ ఫీచర్ వాట్సాప్ ముఖ చిత్రంనే మార్చేయనుంది. WhatsApp యాప్ PC వెర్షన్‌లో కూడా కొత్త మార్పులను తీసుకువస్తోంది. ఇక్కడ, వినియోగదారులు కొత్త డెడికేటెడ్ కాల్ ట్యాబ్‌ను చూడగలరు. ఈ మార్పు తర్వాత వినియోగదారులు WhatsApp PC యాప్ నుండి నేరుగా కాల్‌లు చేయగలరు. కాల్ లింక్‌లను క్రియోట్ చేస్తారు లేదా ఫోన్ నంబర్‌ను డయల్ చేయగలరు.
ఇక ఏది ఏమైనా.. వాట్సాప్ కాల్‌లకు మెరుగైన రిజల్యూషన్, స్థిరమైన కనెక్షన్ కూడా పొందే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తుంది. WhatsApp డెస్క్‌టాప్, మొబైల్ అప్లికేషన్‌లకు మరింత బెటర్ వెర్షన్ రాబోతుంది. ప్రస్తుతానికి ఇన్‌స్టంట్ మెసేజింగ్, వీడియో కాలింగ్‌లో WhatsApp ఎప్పుడూ నంబర్ వన్ అప్లికేషన్ అనే చెప్పొచ్చు. ఇక తీసుకొస్తున్న ఈ లేటెస్ట్ ఫీచర్స్ తో మరే కొత్త యాప్ వాట్సాప్ ను ఇప్పట్లో చేరుకోలేదని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ALSO READ : వాటే ఐడియా సర్ జీ.. ఒక్క నిర్ణయంతో ఈపీఎఫ్ బాధలు ఇక తొలిగినట్టే..!