E-Paper
Advertisement

Mahindra Thar 5-door: మరోసారి మెరిసిన మహీంద్రా థార్ 5 డోర్ల కార్.. లాంచ్ ఎప్పుడంటే..?

Mahindra Thar 5-door: మరోసారి మెరిసిన మహీంద్రా థార్ 5 డోర్ల కార్.. లాంచ్ ఎప్పుడంటే..?
Advertisement
Mahindra Thar 5-door

Mahindra Thar 5-door(today’s latest news):

ప్రస్తుతం వాహనాలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. కొత్త మోడల్ వస్తుందంటే చాలు.. కొనేందుకు ఎగబడిపోతుంటారు. ఈ క్రమంలోనే వినియోగదారులు ఎలాంటి వాహనాలపై ఆసక్తి చూపుతున్నారో.. అలాంటి వాటిపైనే ప్రముఖ కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయి. ఈ మేరకు మార్కెట్‌లోకి కొత్త కొత్త మోడళ్లను దింపుతున్నాయి.

Advertisement

అయితే ఇప్పటికే ప్రముఖ కంపెనీలు ఎన్నో మోడళ్ల వాహనాలను మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. అందులో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఒకటి. మార్కెట్‌లో ఈ కంపెనీ కార్లకు ప్రత్యేక డిమాండ్ ఉంది. రకరకాల డిజైన్లతో, అద్భుతమైన ఫీచర్లను అందిస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది.

ఇప్పుడు ఈ కంపెనీ మరో మోడల్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా థార్‌కి సంబంధించిన 5 డోర్ల వెర్షన్‌ను టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Advertisement

Read More: ఈ కార్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్స్.. రూ.1.82 లక్షల వరకు.. ఫిబ్రవరి 29 చివరి తేదీ!

ఈ నేపథ్యంలో తాజాగా ఈ 5 డోర్ల SUV థార్ వాహనం మరోసారి రోడ్లపై కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీని ప్రకారం చూస్తే.. ఈ 5డోర్ల థార్‌కు మహీంద్రా కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ 5 డోర్ల కార్.. 3 డోర్ల కార్ కంటే పెద్దదిగా ఉన్నట్లు తాజా ఫొటోలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇది అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. అలాగే డైమండ్-కట్ ఫినిష్‌తో 19- అంగుళాల యూనిట్లను యూజ్ చేస్తుంది.

ఇక వీటితో పాటు ఈ 5డోర్ల ఎస్యూవీలో మరికొన్ని మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్‌ఇడిఎస్, కొత్త ఎల్‌ఇడి డేటైమ్ రన్నింగ్‌ ల్యాంప్‌లు కూడా ఉండనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఫ్రంట్ గ్రిల్‌ను కూడా చేంజ్ చేసినట్లు తెలుస్తోంది.

థార్ 5-డోర్ వెర్షన్ ప్రస్తుత మోడల్‌లోని 2.2-లీటర్ డీజిల్, 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లను పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ట్రాన్స్మిషన్ కోసం ఈ కారు ఆరు స్పీడ్ MT, ఆరు-స్పీడ్ AT యూనిట్లను కలిగి ఉన్నట్లు సమాచారం.

Read More: కొత్త కార్లపై భారీ రాయితీలు..! ఎంతంటే?

అయితే ఈ థార్ 5-డోర్ ధరను లాంచ్ సమయంలో ప్రకటించనున్నారు. ఈ క్రమంలో దీని ధర ఎంత ఉంటుందో అని అనుకుంటుండగా.. తాజాగా కంపెనీ ఈ SUVని రూ. 12 నుండి 14 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేయగలదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ కొత్త SUV ఈ ఏడాది ఆఖరులో అమ్మకానికి రానున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

వెనుక డోర్ హ్యాండిల్స్‌ను సి-పిల్లర్‌పై ఏర్పాటు చేశారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేను ఇది సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఈ కార్ లాండౌర్‌లో హై ఆల్టిట్యూడ్ టెస్టింగ్ చూస్తూ కనిపించింది. అయితే వీటిని అన్ని రకాల వాతావరణాల్లో పరీక్షిస్తారు.

ఎందుకంటే కస్టమర్లు వీటిని కొనుగోలు చేసిన తర్వాత అన్ని కాలాల్లో ఉపయోగిస్తారు కావున.. కస్టమర్లకు ఎలాంటి సమస్యలు రాకుండా.. వీటిని ముందుగానే టెస్ట్ చేస్తారు.

Tags

Related News

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

Big Stories

Advertisement
×