Moto G Stylus Price: టెక్నాలజీ ప్రపంచంలో మరో కొత్త అద్భుతం వచ్చేసింది. మోటరోలా తాజా స్మార్ట్‌ఫోన్ Moto G Stylus (2025) ఇప్పుడు మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈసారి ఫోన్లో ఉన్న స్టైలస్ పక్కా స్టైల్‌కు తగ్గట్టు, పనికి తేలికగా ఉంటుంది. కేవలం మెసేజ్ టైప్ చేయడం మాత్రమే కాదు, స్కెచ్‌లు వేయడానికి, నోట్స్ రాసేందుకు, గూగుల్ సెర్చ్ చేయడానికే మాత్రమే కాదు. మరిన్ని స్పెషల్ AI ఫీచర్లతో వావ్ అనిపించేలా తీర్చిదిద్దింది మోటరోలా.
డ్రాయింగ్స్ కూడా..
ఈ ఫోన్ ఇన్‌బిల్ట్ స్టైలస్. గత మోడల్స్‌తో పోలిస్తే దీన్ని మరింత మెరుగుగా డిజైన్ చేశారు. ఇది ఇలా అర్థం చేసుకోవచ్చు. మనం స్కూల్‌లో పెన్నుతో రాసినట్టు, ఇప్పుడు ఈ స్టైలస్‌తో మన ఫోన్లో డ్రాయింగ్స్ చేయవచ్చు. స్కెచ్‌లను డిజైన్ చేయవచ్చు, టచ్ స్క్రీన్‌ను నావిగేట్ చేయవచ్చు. గమనికలు, సైన్‌లు, స్క్రీన్‌సొట్‌లపై గీతలు వేయడం అన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు.
స్పెసిఫికేషన్స్
-ప్రాసెసర్ 4nm టెక్నాలజీతో రూపొందించిన స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 చిప్‌సెట్. పనితీరు స్మూత్, బ్యాటరీ యూజ్ చాలా ఎఫిషియంట్‌గా ఉంటుంది.
-RAM & స్టోరేజ్: 8GB LPDDR4X RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు.
-ఆపరేటింగ్ సిస్టమ్: తాజా Android 15 పై రన్ అవుతుంది. ఫ్రెష్‌గా, యూజర్ ఇంటర్‌ఫేస్ సులభంగా ఉంటుంది.
డిజైన్, డిస్‌ప్లే
Moto G Stylus (2025) 6.7 అంగుళాల pOLED స్క్రీన్ ద్వారా వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది, అంటే స్క్రోల్ చేసినప్పుడు కళ్ళు చాలా సాఫ్ట్‌గా ఫీలవుతాయి. ఇంకా చెప్పాలంటే ఇది 3,000 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్ అందించగలదు. అంటే భానుడి కాంతిలోనూ క్లియర్‌గా కనపడుతుంది.
Read Also: Flat Buying Mistakes: ఫ్లాట్ కొంటున్నారా జాగ్రత్త..పొరపాటున …
కెమెరా
– ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్‌తో ప్రొఫెషనల్ టచ్!
-ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది:
-ప్రధాన కెమెరా: 50MP Sony LYTIA సెన్సార్‌తో డిటెయిల్స్ మిస్ కాకుండా ఉంటాయి
-అల్ట్రా వైడ్ కెమెరా: 13MP లెన్స్, ఇది మాక్రో ఫోటోలు కూడా తీయగలదు.
-ఫ్రంట్ కెమెరా: సెల్ఫీలు కోసం 32MP కెమెరాతో వీడియో కాల్స్, సోషల్ మీడియా పోస్ట్‌లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
-ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్. ఇది అనేక ఫ్రేమ్‌లను విశ్లేషించి వాటిని మిళితం చేస్తుంది. దీంతో కాస్త తక్కువ కాంతిలో కూడా బాగానే ఫోటోలు వస్తాయి.
-AI ఫీచర్లు: స్కెచ్ టు ఇమేజ్, సర్కిల్ టు సెర్చ్
-ఈ ఫోన్‌లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన AI ఫీచర్లు:
-Sketch to Image: స్టైలస్‌తో ఓ దృశ్యాన్ని డిజైన్ చేస్తే, అది ఒక వాస్తవిక చిత్రంగా మారుతుంది.
-Google Circle to Search: స్క్రీన్‌పై ఏదైనా విషయాన్ని గీత వేస్తే దానిపై గూగుల్ సెర్చ్ జరుగుతుంది. ఇది వన్‌టచ్ విజువల్ సెర్చ్ అనే చెప్పచ్చు.
బ్యాటరీ & ఛార్జింగ్:
బ్యాటరీ: 5,000mAh బ్యాటరీ. మామూలు వాడకానికి సరిగ్గా సరిపోతుంది.
చార్జింగ్: 68W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్. ఇది వేగంగా ఛార్జ్ అయిపోతుంది, వైర్ లేకపోయినా సరే.
కనెక్టివిటీ – ఫ్యూచర్ రెడీ!
-5G
-డ్యూయల్ 4G LTE
-Wi-Fi 5
-Bluetooth 5.4
-USB Type-C
-కనెక్టివిటీకి సంబంధించిన ఏ ఫీచర్ మిస్ కాలేదు. ఈ ఫోన్ పూర్తిగా ఫ్యూచర్ రెడీ అని చెప్పవచ్చు.
ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్
ధర: US మార్కెట్‌లో $399 (సుమారుగా రూ.33,000). 8GB + 256GB వేరియంట్. జిబ్రాల్టర్ సీ (లెదర్ ఫినిషింగ్‌తో), సర్ఫ్ ది వెబ్ (నీలం టోన్‌లో) కలర్లలో అందుబాటులో ఉంది. US: ఏప్రిల్ 17 నుంచి Amazon, BestBuy, Motorola వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. త్వరలో ఇండియాలో కూడా లాంచ్ కానుంది.