Devara:యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ), రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘దేవర’. ఈ చిత్రానికి కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ సినిమా విడుదయ్యి ఏడాది పూర్తి చేసుకున్నా.. ఇంకా టీవీల్లోకి రాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ విషయంలో చాలామంది ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ నుంచి అభిమానులు కూడా విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అలాంటి ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అయిపోయింది. మరి ఏ భాషలో ఎప్పుడు ఏ ఛానల్ లో ప్రీమియర్ కి వస్తుందో ఇప్పుడు చూద్దాం..
దేవర సినిమా హిందీలో అక్టోబర్ 26వ తేదీన స్టార్ గోల్డ్ లో ప్రీమియర్ కాబోతోంది. అలాగే తెలుగు వెర్షన్ స్టార్ మా లో, తమిళ్ వెర్షన్ విజయ్ టీవీ, కన్నడ వెర్షన్ స్టార్ సువర్ణ, మలయాళం వెర్షన్ ఏషియా నెట్ లో ప్రసారం కాబోతోంది. మిగతా భాషల టెలికాస్ట్ తేదీలు కూడా త్వరలోనే ప్రకటించనున్నారు చిత్ర బృందం . థియేటర్స్ లో హిట్ అయిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు టీవీ ప్రీమియర్ ద్వారా ప్రతి ఇంటికి చేరువ కాబోతోంది అని చెప్పవచ్చు.
దేవర సినిమా విషయానికి వస్తే.. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో సెప్టెంబర్ 27 2024న విడుదలైన ఈ సినిమా సైలెంట్ గా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తో తెచ్చుకున్నప్పటికీ.. క్రమంగా జనాల్లోకి ఎక్కడంతో.. ఈ సినిమాకి జనాలు నీరాజనం పట్టారు. అలా ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇకపోతే సాధారణంగా ఏ సినిమా అయినా సరే థియేటర్లలో విడుదలైన రెండు లేదా మూడు నెలలకే టీవీలోకి వస్తున్న విషయం తెలిసిందే. కానీ దేవర మాత్రం థియేటర్లలో విడుదలై ఏడాది అవుతున్నా.. ప్రీమియర్ కి రాకపోవడంతో అందరూ నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఏడాది తర్వాత టీవీ ప్రీమియర్ కి సిద్ధం అవుతోంది ఈ సినిమా. ఏది ఏమైనా విడుదలైన ఏడాది తర్వాత ఇలా టీవీ ప్రీమియర్ కి వదలడంతో అభిమానులు కూడా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
also read:OTT: నేరుగా ఓటీటీలోకి రాబోతున్న కొత్త మూవీ.. అదిరిపోయే క్యాప్షన్!
టీవీ ప్రీమియర్ ఆలస్యానికి కారణం ఏమిటి అంటే?.. ఈ సినిమాను ఇప్పటివరకు టీవీలో ప్రసారం చేయకపోవడానికి కారణం నెట్ ఫ్లిక్స్ తో తీసుకున్న ఒప్పందమే అని తెలుస్తోంది. ఈ మూవీని ఏడాది పాటు ఎక్స్క్లూజివ్ గా స్ట్రీమింగ్ చేసేలా నెట్ ఫ్లిక్స్ ఒప్పందం చేసుకున్నదట. అందుకోసం భారీ ధర కూడా చెల్లించిందని.. అందుకే ఈ చిత్రం టీవీలో ప్రసారం కాలేదు అని.. ఇప్పుడు ఒప్పందం ముగింపుకు రావడంతో టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరొకవైపు ఈ సినిమా శాటిలైట్ హక్కులకు సరైన ధర లేకపోవడం వల్ల మేకర్స్ కూడా ఇన్నాళ్లు ఈ సినిమా హక్కులను అమ్మలేదనే వార్తల కూడా వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఎట్టకేలకు టీవీ ప్రీమియర్ కి రాబోతోంది ఈ సినిమా. అటు థియేటర్లలో ఇటు ఓటీటీ లో సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు టీవీ లో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే.
Man Of Masses #Devara Satellite Rights With #JioStar 🔥
World Television Premieres Soon 🐯
Telugu By @Starmaa
Hindi By @StarGoldIndia Ocr26th 8PM
Tamil By @vijaytelevision
Kannada By @StarSuvarna
Malayalam by @asianet #DevaraWTPComingSoon 🔥@tarak9999 @anirudhofficial pic.twitter.com/MfPOxB5Qz7— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) October 12, 2025