Hyderabad: హైదరాబాద్‌లో ముసుగు దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా కొంపల్లిలో దేవేందర్ కాలనీలో.. దొంగలు రెండు ఇళ్లలోకి చొరబడ్డారు. ఇల్లంతా గాలించినప్పటికీ వారికి ఏమీ దొరకలేదు. తర్వాత ఆనందరావు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి కిలో వెండి, 12 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో తాము ఇంట్లో లేమని, అంత్యక్రియలకు వెళ్లామని ఆనందరావు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దొంగల కోసం గాలిస్తున్నారు.