Guava Leaves For Health: జామ పండు ఎంత మేలు చేస్తుందో… దాని ఆకులు కూడా అంతే అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ జామ ఆకులను లేదా వాటి కషాయాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇంతకీ జామ ఆకులు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యానికి జామ ఆకులతో కలిగే ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తి పెరుగుదల:
జామ ఆకుల్లో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ , క్వెర్సెటిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించడంలో సహాయ పడతాయి, తద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
రోగనిరోధక శక్తి పెంపు :
ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకుల కషాయం తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆకుల్లోని అధిక విటమిన్ సి కంటెంట్ తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి శరీరంలోకి ప్రవేశించే వైరస్లు , బ్యాక్టీరియాలతో పోరాడటానికి కీలకమైనవి. ప్రతిరోజూ ఈ కషాయం తీసుకోవడం వలన జలుబు, ఫ్లూ వంటి సాధారణ అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
బరువు తగ్గడం:
బరువు తగ్గాలనుకునే వారికి జామ ఆకుల కషాయం ఒక సహజ సిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు.. ఇది చక్కెరను సంక్లిష్ట కార్బోహైడ్రేట్లుగా మార్చే ఎంజైమ్‌లను అడ్డుకుంటుంది. ఫలితంగా,..తక్కువ చక్కెర గ్లూకోజ్‌గా మారి, శరీరంలో కొవ్వుగా నిల్వ అయ్యే ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరచడం ద్వారా కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయ పడుతుంది.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యం:
జామ ఆకుల్లోని శక్తి వంతమైన యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలు జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం వల్ల పొట్టలో హానికరమైన బ్యాక్టీరియా వృద్ధిని నియంత్రించి, ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాకు మద్దతు ఇస్తుంది. ఇది అజీర్ణం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయ పడుతుంది. పరి శుభ్రమైన జీర్ణ వ్యవస్థ రోగ నిరోధక శక్తి బలంగా ఉండటానికి పునాది వంటిది.
డయాబెటిస్ నియంత్రణ:
మధుమేహంతో బాధ పడేవారికి లేదా ప్రమాదం ఉన్నవారికి జామ ఆకుల కషాయం చాలా మేలు చేస్తుంది. ఈ ఆకుల్లోని సమ్మేళనాలు ఆహారం తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నియంత్రించడంలో సహాయ పడతాయి. ముఖ్యంగా.. ఉదయం తీసుకున్నప్పుడు, ఇది పగటిపూట రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి దోహదపడుతుంది.
Also Read: స్వీట్స్‌పై సిల్వర్ వార్క్.. తింటే ఎంత డేంజరో తెలుసా ?
జామ ఆకుల కషాయం తయారుచేసే విధానం:
జామ ఆకుల ప్రయోజనాలను పొందడానికి కషాయం తీసుకోవడం ఉత్తమ మార్గం.
5-6 లేత జామ ఆకులను శుభ్రం చేయాలి.
ఒక గిన్నెలో ఒక గ్లాసు నీరు పోసి, ఈ ఆకులను వేయాలి.
నీరు సగం అయ్యే వరకు 10-15 నిమిషాలు బాగా మరిగించాలి.
ఈ కషాయాన్ని వడకట్టి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.