Shalini Pandey-Deepika Padukone: ప్రస్తుతం ఇండస్ట్రీలో వర్కింగ్స్ అవర్స్ హాట్ టాపిక్గా నిలిచాయి. దీపికా పదుకొనె ఇటీవల చేసిన కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి. అన్ని రంగాల్లో ఉన్నట్టు సినీ పరిశ్రమ అంత కరెక్ట్ లేదని, ఇక్కడ కూడా ఎనిమిది గంటల వర్కింగ్స్ ఉండాలని దీపికా తన అభిప్రాయాన్ని తెలిపింది. అంతేకాదు కొందరు స్టార్ హీరోలు కేవలం 8 గంటల మాత్రమే పని చేస్తారని కూడా తెలిపింది. దీంతో ఆమె కామెంట్స్ ప్రస్తుతం సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యాయి. కాగా దీపికా తన డిమాండ్స్ వల్ల రెండు భారీ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. స్పిరిట్ మూవీ కోసం భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో పాటు రోజుకి 8 గంటలు మాత్రమే పని చేస్తానని ఆమె కండిషన్స్ పెట్టింది.
దీపికా ఈ కండిషన్స్ పెట్టడంతో సందీప్ రెడ్డి వంగా ఆమెను కాదని, త్రిప్తి డిమ్రీని తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు కల్కి 2 నుంచి కూడా దీపికాను తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండేకు దీనిపై ప్రశ్న ఎదురైంది. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ఆమెకు దీపికా కాంట్రవర్సిపై తన అభిప్రాయాన్ని అడిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. దీపికా డిమాండ్ న్యాయం ఉందని పేర్కొంది. “దీపికా పదుకొనె అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తూనే ఉన్నాను. నా స్కూలింగ్ నుంచి సినిమాల్లో తను ఎదిగారో చూస్తున్నాను. నటిగానే కాదు మెంటల్ హెల్త్ కోసం ఆమె చేస్తున్న అవగాహన చర్యలు ప్రశంసనీయం. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని చెప్పిన తొలి నటి, తొలి మహిళ కూడా తనే.
తన వల్లే మాలాంటి ఎంతో మంది మహిళలు మానసిక ఆరోగ్యంపై నిర్భయంగా బయటకు చెప్పగలుగుతున్నాం. తను ఒక అద్భుతం. అందుకే తను ఏం కావాలనుకుంటుందో అది పొందేల్సిందే. తనకు కావాల్సిందానిపై నిర్భయంగా మాట్లాడే అర్హత తనకుంది” అని షాలిని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. “ఇండస్ట్రీలో సమానత్వం (ఫీమేల్ నటులతో సమానమైన రెమ్యునరేషన్) కోసం మహిళ నటులు ఎన్నో ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటికీ మేము దాన్ని పొందలేకపోతున్నాం. సీనియర్ నటి షభానా అజిం వంటి నటిమణులు మహిళ శక్తి ఉంది. ఆమె మహిళ నటులందరి తరపున ఇండస్ట్రీలో ఉమెన్ రైట్స్ కోసం పోరాటం చేశారు. ఆమె వల్ల మా జనరేషన్కి ఎంతో మంచి జరిగింది. దానికి కొనసాగించే బాధ్యత ఇప్పుడు మాపై ఉంది.
కాబట్టి నేను అది పొందే వరకు మహిళ నటుల పట్ల పోరాటం చేస్తూనే ఉంటాను” అని చెప్పుకోచ్చింది. కాగా అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఇందులో ఆమె పోషించిన ప్రీతి పాత్ర ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. తొలి సినిమాతోనే ఆమె ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఈ చిత్రంతో యూత్లో విపరీతైమన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవుతుందనుకుంటే.. అవకాశాలు ఆమెను పెద్ద వరించలేదు. ఆడిపదపడ చిత్రాలతోనే కెరీర్ని నెట్టుకోస్తుంది. తెలుగు నుంచి బాలీవుడ్ వెళ్లిన ఆమె అక్కడ సహాయనటి పాత్రలు పోషిస్తోంది. ఇటీవల డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్‌తో తమిళంలో అడుగుపెట్టింది. ఇటీలవ ధనుష్, నిత్యామీనన్ల ఇడ్లీ కోట్టు సినిమాలో కీలక పాత్ర పోషించింది.