BigTV English

Silver Vark: స్వీట్స్‌పై సిల్వర్ వార్క్.. తింటే ఎంత డేంజరో తెలుసా ?

Silver Vark: స్వీట్స్‌పై సిల్వర్ వార్క్.. తింటే ఎంత డేంజరో తెలుసా ?

Silver Vark: స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పండగలు , పంక్షన్ల సమయంలో స్వీట్స్ ఉండాల్సిందే. ఇదిలా ఉంటే స్వీట్స్‌పై సిల్వర్ వార్క్ వాడటం మనం చూస్తూనే ఉంటాం. కాజు కట్లి, బర్ఫీ వంటి అనేక రకాల స్వీట్లపై సన్నటి వెండి రేకు పూతతో అలంకరించడం అనేది ఎన్నో రోజుగా కొనసాగిస్తున్నారు. ఈ వార్క్ స్వీట్లకు ఆకర్షణను అందించడమే కాక.. వెండికి సహజంగా ఉండే సూక్ష్మజీవుల నిరోధక లక్షణాల వల్ల ఆహారం ఎక్కువ కాలం పాడవ కుండా నిల్వ ఉంటుందని భావిస్తారు. అయితే.. ఈ వెండి వార్క్ పూర్తిగా సురక్షితమేనా? దీని వాడటం వెనక దాగి ఉన్న ఆరోగ్యపరమైన అంశాలు, సైడ్ ఎఫెక్ట్స్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.


నిజానికి.. నాణ్యత కలిగిన, స్వచ్ఛమైన వెండితో తయారు చేసిన వార్క్‌ను తక్కువ మొత్తంలో స్వీట్లపై ఉపయోగించి తిన్నప్పుడు అది శరీరానికి ఎటువంటి హాని కలిగించదు. స్వచ్ఛమైన వెండి అచేతన రూపంలో ఉంటుంది. అంటే జీర్ణ వ్యవస్థలో కలిసిపోకుండా.. కరిగిపోకుండా సహజంగానే శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది. యూరోపియన్ యూనియన్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా వెండిని ఆహార పదార్థాలపై ఉపయోగించవచ్చని తెలిపాయి.

వార్క్‌లో కల్తీ :
వెండి వార్క్ వాడకంలో అసలు సమస్య నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని, కల్తీ చేసిన వార్క్ నుంచి తలెత్తుతుంది. పండగ సీజన్లలో స్వీట్ల డిమాండ్ పెరిగినప్పుడు.. కొందరు వ్యాపారులు అధిక లాభాల కోసం వార్క్‌లో కల్తీకి పాల్పడుతుంటారు.


సైడ్ ఎఫెక్ట్స్:

అల్యూమినియం వినియోగం: అత్యంత సాధారణంగా జరిగే కల్తీ ఇది. వెండి ఖరీదైనది కాబట్టి, దాని స్థానంలో తక్కువ ధరకే దొరికే అల్యూమినియం రేకును ఉపయోగిస్తారు. అల్యూమినియం వార్క్ అనేది ఆరోగ్యానికి హానికరం. దీన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు, అల్యూమినియం శరీర కణజాలాలలో.. ముఖ్యంగా మెదడులో పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసు అవకాశం కూడా ఉంటుంది.

హెవీ మెటల్స్ : నాణ్యత లేని వర్క్‌లో నికెల్, కాడ్మియం, లెడ్ వంటి ఇతర విషపూరిత హెవీ మెటల్స్ (భారీ లోహాలు) జాడలు కూడా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ లోహాలు శరీరంలో విషపూరిత ప్రభావాలను చూపగలవు.

అపరిశుభ్రమైన తయారీ : వార్క్ తయారీ పరిశుభ్రత లేని వాతావరణంలో జరుగుతున్నప్పుడు.. అందులో బ్యాక్టీరియా, కాలుష్యం చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

జంతు ఉత్పత్తుల వాడకం: సాంప్రదాయ పద్ధతుల్లో సిల్వర్ వార్క్ అతి సన్నగా ఉండటానికి ఆవు లేదా గేదెల పేగుల పొరలను ఉపయోగించేవారు. అయితే.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విధానాన్ని నిషేధించింది. ప్రస్తుతం ఆధునిక, పరిశుభ్రమైన యంత్రాలు లేదా ప్రత్యేకంగా రూపొందించిన కాగితం/పాలిస్టర్ షీట్లను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ.. ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించని తయారీదారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

Also Read: క్యాన్సర్ గుర్తించడానికి.. ఏ టెస్టులు చేస్తారు ?

స్వచ్ఛతను గుర్తించడం ఎలా ?
వేలి పరీక్ష: మిఠాయిపై ఉన్న వెండి రేకును వేలితో రుద్దండి. అది పూర్తిగా అదృశ్యమైతే లేదా మీ వేలికి అంటుకోకుండా పోతే.. అది స్వచ్ఛమైన వెండి అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అది బూడిద రంగులో మీ వేలికి గట్టిగా అంటుకుపోతే.. అది అల్యూమినియం అయి ఉండొచ్చు.

వార్క్‌లో కాస్త భాగాన్ని తీసుకుని మండించడానికి ప్రయత్నించండి. స్వచ్ఛమైన సిల్వర్ వార్క్ మండకుండా ఒక చిన్న ముద్దలా మారుతుంది. అల్యూమినియం రేకు అయితే పూర్తిగా కాలిపోయి బూడిదలా లేదా నల్లటి బూడిదలా మిగులుతుంది.

సిల్వర్ వార్క్ వాడటం ఆరోగ్యానికి పూర్తిగా హానికరమని చెప్పలేం, కానీ దాని నాణ్యత విషయంలో అప్రమత్తత చాలా అవసరం. కల్తీ లేని, స్వచ్ఛమైన, FSSAI ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన వార్క్‌ను మాత్రమే ఉపయోగించే స్వీట్ షాపుల నుంచి కొనుగోలు చేయడం మంచిది. వార్క్ లేని స్వీట్స్ కొనడం ద్వారా కూడా కల్తీ ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చు. ఆహారం యొక్క అందం కంటే, మన ఆరోగ్యం ఎల్లప్పుడూ ముఖ్యమైనదని గుర్తుంచుకోండి.

Tags

Related News

Guava Leaves For Health: జామ ఆకులు తింటే.. ఆశ్చర్యకర లాభాలు!

Mirror: ఈ రహస్యం తెలిస్తే అద్దం చూడడానికి కూడా భయపడతారు.. శాస్త్రం చెబుతున్న భయంకర నిజం..

Cancer Tests: క్యాన్సర్ గుర్తించడానికి.. ఏ టెస్టులు చేస్తారు ?

Lucky life partner: ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీరు లక్కీ! ఎందుకంటే..

Custard Apple: సీతాఫలం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే.. షాక్ అవుతారు

Fruits: ఎక్కువ ఫైబర్ ఉండే ఫ్రూట్స్ ఏవో తెలుసా ?

Health Tips: డైలీ ఈ 3 కలిపి తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు తెలుసా ?

Big Stories

×