Moto Razr 50D : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటో (Moto) త్వరలోనే అదిరిపోయే ఫోల్జబుల్ మొబైల్ (Foldable Mobiles)ను తీసుకురావడానికి సిద్ధమవుతుంది. డిసెంబర్ 19న లాంఛ్ కానున్న ఈ మొబైల్ ఫీచర్స్ పై ఇప్పటికే టెక్ వర్గాలు ఓ అంచనాకి వచ్చేసినప్పటికీ తాజాగా ఈ ఫీచర్స్ లీకై స్మార్ట్ గ్యాడ్జెట్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి.
Moto Razr 50D ఫోల్డబుల్ మెుబైల్ డిసెంబర్ 19న లాంఛ్ కాబోతుంది. ఇక ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8GB RAM, 50MP ప్రైమరీ సెన్సార్ వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. మెుదటగా ఈ మెుబైల్ జపాన్ లో లాంఛ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో జపాన్ మొబైల్ ఆపరేటర్ NTT డొకోమో వెబ్‌సైట్ ఈ ఫోన్ ఫీచర్స్ ను వెల్లడించింది. Motorola అధికారికంగా ఈ ఫీచర్స్ ను ధృవీకరించనప్పటికీ.. విడుదల తేదీ, స్పెసిఫికేషన్‌లు, Motorola ద్వారా రాబోయే స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలను సైతం తెలిపింది.
ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం లేటెస్ట్ మొబైల్స్ అందుబాటులోకి తీసుకువస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా… తాజాగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ జపనీస్ మార్కెట్‌లో JPY 1,14,950 ధరకు అందుబాటులో ఉంటుంది. అంటే ఇండియా మార్కెట్లో దీని ధర రూ. 65,000గా ఉండనుంది. ఇప్పటికే జపాన్ వినియోగదారులు ప్రీ రిజర్వేషన్‌ల కోసం బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ప్రీ కొనుగోళ్లు డిసెంబర్ 17 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి.
Moto Razr 50D Specifications –
స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు –
Moto Razr 50D వైట్ మార్బుల్ కలర్ లో అందుబాటులో ఉంటుంది. డిజైన్ Moto Razr 50కి సమానంగా ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల pOLED ఇన్నర్ డిస్‌ప్లే, 3.6 అంగుళాల ఔటర్ డిస్‌ప్లేతో రాబోతుంది. ఇది 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చేస్తుంది. ఇక MediaTek డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ తో పాటు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ తో IPX8తో రాబోతుంది. ఇక ఇందులో డాల్బీ అట్మోస్ సపోర్ట్, స్టీరియో స్పీకర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.
కెమెరా –
Moto Razr 50D మెుబైల్ లో కెమెరా ఫీచర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ షూటర్, 13MP సెకండరీ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీడియో కాల్‌లు, సెల్ఫీల కోసం ఇందులో 32MP ఫ్రంట్ స్నాపర్ సైతం ఉంది ఇంకా Moto Razr 50 ఒరిజినల్ వేరియంట్ 4200mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతుంది. కాబట్టి, రాబోయే Razr వేరియంట్‌లో సైతం బ్యాటరీ ఇదే స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తుంది.
NTT డొకోమో వెబ్‌సైట్ ఈ వివరాలను వెల్లడించినప్పటికీ పూర్తి స్థాయి ఫీచర్స్ త్వరలోనే తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా మోటోరోలా ఇప్పటి వరకు ఈ ఫీచర్స్ ను అధికారికంగా ధ్రువీకరించలేదు కాబట్టి టెక్ ప్రియులకు మరింత క్లారిటీ కావాలంటే డిసెంబర్ 19 వరకూ ఆగాల్సిందే.
ALSO READ : బెస్ట్ గేమింగ్ మానిటర్స్ పై అదిరే ఆఫర్స్.. మళ్లీ ఇలాంటి సేల్ రాదండోయ్