Best Gaming Monitors Under Rs 25K : గేమింగ్ ఎక్సపీరియన్స్ ను మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా? బెస్ట్ గేమింగ్ మానిటర్ కోసం చూస్తున్నారా? అయితే మీ కోసం తక్కువ ధరలో బెస్ట్ మానిటర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి ప్రముఖ గ్యాడ్జెట్ తయరీ కంపెనీలు.
రూ.25వేలలోపే బెస్ట్ గేమింగ్ మానిటర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో సామ్ సాంగ్, ఎల్ జీ, వ్యూసోనిక్, ASUS, లెనోవో వంటి టాప్ బ్రాండ్ కంపెనీలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మరి తక్కువ ధరకే బెస్ట్ గేమింగ్ మానిటర్స్ కొనాలనుకునే వినియోగదారులు ఈ లిస్ట్ పై ఓ లుక్కేయండి.
LG Electronics Gaming Monitor –
LG 3840 X IPS డిస్‌ప్లే, HDR10 సపోర్ట్, ఫ్రీసింక్, రెండు HDMI పోర్ట్‌లు, డిస్‌ప్లే పోర్ట్, హెడ్‌ఫోన్ పోర్ట్, డైనమిక్ యాక్షన్ సింక్, స్క్రీన్ కంట్రోల్ తో వచ్చేసింది. ఇక ఈ గేమింగ్ మానిటర్‌ను అమెజాన్ ఇండియా నుండి అసలు ధరపై 44% తగ్గింపుతో రూ. 24,999కి పొందవచ్చు.
Samsung Odyssey G5 –
Samsung Odyssey G5 గేమింగ్ మానిటర్ 27-అంగుళాల QHD డిస్‌ప్లే, 180Hz రిఫ్రెష్ రేట్, AMD ఫ్రీసింక్, HDMI పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, పివోట్ అడ్జస్ట్ స్టాండ్ తో వచ్చేసింది. ఇక అమెజాన్ ఇండియా నుండి దాని అసలు ధర రూ. 31,600 కాగా ఆఫర్ లో రూ. 23,799కి కొనుగోలు చేయవచ్చు.
ASUS gaming monitor –
Asus VA24DCP HD IPS ప్యానెల్, 75Hz రిఫ్రెష్ రేట్, 65W పవర్ డెలివరీ, స్పీకర్లు, తక్కువ బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ, ఫ్రేమ్‌లెస్ డిస్‌ప్లే ప్యానెల్, ఐ కేర్ మోడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ గేమింగ్ మానిటర్ అమెజాన్ లో రూ. 22,694కి అందుబాటులో ఉంది.
ViewSonic VX3219 –
వ్యూసోనిక్ గేమింగ్ మానిటర్ 32-అంగుళాల 2K QHD డిస్‌ప్లే, 165HZ రిఫ్రెష్ రేట్, రెండు HDMI పోర్ట్‌లు, ఐ ప్రోటెక్, బ్లూ లైట్ ఫిల్టర్ తో వచ్చేసింది. ఈ గేమింగ్ మానిటర్ ను అమెజాన్ ఇండియాలో అసలు ధరపై 52% తగ్గింపుతో రూ. 23,999కి అందుబాటులో ఉంది.
MSI MAG 27CQ6F –
MSI MAG 27CQ6F అనేది 27-అంగుళాల 2K WQHD డిస్‌ప్లే, 180Hz రిఫ్రెష్ రేట్, HDMI 2.0 పోర్ట్, అడాప్టివ్ సింక్, AI విజన్, డైనమిక్ కాంట్రాక్ట్‌లతో లాంఛ్ అయింది. ఇక దీని ధర అమెజాన్ ఇండియాలో రూ. 23,499గా ఉంది.
ViewSonic VX2758A 2K PRO 3 –
వ్యూసోనిక్ VX2758A QHD 2K గేమింగ్ డిస్‌ప్లే, HDR10 సపోర్ట్, ఐ కేర్, రెండు HDMI పోర్ట్‌లు, డిస్‌ప్లే పోర్ట్, 240Hz రిఫ్రెష్ రేట్ తో అందుబాటులో ఉంది. ఈ గేమింగ్ మానిటర్ అమెజాన్ ఇండియా అసలు ధర రూ. 34,000కాగా ప్రస్తుతం రూ. 21,490కే అందుబాటులో ఉంది.
Zebronics N32A –
ఈ గేమింగ్ మానిటర్ 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 180Hz రిఫ్రెష్ రేట్, రెండు HDMI పోర్ట్‌లు, HDR10 సపోర్ట్, అడాప్టివ్ సింక్, 16:9 యాస్పెక్ట్ రేషియోతో QHD యాంటీగ్లేర్ డిస్‌ప్లేతో వచ్చేసింది. ఇక దీని ధర అమెజాన్ లో రూ. 22,999గా ఉంది.
Lenovo Legion R27q-30 –
2K QHD గేమింగ్ ప్యానెల్, AMD ఫ్రీసింక్, రెండు HDMI పోర్ట్‌లు, పైవట్, తక్కువ బ్లూ లైట్ మోడ్, 178-డిగ్రీ వ్యూ తో వచ్చేసింది. ఇక దీని అసలు ధర రూ.29,890 కాగా అమెజాన్ లో రూ. 23,299కే అందుబాటులో ఉంది.
ALSO READ : వివో, ఐక్యూ, వన్ ప్లస్.. ఈ మూడింటిలో ఏది బెస్ట్ కెమెరా మెుబైల్ ఏది?