BigTV English

Motorola Edge 50 Neo: అయ్యబాబోయ్.. మోటో నుంచి మరో కొత్త ఫోన్.. ధరెమో గానీ ఫీచర్లు కుమ్మేసాయ్ గురూ..!

Motorola Edge 50 Neo: అయ్యబాబోయ్.. మోటో నుంచి మరో కొత్త ఫోన్.. ధరెమో గానీ ఫీచర్లు కుమ్మేసాయ్ గురూ..!

Motorola Edge 50 Neo Launched: Motorola కంపెనీ పలు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ హవా చూపిస్తోంది. తరచూ ఏదో మొబైల్‌ను దేశీయ మార్కెట్‌లో పరిచయం చేస్తూ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. తాజాగా మోటోరోలో కొత్త స్మార్ట్‌ఫోన్ Motorola Edge 50 Neo ని లాంచ్ చేసింది. కంపెనీ దీనిని 120Hz OLED డిస్‌ప్లేతో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో వెనుక ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్‌ను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ 3000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డిస్ప్లేపై గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అందించబడింది. ఫోన్ 12GB LPDDR4x RAM + 512GB UFS 3.1 స్టోరేజ్ కలిగి ఉంది. ఇది 4,310mAh బ్యాటరీతో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా కలిగి ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్లు, ఇతర వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.


Motorola Edge 50 Neo Specifications

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ 1.5K (2670 x 1220 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 6.4-అంగుళాల P-OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే 3000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ సేఫ్టీ కూడా అందించబడింది. డిస్ప్లేపై గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అందించబడింది. అలాగే ప్రాసెసింగ్ కోసం స్మార్ట్‌‌ఫోన్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది 12 GB RAM + 512 GB స్టోరేజ్‌తో వస్తుంది.


అంతేకాకుండా ఈ ఫోన్ 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4310mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా ఉంది. 50 మెగాపిక్సెల్స్ ప్రధాన లెన్స్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్ కూడా ఉంది. అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.

Also Read: అద్భుతం.. మహాద్భుతం.. ఐఫోన్ లాంటి ఫోన్.. కేవలం రూ.7299లకే లాంచ్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్..!

అలాగే ఫోన్‌లో డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం ఇది డ్యూయల్ సిమ్‌తో పాటు Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, NFC, USB-C మద్దతును కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హలో UIతో ఫోన్ రన్ అవుతుంది. ఇది దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా ఈ ఫోన్‌కి MIL-STD 810H సర్టిఫికేషన్ కూడా ఇవ్వబడింది.

Motorola Edge 50 Neo Price

Motorola Edge 50 Neo ఫోన్ 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ అయింది. దీని ధర £449.99 (సుమారు రూ. 50,000)గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ Poinciana, Latte, Grisaille, Nautical Blue వంటి షేడ్స్‌లో పరిచయం చేయబడింది. కంపెనీ ఈ ఫోన్‌ను UKలో లాంచ్ చేసింది. త్వరలో దీనిని ఇతర మార్కెట్‌లలో కూడా ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తుంది. ఇందులో భారతదేశం కూడా ఉంటుందని తెలుస్తోంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×