E-Paper
Advertisement

Road Accident: మహబూబ్ నగర్లో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident: మహబూబ్ నగర్లో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Advertisement

Road Accident in Mahabub Nagar: మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. భూత్పూర్ మండలం తాటికొండ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం ను ఢీ కొట్టిన కారు.. దాని కిందికి చొచ్చుకుని వెళ్లింది.

Also Read: మాచర్లలో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై తండ్రి ఘాతుకం

Advertisement

ప్రమాదంలో కారు ముందు భాగమంతా నుజ్జునుజ్జవ్వగా.. అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా తిరుపతి నుంచి కర్నూల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్తుండగా.. మధ్యలో బైక్ ను తప్పించబోయి డీసీఎంను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతులంతా హైదరాబాద్ కు చెందినవారిగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలిసిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×