E-Paper
Advertisement

వైఫై 6 Vs వైఫై 7..స్మార్ట్ హోమ్, గేమింగ్‌కు ఏది బెస్ట్?

వైఫై 6 Vs వైఫై 7..స్మార్ట్ హోమ్, గేమింగ్‌కు ఏది బెస్ట్?
Advertisement

Wi-Fi 6 vs Wi-Fi 7: ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే.. చిరాగ్గా ఉంటుంది కదా! 4K స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు.. బఫరింగ్ వస్తే మూడ్ అంతా పాడైపోతుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి వై-ఫై 7 టెక్నాలజీ దూసుకొచ్చింది. ఇప్పటి వరకూ వాడుతున్న వై-ఫై 6 కంటే.. ఇది చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. అయితే.. కొత్త రూటర్ కొనగానే మీ ఇంటర్నెట్ స్పీడ్ రాకెట్‌లా పెరుగుతుందా? లేక అది మీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుందా? వీటికి సంబంధించిన వివరాలు పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.

వై-ఫై 6 vs వై-ఫై 7 :

మన ఇంట్లో స్మార్ట్ టీవీలు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచీలు ఇలా డివైజ్‌ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఒకేసారి అన్ని డివైజ్‌లు ఇంటర్నెట్ వాడితే నెట్‌వర్క్ స్లో అవుతుంది. దీన్ని తట్టుకోవడానికి.. వచ్చిన టెక్నాలజీ వై-ఫై 6 (802.11ax). ఇది రద్దీగా ఉండే ప్రదేశాల్లో డేటాను స్మార్ట్‌గా పంచుతుంది. కానీ ఇప్పుడు దాని నెక్స్ట్ వెర్షన్ వై-ఫై 7 (802.11be) గేమ్‌నే మార్చేస్తోంది.

వై-ఫై 7లో ఉన్న స్పెషల్ ఫీచర్లు ఏంటి?

Advertisement

వై-ఫై 7ను సాధారణంగా “ఎక్స్‌ట్రీమ్లీ హై త్రూపుట్” అంటారు. వై-ఫై 6తో పోలిస్తే ఇందులో అదిరిపోయే మార్పులు ఉన్నాయి.

మల్టీ-లింక్ ఆపరేషన్ : పాత వై-ఫైలో మీ ఫోన్ ఒకేసారి ఒక్క బ్యాండ్ (2.4 GHz లేదా 5 GHz)తోనే కనెక్ట్ అవుతుంది. కానీ వై-ఫై 7లో ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాండ్‌లతో కనెక్ట్ కావచ్చు. దీని వల్ల స్పీడ్ పెరుగుతుంది. అంతే కాకుండా కనెక్షన్ కట్ అవ్వకుండా స్టేబుల్‌గా ఉంటుంది.

Advertisement

డబుల్ ఛానల్ విడ్త్ (320 MHz): వై-ఫై 6లో గరిష్టంగా 160 MHz ఛానల్ ఉండగా.. వై-ఫై 7లో అది 320 MHzకు పెరిగింది. అంటే డేటా వెళ్లడానికి హైవేను డబుల్ చేసినట్టే.

4096-QAM: ఇది తక్కువ స్పేస్‌లో.. ఎక్కువ డేటాను ప్యాక్ చేసి వేగంగా పంపడానికి సహాయ పడుతుంది.

6 GHz బ్యాండ్ సపోర్ట్: భారత్‌లో లోయర్ 6 GHz బ్యాండ్ (5925–6425 MHz) ఇండోర్ వాడకానికి అనుమతి లభించడంతో వై-ఫై 7కు మంచి ఊపు వచ్చింది. ఈ బ్యాండ్‌లో ట్రాఫిక్ తక్కువగా ఉండటం వల్ల లాగ్ బాగా తగ్గుతుంది.

కొత్త రూటర్ కొంటే.. ఇంటర్నెట్ వేగం పెరుగుతుందా?

ఇక్కడే చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. కొత్త రౌటర్ కొనడం వల్ల మీ ఇంటర్నెట్ ప్లాన్ స్పీడ్ మారదు. ఉదాహరణకు.. మీ ఇంట్లో 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఉంటే, మీరు లక్ష రూపాయల వై-ఫై 7 రూటర్ పెట్టినా బయటి నుంచి వచ్చే ఇంటర్నెట్ వేగం 100 Mbps వరకే ఉంటుంది. అయితే.. లోకల్ నెట్‌వర్క్ వేగం మాత్రం కచ్చితంగా పెరుగుతుంది. ఇంట్లో ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కు పెద్ద ఫైల్స్ పంపడం, గేమింగ్, లేదా మీది 1 Gbps కంటే.. ఎక్కువ స్పీడ్ ఉన్న హై-ఎండ్ ప్లాన్ అయితే వై-ఫై 7 తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే.. మీ పాత రూటర్ చాలా ఏళ్ల క్రితానిది (వై-ఫై 4 లేదా 5) అయితే, కనీసం మంచి వై-ఫై 6 రూటర్‌కు మారినా నెట్‌వర్క్ వేగం మెరుగుపడుతుంది.

ఏది తీసుకుంటే బెస్ట్?

మీ బ్రాడ్‌ బ్యాండ్ స్పీడ్ సాధారణంగా 100 Mbps నుంచి 300 Mbps మధ్యలో ఉంటే, ప్రస్తుతానికి మంచి వై-ఫై 6 రూటర్ సరి పోతుంది. వై-ఫై 7 రూటర్లు, దానికి సపోర్ట్ చేసే లేటెస్ట్ ఫోన్లు/ల్యాప్‌టాప్‌లు రెండూ ఉంటేనే ఫుల్ బెనిఫిట్ దొరుకుతుంది. లేదంటే అనవసర ఖర్చు అవుతుంది.

Related News

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదెక్కడి మాస్ అప్డేట్ భయ్యా.. స్టోరీ పెట్టాక కూడా మ్యూజిక్, టెక్స్ట్ మార్చుకోవచ్చు!

13 ఏళ్ల తర్వాత వచ్చిన GTA 6 ఎలా ఉంది? ఇదిగో ఫుల్ రివ్యూ!

జియోలో ఈ ప్లాన్ గురించి తెలుసా? 300GB డేటా, నెట్ ఫ్లిక్స్, అమెజాన్.. లిస్ట్ చాలా పెద్దదే బాస్!

చలి వణికిస్తోందా?రూ.1,499కే దొరికే ఈ రూమ్ హీటర్‌తో ఇల్లు వెచ్చగా మార్చుకోండి

రూ.17,490కే బ్రాండెడ్ డిష్‌వాషర్..ఇక మీ కిచెన్ కష్టాలకు ఫుల్ స్టాప్

ఎయిర్‌టెల్ ‘ఇన్‌సైడర్’ ప్రోగ్రామ్.. యూజర్లకు రూ.30,000కు పైగా బెనిఫిట్స్.. ఎలా పొందాలంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులపై మెటా కొరడా.. అల్గారిథమ్‌లో భారీ మార్పులు!

Big Stories

Advertisement
×