BigTV English

Smartphones Under ₹15000: రూ.15 వేలల్లో అదిరిపోయే ఫోన్లు.. ఫీచర్లు మాత్రం నెక్స్ట్ లెవల్ అంతే..!

Smartphones Under ₹15000: రూ.15 వేలల్లో అదిరిపోయే ఫోన్లు.. ఫీచర్లు మాత్రం నెక్స్ట్ లెవల్ అంతే..!
Advertisement

Smartphones Under ₹15,000 Only: ఇటీవల కాలంలో ఈ కామర్స్‌ సంస్థలు స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు కేవలం ప్రత్యేకంగా కొన్ని సేల్స్‌ తీసుకొచ్చి ఆ సమయంలో మాత్రమే డిస్కౌంట్స్‌ అందించే వారు. కానీ ప్రస్తుతం సేల్స్‌తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్‌లపై ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలో మీరు చాలా కాలంగా మీ స్మార్ట్‌ఫోన్‌ను 5Gకి అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీ కోసం టాప్ కంపెనీల నుండి 15 వేల కంటే తక్కువ బడ్జెట్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. అంతేకాకుండా వీటిని ఆఫర్లలో కొనుగోలు చేయవచ్చు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.


Realme 12x 5G
Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ కొన్ని ముఖ్యమైన ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz అధిక రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. Realme ఈ ఫోన్ గరిష్టంగా 950 nits పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది మాత్రమే కాదు ఫోన్ పగలకుండా ఉండేందుకు పాండా గ్లాస్ ప్రొటక్షన్ కూడా ఉంది.

Realme ఈ బడ్జెట్ 5G ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో డైమెన్షన్ 6100+ ప్రాసెసర్ ఉపయోగించారు. మేము ఈ ఫోన్ ధర గురించి మాట్లాడినట్లయితే మీరు ఈ ఫోన్ బేస్ వేరియంట్‌ను రూ. 11,999కి కొనుగోలు చేయవచ్చు. 4GB RAM/128GB స్టోరేజ్ బేస్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. అదే 8GB RAM కోసం మీరు రూ 14,999 చెల్లించాలి. అమోజాన్‌ దీనిపై 25 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.


Also Read: జబర్దస్త్ ఆఫర్.. చీపెస్ట్ ఫోన్‌పై రూ.5,500 డిస్కౌంట్!

Samsung Galaxy F15 5G
Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్‌‌లో 6.5 అంగుళాల Full HD+ sAMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 90Hz అధిక రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో డైమెన్షన్ 6100+ ప్రాసెసర్ ఉపయోగించారు. స్టోరేజ్ ఆప్షన్ గురించి మాట్లాడినట్లయితే ఈ ఫోన్ 4GB/128GB, 4GB/128GB స్టోరేజ్ వేరియంట్‌లను కలిగి ఉన్న రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్  బేస్ వేరియంట్‌ను రూ. 12,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. Galaxy F15 5Gని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ దీనిపై 14 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.

Motorola G64 5G
Motorola G64 5G స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల పూర్తి HD+ IPC LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 560 nits పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్  ఆండ్రాయిడ్ 14 OS ఆధారంగా ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. ఫోన్‌లో MediaTek Dimension 7025 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. పవర్ కోసం 6,000 mAh పెద్ద బ్యాటరీ ఉంది.

Also Read: పెద్ద అప్‌గ్రేడ్‌లతో ఐఫోన్ 16.. సెప్టెంబర్‌లో లాంచ్.. ఫీచర్లు చూస్తే రచ్చే!

ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 8GB RAM/128GB, 12GB RAM/256GB స్టోరేజ్ ఆప్షన్‌లతో కూడిన రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. మీరు ఈ ఫోన్ బేస్ వేరియంట్‌ను రూ. 14,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ దీనిపై 24 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.

Related News

Amazon Offers: 99 రూపాయలకే మొబైల్‌ ఫోన్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో అదిరే ఆఫర్

Samsung Galaxy Ultra Neo: 6000mAh బ్యాటరీతో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. బడ్జెట్‌లో అల్ట్రా అనుభవంతో శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్

VIVO X90 Pro 2025: డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌తో వివో X90 ప్రో లాంచ్,.. స్టాక్ అయిపోయేలోపే ఫోన్ కొనేయండి

Realme GT 8 Pro: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, 320W ఛార్జింగ్.. ఫ్లాగ్‌షిప్ అనుభవంతో రియల్‌మీ GT 8 ప్రో.. ధర ఎంతంటే?

Realme Gaming Phone: రియల్ మి ఫ్లాగ్‌షిప్ గేమింగ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్.. రూ.60 వేల ఫోన్ ఇప్పుడు రూ.42000కే

Smartphone Comparison: హానర్ మ్యాజిక్ 8 vs వన్‌ప్లస్ 13 vs గెలాక్సీ S25 5G.. ఏది బెస్ట్?

Motorola Moto G85 5G: 7800mAh బ్యాటరీ, 120డబ్య్లూ ఫాస్ట్ ఛార్జింగ్.. హై ఎండ్ ఫీచర్లతో మోటొ ఫోన్ బడ్జెట్ ధరలో..

Free Wifi Hacking: ఉచిత వైఫైతో ప్రమాదం… మీ ఫోన్, కంప్యూటర్ అంతా హ్యాక్.. ఈ జాగ్రత్తలు పాటించండి

Big Stories

×