Honor Magic 8 vs OnePlus 13 vs Galaxy S25 5G| స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడు కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు మధ్య పోటీ ఏర్పడింది. హానర్ మ్యాజిక్ 8, వన్‌ప్లస్ 13, సామ్‌సంగ్ గెలాక్సీ S25 5G ఫీచర్ల పరంగా స్మార్ట్ ఫోన్ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రతి ఫోన్ లో వేర్వేరు బలమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లను పోల్చి.. మీరు ఏది కొనుగోలు చేయాలో నిర్ణయించుకోండి.
హానర్ మ్యాజిక్ 8 మంచి స్టోరేజ్ ఆప్షన్‌లతో ప్రీమియం ధరలో లభిస్తుంది. వన్‌ప్లస్ 13లో 12GB RAM/256GB స్టోరేజ్ మోడల్ రూ. 61,999కి, 16GB RAM/512GB మోడల్ రూ. 68,999కి ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ S25 5G ప్రారంభ ధర రూ. 74,999, 512GB మోడల్ రూ. 86,999 సుమారు. మంచి విలువ కోసం వన్‌ప్లస్ 13 బెస్ట్ ఎంపిక.
హానర్ మ్యాజిక్ 8లో 6.58 ఇంచ్ ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది. దీని బ్రైట్‌నెస్ 120Hz రిఫ్రెష్ రేట్. వన్‌ప్లస్ 13లో 6.82 ఇంచ్ క్వాడ్ HD+ LTPO పెద్ద డిస్‌ప్లే ఉంది. 1440 x 3168 పిక్సెల్ రిజల్యూషన్‌తో ఇది వస్తుంది. సామ్‌సంగ్ S25 5Gలో 6.2 ఇంచ్ ఫుల్ HD+ డైనమిక్ AMOLED డిస్‌ప్లే, 2600 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. మూడింటిలో హానర్ మ్యాజిక్ 8 డిస్‌ప్లే బెటర్.
మూడు ఫోన్‌లు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. హానర్ మ్యాజిక్ 8లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, వన్‌ప్లస్ 13, సామ్‌సంగ్ S25లో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఉన్నాయి. అందుకే మూడూ టాప్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయి.
హానర్ మ్యాజిక్ 8 మ్యాజిక్‌ఓఎస్ 10తో, ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేస్తుంది. వన్‌ప్లస్ 13లో ఆక్సిజెన్‌ఓఎస్, ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతుంది. సామ్‌సంగ్ S25లో వన్ UI 7, ఆండ్రాయిడ్ 15తో పనిచేస్తుంది. మీకు ఏ సాఫ్ట్‌వేర్ ఇష్టమో దాని ఆధారంగా ఎంచుకోండి. హానర్ లేటెస్ట్ సాఫ్ట్ వేర్ తో వస్తుంది.
హానర్ మ్యాజిక్ 8లో ట్రిపుల్ రియర్ కెమెరా వస్తుంది. మూడు కూడా 50MP, 64MP టెలిఫోటో జూమ్‌తో వస్తాయి. ఫ్రంట్ లో 50MP కెమెరా ఉంది. వన్‌ప్లస్ 13లో హాసెల్‌బ్లాడ్ ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా, పెరిస్కోప్ టెలిఫోటో ఫీచర్లు ఉన్నాయి. సామ్‌సంగ్ S25లో 50MP మెయిన్, 10MP అల్ట్రావైడ్, 12MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసమైతే వన్‌ప్లస్ బెటర్.
హానర్ మ్యాజిక్ 8 బరువు 205g, మందం 7.95mm. వన్‌ప్లస్ 13 213g, మందం 8.9mm. సామ్‌సంగ్ S25 అతి తేలికైంది – 162g, 7.2mm మందం. కాంపాక్ట్ డిజైన్ కోసం సామ్‌సంగ్ బెస్ట్.
మూడూ 5G, వై-ఫై, బ్లూటూత్, NFC కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తాయి. సామ్‌సంగ్ S25 లో డ్యూయెల్ SIM ఆప్షన్ ఉంది. హానర్, వన్‌ప్లస్ కూడా పూర్తి కనెక్టివిటీ ఇస్తాయి. అన్నీ USB టైప్-C చార్జింగ్ పోర్ట్‌తో వస్తాయి.
బ్రైట్ డిస్‌ప్లే కోసం హానర్ మ్యాజిక్ 8 ఎంచుకోండి. ధర పరంగా వన్‌ప్లస్ 13 బెటర్. కాంపాక్ట్ డిజైన్ కోసం సామ్‌సంగ్ S25 మంచిది. మీ బడ్జెట్, ప్రాధాన్యాల ఆధారంగా ఆలోచించి కొనండి.
Also Read: సైబర్ మోసగాళ్లకు చెక్.. ఫేక్ కాల్స్, SMSలను ఇలా గుర్తించండి