Free Wifi Hacking| ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా జీవితాన్ని ఊహించడం చాలా కష్టం. సినిమా, సోర్ట్స్, న్యూస్ వీడియో కంటెంట్ చూడడానికి ఎక్కువ డేటా అవసరం. దీని కోసం చాలా మంది వైఫై కనెక్షన్ పై ఆధారపడతారు. చాలా చోట్ల ఉచిత Wi-Fi అందుబాటులో ఉంది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌లు, కాఫీ షాపులు, రెస్టారెంట్లు, పబ్లిక్ లైబ్రరీలు, మాల్స్ వంటి ప్రదేశాల్లో ఈ సౌకర్యం ఉంటుంది.
ఈ ఉచిత Wi-Fi నెట్‌వర్క్‌లు మీ డేటా ప్లాన్ ఉపయోగించకుండా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయడానికి సహాయపడతాయి. కొన్ని నెట్‌వర్క్‌లకు సాధారణ పాస్‌వర్డ్ అవసరం, మరికొన్ని పాస్‌వర్డ్ లేకుండా పూర్తిగా ఓపెన్‌గా ఉంటాయి. అయితే ఈ ఉచిత వైఫై నెట్‌వర్క్‌లు పెద్ద ప్రమాదం పొంది ఉంది.
పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లు చాలా భద్రతా సమస్యలను కలిగి ఉంటాయి. ఈ నెట్‌వర్క్‌లకు ఎవరైనా సులభంగా కనెక్ట్ కాగలరు. ముఖ్యంగా సైబర్ మోసగాళ్లు, హ్యాకర్లు వీటితో కనెక్ట్ అయి ఉంటారు. హ్యాకర్లు ఈ నెట్‌వర్క్‌లలో మాల్వేర్ లేదా వైరస్‌లను పంపిస్తారు. మీరు పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అయినప్పుడు, మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించబడే ప్రమాదం ఉంది. హ్యాకర్లు మీ ఫోన్, టాబ్లెట్, ల్యాప్ టాప్ లోని డేటాను యాక్సెస్ చేయవచ్చు, దీనివల్ల మీ ప్రైవెసీ దెబ్బతినవచ్చు.
చాలా కంపెనీలు ఉచిత Wi-Fi సేవలను అందిస్తాయి. అయితే వారు తమ నెట్‌వర్క్ లో సెక్యూరిటీ ఫీచర్లను తరచూ అప్‌డేట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల.. స్పామ్‌బాట్‌లు, వైరస్‌లు నెట్‌వర్క్‌లోకి సులభంగా చొచ్చుకొస్తాయి. హ్యాకర్లు పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అయిన పరికరాలను గుర్తించి, మీరు ఆన్‌లైన్‌లో చేసే ప్రతి చర్యను గమనించగలరు. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలు దొంగిలించబడి, మోసాలకు గురవుతారు.
భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ సంస్థలు పబ్లిక్ Wi-Fi గురించి హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. UGC కూడా విద్యార్థులకు ఇదే సలహా ఇచ్చింది. బ్యాంక్, సోషల్ మీడియా, పర్సనల్ ఈమెయిల్ అకౌంట్స్ (వ్యక్తిగత ఖాతాలు) లేదా ఉద్యోగ సంబంధిత ప్రొఫైల్‌లను పబ్లిక్ Wi-Fiలో లాగిన్ చేయవద్దని హెచ్చరించింది. ఈ హెచ్చరికలను తప్పక పాటించాలి.
అత్యవసరం అయితే తప్ప పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ కావద్దు. సాధ్యమైతే మీ మొబైల్ డేటాను ఉపయోగించండి. వ్యక్తిగత ఈమెయిల్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్ యాప్‌లు లేదా సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ Wi-Fiలో తెరవవద్దు. ఈ జాగ్రత్తలు పాటిస్తే.. మీ ఆర్థిక సమాచారాన్ని రక్షించడానికి సహాయపడతాయి.
పబ్లిక్ Wi-Fiలో డిజిటల్ పేమెంట్లు చేయవద్దు. లాగిన్ వివరాలు, క్రెడిట్ కార్డ్ సమాచారం, OTP లేదా పాస్‌వర్డ్‌లను ఎప్పుడూ ఎంటర్ చేయవద్దు. హ్యాకర్లు ఈ సమాచారాన్ని తక్షణమే సేకరించి, మీ డబ్బును దొంగిలించవచ్చు.
మీ స్మార్ట్‌ఫోన్‌లో మీ మొత్తం డిజిటల్ సమాచారం ఉంటుంది. పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నప్పుడు హ్యాకర్లు మిమ్మల్ని గమనిస్తున్నారని భావించ్చొద్దు. VPN (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) ఉపయోగించడం ద్వారా మీ ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను రక్షించవచ్చు. VPN మీ కనెక్షన్‌ను సురక్షితంగా ఉంచుతుంది. అందుకే సైబర్ సెక్యూరిటీ గురించి అవగాహన చాలా అవసరం. మీ వ్యక్తిగత డేటా చాలా విలువైనది, దాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది.
Also Read: మీ కంప్యూటర్ మౌస్ మీ రహస్యాలను వింటోంది.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు