Be Alert : కల్కి మూవీలో చూశాముగా. భూమి అంతరించిపోయే ముందు ఎంత దారుణ పరిస్థితులు ఉంటాయో. చెట్టు, చేమ ఏదీ మిగలదు. తిండి, నీరు గట్రా ఏమీ దొరకదు. ఆకు కనిపిస్తే అద్భుతమే. పండు కాస్తే పండగే. యుగాంతం అంటారే ఆ టైప్ అన్నమాట. జపాన్‌లో రెండు అణుబాంబులు వేశాక కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. హిరోషిమా, నాగసాకిలు సర్వనాశనం అయ్యాయి. అణ్వాయుధ దేశాలైన ఇండియా పాకిస్తాన్ యుద్దం చేస్తుంటే కూడా అదే భయం కనిపించింది. మళ్లీ అలాంటి ప్రమాదమే మరొకటి ఆకాశం నుంచి వేగంగా దూసుకొస్తోంది. ఆ ప్రమాదం పేరు.. 2003 MH4.
ఆ స్పీడ్‌తో ఢీ కొడితే..
భూమి వైపు భారీ గ్రహశకలం దూసుకొస్తోంది. అదేమీ మామూలు ఆస్టరాయిడ్ కానే కాదు. యమ డేంజర్. గుద్దితే అంతా స్మాష్. అణుబాంబులు పేలినట్టే ఉంటాది. ఎందుకంటే.. ఆ గ్రహశకలం సైజు అలాంటిది. ఐఫిల్ టవర్ అంత ఎత్తు ఉంది. అంటే, సుమారు 100 అంతస్తుల భవనం అంత హైట్. వెడల్పు 335 మీటర్లు. ఇక స్పీడ్ చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే. గంటకు 50,400 కిలోమీటర్ల వేగంతో.. అనగా సెకన్‌కు 14 కి.మీ. వేగంతో భూమి వైపునకు దూసుకొస్తోంది. అంటే, ఢిల్లీ నుంచి ముంబైకి ఒక్క నిమిషంలోనే వెళ్లిపోయేంత వేగంతో ఆ గ్రహశకలం వస్తోంది. ఒక గంటలోనే భూమిని చుట్టూ రాగలిగేంత స్పీడ్. అలాంటి డేంజరస్ గ్రహశకలంతోనే ఇప్పుడు భూమికి, మనకు పెను ప్రమాదం పొంచిఉంది. అంత పెద్ద ఆస్టరాయిడ్, అంత స్పీడ్‌తో భూమిని గుద్దేస్తే..? ఆ ప్రమాదం మరెంతో దూరంలో లేదు. మే 24నే డేట్ ఫిక్స్ చేశారు సైంటిస్టులు. సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు ముహూర్తం.
అపోలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్
2003 MH4 అనేది అపోలో గ్రహశకలాల కుటుంబానికి చెందినది. అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం అమెరికా.. అపోలో పేరుతో అంతరిక్ష నౌకలను పంపించింది. పని పూర్తయ్యాక వాటిని స్పేస్‌లోనే పేల్చేసింది. ఆ ముక్కలే గ్రహశకలాలుగా తరుచూ భూమిపైకి దండయాత్ర చేస్తుంటాయి. వాటిలో పేలుడు పదార్థాలు గట్రా ఉండవు కానీ.. అవి దూసుకొచ్చే వేగమే పెను విధ్వంసాన్ని సృష్టించగలదు. అందులోనూ ఈసారి దూసుకొస్తున్న అస్టరాయిడ్ సైజులోనూ అత్యంత భారీగా ఉంది. అందుకే ఇంత టెన్షన్. ఐఫిల్ టవర్ అంత పొడవు, సెకన్‌కు 14 కి.మీ. వేగం అంటే మామూలా? అది భూమిని ఢీ కొంటే.. ఆ ఊహనే భయానకం.
మే 24న జర జాగ్రత్త..
అయితే, ఆ గ్రహశకలం మే 24న భూమికి అత్యంత సమీపంగా వెళ్తుంది కానీ, ప్రస్తుతానికైతే అది భూమిని ఢీకొట్టే ఛాన్సెస్ లేవనే చెబుతోంది నాసా. భూమికి దగ్గరకు వచ్చే సమయంలో.. ఆకాశం ప్రకాశవంతంగా మెరుస్తుందని తెలిపింది. భూమి నుంచి 6.68 మిలియన్ కి.మీ. దూరం నుంచి అది వెళ్తుంది. అంటే, మనకు చంద్రుడికి మధ్య ఉన్న దూరం కంటే 17 రెట్లు దగ్గరగా వస్తుందన్న మాట. ఇలాంటి సందర్భాల్లో అనుకోని ప్రమాదమూ ముంచుకొచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు సైంటిస్టులు. భూమికి అంత క్లోజ్‌గా వెళ్తున్నప్పుడు.. గ్రావిటేషనల్ ఫోర్స్ వలన ఆస్టరాయిడ్ గతి తప్పే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అలా జరిగితే.. గ్రహశకలం డైరెక్షన్ మారి.. భూమి వైపు మరింత వేగంగా దూసుకురావొచ్చని అంటున్నారు. అందుకే, 2003 MH4 గతిని క్లోజ్‌గా పరిశీలిస్తోంది నాసా. మే 24 సాయంత్రం 4 గంటల 7 నిమిషాల వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని సూచిస్తోంది.