Lucknow Viral Video: చేతిలో చెప్పు, ఎదురుగా బైకర్.. ఇక ఆగిందే లేదు. కొట్టుడే కొట్టుడు.. ఒకటి కాదు రెండు కాదు 14 సార్లు ఆ యువతి దుమ్ము దులిపింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. అసలు ఈ వీడియో వెనుక ఉన్న అసలు కథ తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఇటీవల చోటు చేసుకున్న ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బైక్ పై వెనుక కూర్చున్న ఓ యువతి, ముందున్న యువకుడిని తన చెప్పుతో పదే పదే కొట్టిన ఘటన స్థానికంగా కాక, జాతీయ స్థాయిలో కూడా వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఖుర్రామ్ నగర్ ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది.
20 సెకన్లలో 14 చెప్పు దెబ్బలు!
వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఓ యువకుడు బైక్ నడుపుతున్నాడు. అతడి వెనుక కూర్చున్న యువతి తన చెప్పుతో అతడిని కొట్టడం మొదలుపెడుతుంది. 20 సెకన్లకు మించని ఆ వీడియోలో కనీసం 14 సార్లు ఆమె అతడిపై చెప్పుతో కొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బైక్ నడుపుతున్న యువకుడు అలానే ప్రశాంతంగా ఉండిపోవడం, ఆమె కొట్టే దెబ్బలకు ఏమాత్రం స్పందించకపోవడం నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
ఎందుకు కొట్టిందంటే?
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇప్పటి వరకు ఈ సంఘటనకు అసలు కారణం ఏమిటో తెలియదు. ఆ ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదమా? లేక మజాక్‌గానో, ప్లే ఫైట్‌గానో అనేదానిపై స్పష్టత లేదు. మరికొందరు మాత్రం ఇది ప్రీ ప్లాన్డ్ వీడియో అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బైక్ నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించకపోవడంతో వీరిద్దరినీ గుర్తించడం కూడా కష్టంగా మారిందట.
ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు అంటున్నారు. లక్నో పోలీసులు కూడా ఈ వీడియోపై స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో ఇది తెగ చర్చకు వస్తుండటంతో త్వరలోనే పోలీస్ శాఖ దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజంగా ఇది కావాలని చేసిన చర్యే అయితే, బాధితుడు ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే చట్టపరమైన చర్యలు చేపట్టడం సాధ్యమవుతుందని పోలీసులు అంటున్నారు.
Also Read: Cashless Village: డబ్బే అవసరం లేని గ్రామం మన దేశంలో.. ఈ ఊరే వేరే లెవెల్!
నెటిజన్ల ఘాటు స్పందన
ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఫన్ కాదు.. ఎవరినైనా ఇలా కొట్టడం తప్పే అంటున్నారు కొంతమంది. బాయ్ ఫ్రెండ్ తప్పు చేసినా ఇలాంటివి పబ్లిక్ లో చేయాలా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక మరో వర్గం మాత్రం దీనిని జస్టిఫై చేస్తూ, వాళ్లిద్దరి వ్యక్తిగత విషయం.. మనకు తెలియదు.. నిందించడం అవసరం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.
వీడియో వాస్తవమా? స్కిట్ నా?
ఇలాంటి సంఘటనలు ఇప్పుడు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని నిజమైనవే అయితే, మరికొన్ని కేవలం కంటెంట్ కోసం రూపొందించిన డ్రామాలుగా మిగిలిపోతున్నాయి. ఈ ఘటన కూడా అలాంటి ప్రకటనలకు దారితీయడంతో ఇది స్కిట్ అయి ఉండవచ్చని, పబ్లిసిటీ స్టంట్ కావచ్చని పలువురు అనుమానిస్తున్నారు. మొత్తం మీద జస్ట్ 20 సెకన్లలో 14 చెప్పు దెబ్బలు కొట్టిన యువతి మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
🚨Unusual scenes in #Lucknow
A woman was caught on camera repeatedly hitting her husband while both rode a moving bike. The video, now viral, reportedly stems from a domestic dispute gone public.#ViralVideo pic.twitter.com/umy205OPV0
— Bharat Observers (@BharatObservers) May 21, 2025