Big Stories

NASA:- నాసా కొత్త రికార్డ్.. ఏకంగా మార్స్‌పైనే..

NASA:- భూగ్రహంపై కాకుండా ఇంకా ఏ గ్రహం మీద అయినా మానవాళి జీవితం కొనసాగించే అవకాశం ఉందా అన్న అనుమానం శాస్త్రవేత్తలకు వచ్చినప్పుడు.. వారి మొదటి అనుమానం మార్స్. ఇతర గ్రహాలతో పోలిస్తే మార్స్‌లో మాత్రమే మానవాళి జీవనానికి ఉపయోగపడే కాస్త అయినా సదుపాయాలు ఉన్నాయని వారు గుర్తించారు. అప్పటినుండి మార్స్‌పై ఎన్నో పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. కానీ నాసా చేసిన ప్రయోగం కొత్త రికార్డును సాధించింది.

- Advertisement -

రెండేళ్ల క్రితం నాసా.. మార్స్‌పైకి ఇంజెన్యుటి అనే పేరుతో ఒక హెలికాప్టర్‌ను పంపింది. రెండేళ్ల నుండి ఇది మార్స్‌పైకి వెళ్తూ వస్తూ.. పరిశోధనలు చేస్తూ ఉంది. ఇప్పటివరకు దాదాపు 11 కిలోమీటర్ల దూరాన్ని ఇది కవర్ చేసింది. మామూలుగా భూమిపైన 11 కిలోమీటర్లు తిరగడం పెద్దగా కష్టమేమీ కాదు. కానీ మార్స్‌పై అలా కాదు.. ఈ విధంగా చూస్తే నాసాకు చెందిన ఇంజెన్యుటి కొత్త రికార్డును సాధించింది. ఇప్పటివరకు మార్స్‌పై అంత దూరాన్ని ఎవరూ కవర్ చేయలేకపోయారు.

- Advertisement -

ఇంజెన్యుటి నుండి ఆకాశంలోకి ఎగిరిన 49వ ఫ్లైట్ ఇది. ఇప్పటివరకు ఇది రెండు కొత్త రికార్డులను బ్రేక్ చేసింది. ఎక్కువ ఆల్టిట్యూట్‌లో ఎగిరిన ఫ్లైట్‌గా, ఎక్కువ వేగంతో మనుషులు లేకుండా ఎగిరిన ఎయిర్‌క్రాఫ్ట్‌గా ఇది రికార్డులను సాధించింది. తాజాగా మార్స్‌లోకి ఎగిరిన ఈ 49వ ఫ్లైట్ 142.7 సెకండ్లు గాలిలోనే ఉంది. అదే సమయంలో 282 మీటర్ల దూరాన్ని కవర్ చేసింది. 2022 డిసెంబర్ 3న మార్స్‌పైకి ఎగిరిన ఎయిర్‌క్రాఫ్ట్ కేవలం 14 మీటర్ల దూరాన్ని మాత్రమే కవర్ చేయగలిగింది.

ఇంజెన్యుటి అనేది సోలార్ పవర్‌తో పనిచేసే ఒక చిన్న హెలికాప్టర్. అది మార్స్‌పైకి 2021 ఫిబ్రవరి 18న ల్యాండ్ అయ్యింది. దీంతో పాటు ఆ సమయంలో ఒక రోవర్ కూడా మార్స్‌పైకి వెళ్లింది. అదే ఏడాది ఏప్రిల్ 19న మనుషులు లేకుండా మార్స్‌పైకి ఒక రౌండ్ వేసిన హెలికాప్డర్‌గా ఇది రికార్డు సాధించింది. ఆ ఫ్లైట్ సమయం 39.1 సెకండ్లుగా రికార్డ్ అయ్యింది. దీంతో పాటు మరెన్నో రికార్డులు ఇంజెన్యుటి ఖాతాలో ఉన్నాయి. ఇప్పటివరకు ఇది సాధించినన్ని రికార్డులు మార్స్‌పై ఇంకే ఎయిర్‌క్రాఫ్ట్ సాధించలేకపోయింది.

భూమికి 225 కిలోమీటర్ల దూరంలో మార్స్ ఉంది. అంటే సాధారణంగా భూమి నుండి మార్స్‌కు ఒక సిగ్నల్ ట్రావెల్ చేయాలన్నా దానికి 5 నుండి 20 నిమిషాల సమయం పడుతుంది. ఇలా అప్పుడప్పుడు సిగ్నల్స్ లేటుగా కూడా అందుతాయి. అలాంటి సమయాల్లో ఇంజెన్యుటి మార్స్‌పై ఎన్నో ఇబ్బందులు కూడా పడింది. భూమిపైన ఎగిరే విమానం కంటే మార్స్‌పై ఎగిరే విమానం ఎన్నో కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటివి ఎన్నో తట్టుకొని ఇంజెన్యుటి ఈ ఘనత సాధించడంతో నాసా సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఓజోన్ లేయర్ ధ్వంసానికి అవే కారణం..

for more updates follow this link:-Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News