Blue Ghost Moon Mission | అమెరికా ప్రభుత్వ అంతరిక్ష సంస్థ నాసా (NASA), ప్రైవేట్ అంతరిక్ష ఏరో స్పేస్ సంస్థ ఫైర్ ఫ్లై సంయుక్తంగా చంద్రుడిపైకి ఒక లూనార్ ల్యాండర్‌ని ప్రయోగించాయి. ఆ ల్యాండర్ పేరే బ్లూ ఘోస్ట్. జనవరి 15, 2025న బ్లూ ఘోస్ట్ చాలా నిదానంగా ఆకాశంలో నుంచి అంతరిక్షంలోకి ప్రయాణం సాగిస్తూ.. 60 రోజుల తరువాత చంద్రుడిపైకి చేరుకుంటుందని సమాచారం. ఈ క్రమంలో భూ గ్రహం కక్ష్యను మరో అయిదు రోజుల్లో బ్లూ ఘోస్ట్ దాట నుంది.
చంద్రుడికి చేరుకునే ప్రయాణంలో ఈ బ్లూ ఘోస్ట్ తన ప్రయాణాన్ని వీడియోలు తీస్తూ భూమిపై ఉన్న పరిశోధకులకు ఆ రికార్డింగ్ చేరవేస్తూ ఉంది. ఈ క్రమంలోనే బ్లూ ఘోస్ట్ లునార్ ల్యాండర్ తన ప్రయాణం మార్గంలో భూగ్రహాన్ని అంతరిక్షం నుంచి చాలా క్లియర్ గా వీడియో తీసింది. ఆ వీడియో చూసి శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు ఆశ్చర్యపోతున్నారు. అంతరిక్ష చిమ్మ చీకటిలో భూమి విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న దృశ్యాలను క్రిస్టల్ క్లియార్ రికార్డ్ చేసింది బ్లూ ఘోస్ట్. ఈ అద్భుత వీడియోని ఫైర్ ఫ్లై ఏరో స్పేస్ సంస్థ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో షేర్ చేసింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Also Read: విజయానికి ఆమడ దూరంలో ఇస్రో స్పేడెక్స్.. మూడు మీటర్ల సమీపంలో జంట శాటిలైట్లు
బ్లూ ఘోటస్ మూన్ ల్యాండర్ చంద్రుడిపైకి మార్చి 2, 2025న చేరుకుంటుందని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. నాసాకు చెందిన కమర్షిల్ లునార్ పేలోడ్ సర్వీసెస్ (CLPS) ప్రోగామ్ లో భాగంగా బ్లూ ఘోస్ట్ ప్రారంభించారు. చంద్రుడిపై మేరె క్రిసియం అనే ప్రాంతానికి 10 పరిశోధనా ఉపకరణాలు తీసుకెళ్లేందుకు బ్లూ ఘోస్ట్ లునార్ ల్యాండర్‌ని ఉపయోగిస్తున్నారు. ఈ ల్యాండర్ లో చంద్రుడి రెగోలిత్ నేల పై ల్యాండ్ చేసేందుకు అత్యాధునిక పరికరాలు జోడించబడ్డాయి. చంద్రుడి నేలను దాని వాతావరణాన్ని మరింత అధ్యయనం చేసేందుకు ఈ ల్యాండర్ ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్టెమిస్ ప్రొగ్రాంలో భాగంగా చంద్రుడిపై మానవులు చేస్తున్న ప్రయోగాలు వాటి డేటా కలెక్షన్ కు ఈ బ్లూ ఘోస్ట్ సులభతరం చేయనుంది.
చంద్రుడిపైకి చేరుకునేందుకు 60 రోజుల ప్రయాణం చేయనున్న బ్లూ ఘోటస్ట్ ఈ సమయంలో భూ గ్రహ ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉంటుంది. ఇదంతా ముందుగానే ప్లాన్ చేసిందే. దీంతో పాటు సూర్యుడు అస్తమించే సమయంలో దాని వెలుతురు చంద్రుడిపై ఏ విధంగా పడుతుంది. మఖ్యంగా లూనార్ నైట్ సమయంో చంద్రుడి కాంతి గురించి పరిశోధనలు కూడా చేస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం.. లునార్ నైట్ సమయంలో చంద్రుడి వాతావరణం -200 డిగ్రీలుగా గడ్డకట్టే విపరీతమైన చలి ఉంటుంది. ఇంతడి భీకర వాతావరణంలో ఈ ల్యాండర్ పనిచేయకుండా పోయే ప్రమాదం కూడా ఉంది.
అంతరిక్షం నుంచి మహాకుంభమేళా చిత్రాలు
కొన్ని రోజుల క్రితం ఒక నాసా వ్యోమగామి రాత్రిపూట అంతరిక్ష నుంచి మహాకుంభ మేళా ఫోటోలు తీశాడు. ఆ ఫొటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యాయి. ఆ తరువాత నాసా కు చెందిన మరో వ్యోమగామి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ఫొటోలు తీశాడు. ఈ ఫొటోలకు నెటిజెన్లు విపరీతంగా చూడడంతో భారీ సంఖ్యలో వ్యూస్, లైక్స్ వచ్చాయి.
T-5 days until Blue Ghost says goodbye to Earth! With the accuracy we achieved on our first two burns, we were able to skip the third Earth orbit maneuver. Blue Ghost is already in a good position to perform our trans-lunar injection in just under a week. Our #GhostRiders… pic.twitter.com/lMHpr8ix14
— Firefly Aerospace (@Firefly_Space) February 3, 2025