Naga Chaitanya.. నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా తండేల్ (Thandel) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలను వేగంగా చేపట్టారు చిత్రబృందం. అందులో భాగంగానే పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగచైతన్య తన మాజీ భార్య సమంత (Samantha) కు రీ కౌంటర్ గా ట్రూ లవ్ గురించి మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం
వ్యక్తిగతంగా నరకం చూసిన చైతూ..
అక్కినేని నాగచైతన్య గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు కానీ ఒక కమర్షియల్ హిట్ కూడా ఆయన ఖాతాలో పడలేదు. ఇప్పటివరకు ఎన్నో ఫీల్ గుడ్ చిత్రాలలో నటించారు కానీ సరైన సక్సెస్ లేకపోవడంతో ఈయన సక్సెస్ ఎప్పుడు అందుకుంటారు అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా సమంతను ప్రేమించి, పెళ్లి చేసుకున్న నాగచైతన్య.. విడాకులు ఇచ్చిన తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతూ.. అటు వ్యక్తిగతంగా.. ఇటు కెరియర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు నాగచైతన్య లైఫ్ లో చాలా మార్పు వచ్చింది. శోభితా (Shobhita) ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న ఈయన,ఇప్పుడు తండేల్ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.
సమంతకు రీకౌంటర్ ఇచ్చారా.?
ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో నిజమైన ప్రేమ గురించి మాట్లాడుతూ.. “ఇది ఒక అందమైన ఇతివృత్తాన్ని మీకు ప్రతిబింబిస్తుంది. ప్రేమ గురించి చెప్పాలి అంటే ఈ నిజమైన ప్రేమలో ఎంతో బాధ ఉంటుంది. మీరు ఆ బాధను అనుభవించిన తర్వాత దాని నుండి బయటపడినప్పుడు అది సంబంధాన్ని చాలా భిన్నమైన రీతిలో బంధిస్తుంది. అలాంటి ఒక ప్రయాణాన్ని మీరు ఈ సినిమాలో చూస్తారు. కచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది” అంటూ కామెంట్లు చేశారు నాగచైతన్య. ఇది చూసిన ఆడియన్స్ నాగచైతన్య.. ఈ మాటలు తన వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారా? లేక సినిమాలో కథను దృష్టిలో పెట్టుకొని అన్నారా? అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇంకొంతమంది అయితే ఏకంగా సమంతకు రీ కౌంటర్ వేస్తూ నాగచైతన్య ఈ కామెంట్లు చేశారని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఇద్దరూ ఏడేళ్లు ప్రేమించుకుని నాలుగేళ్లు వైవాహిక బంధం లో సంతోషంగా ఉండి చిన్నచిన్న విభేదాలు ఇద్దరి మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లే విడిపోయారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా దాదాపు 11 ఏళ్ల (7 సంవత్సరాలు లవ్.. నాలుగు సంవత్సరాల పెళ్లి జీవితం) వీరి బంధంలో బీటలు ఏర్పడడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.