Heart Attack: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సీరోల్ మండలంలోని ఎకలవ్య గురుకుల కళాశాలలో విద్యార్థిని కుప్పకూలిపోయింది.గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో తోటి విద్యార్థినిలతో డ్యాన్స్ చేసింది ఇంటర్ విద్యార్థిని రోజా. అనంతరం స్టేజి పై నుంచి క్రిందికి దిగుతున్న సమయంలో కుప్పకూలి కిందపడిపోయింది. వెంటనే స్పందించిన గురుకుల సిబ్బంది మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. దీంతో విద్యార్ధిని తల్లిదండ్రులు, తోటి స్నేహితులు గుండె పగిలేలా రోధించారు. విద్యార్ధిని స్వస్థలం మరిపెడ మండలం సపావత్ తండాగా తెలిపారు గురుకుల సిబ్బంది.
ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ రావడం కామన్ అయిపోయింది. చిన్న వయసులోనే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. సదరు గుండె జబ్బుకు చికిత్స చేసి ఆస్పత్రిలో చేరుతున్న పేషెంట్లను గమనిస్తే.. వారు చాలా చిన్న వయసులో వారిగా కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణాల సంఖ్య పెరిగిపోతోంది. గుండె భారిన పడి వృద్ధులే కాకుండా.. యువత, చిన్న పిల్లలకు కూడా వస్తోంది. చిన్న వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య గతంలో కన్నా.. ఇప్పుడు మరింత పెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి, నిద్రలేమి పౌష్ఠిక ఆహారం తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి కారణం అని వైద్యులు చెబుతున్నారు.
గత 20 ఏళ్లలో ఇండియాలో గుండెపోటుల కేసు రెండింతల పెరిగిందని.. ఇప్పుడు చాలా మంది యువత దీనిభారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంలో 60 నుండి 70 సంవత్సరాల వయసు వారికే గుండెపోటు సమస్యలు వచ్చేవి. అయితే ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా.. గుండెపోటుతో మరణిస్తున్న కేసులు పెరిగిపోతున్నాయి. కోవిడ్ తర్వాత గుండె పోటు మరణాలు ఎక్కువయ్యాయని ఓ సర్వేలో తేలింది. ఆడుతూ.. పాడుతూ.. క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని కొన్ని సార్లు డీజే వల్ల కూడా ప్రాణాలు తీస్తున్నాయి. డీజే సౌండ్ ఎక్కువగా పెట్టుకొని వినడం వల్ల, డాన్సులు చేయడం వల్ల గుండె బలహీనపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీపీని పెంచే ఏ కారణమైన చివరకు హార్ట్‌కే ఎఫెక్ట్ పడుతుందని చెబుతున్నారు.
Also Read: అతడే విలన్.. అతడే హీరో – బ్లాక్ మెయిల్ చేసి, మళ్లీ రక్షిస్తున్నట్లు నాటకమాడి ఘరానా మోసం
ఇక ఇంటర్ స్టూడెంట్ కార్డియాక్ అరెస్ట్ వల్ల మృతి చెంది ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ అంటే.. అకస్మాత్తుగా గుండెకొట్టుకోవడం ఆగిపోతుంది. దీనినే కార్డియాక్ అరెస్ట్ అంటారు. అయితే గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో శరీరంలోని ఇతర భాగాలకు ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడుకు ఆక్సీజన్ అందకపోవడంతో పేషెంట్ కొంతసేపటికి స్పృహతప్పి పడిపోవడం జరుగుతుంది. కార్డియాక్ అనేది నాలుగు నుంచి ఐదు నిమిషాల వ్యవహారం. అందుకే హార్ట్ ఎటాక్ కన్నా కూడా కార్డియాక్ అరెస్ట్ వల్లన నాలుగు రెట్లు మరణాలు కలుగుతున్నాయట. ఎందుకంటే.. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కానీ కార్డియాక్ అరెస్ట్‌లో సింప్టమ్స్ కూడా కనిపించవు.