E-Paper
Advertisement

బడ్జెట్‌లో బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ ఇదే..ఫీచర్స్ చూస్తే షాక్ అవుతారు!

బడ్జెట్‌లో బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ ఇదే..ఫీచర్స్ చూస్తే షాక్ అవుతారు!
Advertisement

Native M3 Pro review: ఇంట్లో స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నీరు తాగడం మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. అందుకోసమే.. ప్రతి ఇంట్లోనూ వాటర్ ప్యూరిఫైయర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే.. ప్రతీ ఏడాది ఫిల్టర్ మార్చడం, సర్వీసింగ్ కోసం వేల రూపాయలు ఖర్చు చేయడం సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్యకు చెక్ పెడుతూ అర్బన్ కంపెనీ ‘నేటివ్’ సిరీస్‌ నుంచి తీసుకొచ్చిన లేటెస్ట్ మోడలే Native M3 Pro. మార్కెట్లో ఉన్న ఇతర బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తున్న ఈ ప్యూరిఫైయర్ ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్,బిల్డ్ క్వాలిటీ:

ఈ మోడల్ విషయానికి వస్తే..ఇది సాధారణ వాటర్ ప్యూరిఫైయర్లలా.. కాకుండా చాలా మోడ్రన్‌గా, ప్రీమియం స్మార్ట్ అప్లయెన్స్ లా కనిపిస్తుంది. దీని మ్యాట్ ఫినిష్.. లుక్ కిచెన్ అందాన్ని.. మరింత పెంచుతుంది. దీని ముందు భాగంలో.. ఒక చిన్న డాట్-మ్యాట్రిక్స్ డిస్‌ప్లే ఉంటుంది.ఇది లైవ్ TDS, టెంపరేచర్, గ్రీటింగ్స్ వంటి వివరాలను చూపుతుంది. ముఖ్యంగా.. ఇందులో ఉపయోగించిన 6 లీటర్ల స్టోరేజ్ ట్యాంక్ ఫుడ్-గ్రేడ్ సర్జికల్-గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ తో తయారైంది. దీని వల్ల నీరు ఎల్లప్పుడూ సురక్షితంగా, బ్యాక్టీరియా రహితంగా ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో.. నీరు పట్టుకోవడానికి వీలుగా డిస్పెన్సింగ్ ఏరియా దగ్గర లైటింగ్ సౌకర్యం కూడా ఇచ్చారు.

ప్యూరిఫికేషన్, టెక్నాలజీ:

Advertisement

ఈ ప్యూరిఫైయర్ మెయిన్ హైలైట్ దీని 10-స్టేజ్ అడ్వాన్స్‌డ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్. ఇది RO, UV, కాపర్ , ఆల్కలైన్ టెక్నాలజీలతో పని చేస్తుంది. ఇది నీటిలోని మలినాలను సమర్థవంతంగా తొలగిస్తూనే.. శరీరానికి అవసరమైన ఖనిజాలను కాపాడుతుంది. బోర్వెల్, మున్సిపల్ లేదా ట్యాంకర్ నీరు ఏదైనా సరే.. 2,000 PPM వరకు ఉన్న కఠినమైన నీటిని కూడా ఇది ఈజీగా శుద్ధి చేయగలదు. అంతే కాకుండా.. ఇందులో ఉన్న స్మార్ట్ టెక్నాలజీలు ఫిల్టర్ పై సాల్ట్ పేరుకుపోకుండా కాపాడి, దాని జీవితకాలాన్ని పెంచుతాయి.

3 ఏళ్ల జీరో మెయింటెనెన్స్ హామీ:

సాధారణంగా RO ప్యూరిఫైయర్లకు ప్రతి ఏటా ఫిల్టర్ మార్చాలి, దీ నికోసం వేల రూపాయలు ఖర్చవుతుంటాయి. కానీ ఈ మోడల్ కొనుగోలు చేస్తే మీకు ఈ టెన్షన్ ఉండదు. కంపెనీ దీనికి ఏకంగా 3 సంవత్సరాల పాటు అన్‌కండిషనల్ వారంటీని అందిస్తుంది. అంటే రాబోయే 3 ఏళ్ల వరకు ఫిల్టర్లు, విడిభాగాలు లేదా లేబర్ ఛార్జీల గురించి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది నిజంగా వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

Advertisement

Also Read: 60 గంటల బ్యాటరీ లైఫ్‌తో..అద్భుతమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్!

స్మార్ట్ ఫీచర్లు, యాప్ కనెక్టివిటీ:

ఈ డివైజ్ అర్బన్ కంపెనీ యాప్‌తో కనెక్ట్ అవుతుంది. దీని ద్వారా మీరు రియల్ టైమ్ ఇన్‌పుట్ మరియు అవుట్‌పుట్ TDS లెవెల్స్, రోజువారీ నీటి వినియోగం, ఫిల్టర్ హెల్త్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు మొబైల్‌లోనే చెక్ చేసుకోవచ్చు. అలాగే గ్లాస్ లేదా బాటిల్ మోడ్ ప్రిసెట్స్ ద్వారా మీకు కావాల్సిన కచ్చితమైన నీటి పరిమాణాన్ని ఈజీగా పట్టుకోవచ్చు. కరెంట్ పోయినప్పటికీ.. ఇందులో ఉన్న బిల్ట్-ఇన్ బ్యాటరీ సహాయంతో ట్యాంక్‌లోని నీటిని డిస్పెన్స్ చేసుకోవచ్చు.

ధర :

ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ ధర సుమారు రూ. 24,999 నుంచి రూ. 25,999 వరకు ఉంది. ప్రారంభ ధర కొంచెం ఎక్కువగా అనిపించినప్పటికీ.. 3 సంవత్సరాల పాటు ఎలాంటి మెయింటెనెన్స్ ఖర్చు లేకపోవడం, స్టెయిన్‌ లెస్ స్టీల్ ట్యాంక్ , అద్భుతమైన ప్యూరిఫికేషన్ ఫీచర్లు దీన్ని ఈజీగా మారుస్తాయి. మీ ఇంటికి ఒక ప్రీమియం, నమ్మదగిన ,ట్రెండీ వాటర్ ప్యూరిఫైయర్ కావాలనుకుంటే.. Native M3 Pro నిస్సందేహంగా బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

Related News

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ డిష్ వాషర్ కావాలా?ఈ మోడల్ మీ కోసమే

ఇంతకాలం ఈ విషయం తెలియక ఎంత ఇబ్బంది పడ్డామో.. ఫోన్ ఛార్జర్‌తోనే ట్రిమ్మర్‌కు ఛార్జింగ్!

రూ.60 వేల శాంసంగ్ టీవీ ఇంత తక్కువకే వస్తే ఎవరు వదులుకుంటారు? దీపావళికి డబుల్ ధమాకా!

బెస్ట్ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారా? Oppo Enco X4పై ఓ లుక్కేయండి

స్టీవ్ జాబ్స్ రూల్స్‌ను బ్రేక్ చేసిన యాపిల్.. M7 చిప్‌లతో తిరుగులేని టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్స్!

ఎవరూ ఊహించని రేంజ్‌లో నథింగ్ మాస్టర్ ప్లాన్.. వచ్చే ఏడాది మార్కెట్లోకి 7 ఫోన్‌లు!

60 గంటల బ్యాటరీ లైఫ్‌తో..అద్భుతమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్!

Big Stories

Advertisement
×