E-Paper
Advertisement

ఎవరూ ఊహించని రేంజ్‌లో నథింగ్ మాస్టర్ ప్లాన్.. వచ్చే ఏడాది మార్కెట్లోకి 7 ఫోన్‌లు!

ఎవరూ ఊహించని రేంజ్‌లో నథింగ్ మాస్టర్ ప్లాన్.. వచ్చే ఏడాది మార్కెట్లోకి 7 ఫోన్‌లు!
Advertisement

Nothing Smartphones 2027: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నథింగ్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2027లో 6 కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది మూడు ఫోన్లను మాత్రమే తీసుకొచ్చిన కంపెనీ.. వచ్చే ఏడాది తమ ఫోన్‌ల సంఖ్యను భారీగా పెంచనుంది. అంతేకాదు.. కొత్త ఫోన్లను ముందుగానే చూసే అవకాశం కూడా తన కమ్యూనిటీ సభ్యులకు కల్పించనుంది.

2026లో మూడు ఫోన్లు:

లండన్‌కు చెందిన నథింగ్ కంపెనీ ఈ ఏడాది భారత మార్కెట్‌లో Phone (4a), Phone (4a) Pro, Phone (4b) మోడళ్లను విడుదల చేసింది. ఏడాది ప్రారంభంలో Phone (4a) సిరీస్‌ను తీసుకొచ్చిన కంపెనీ, ఆ తర్వాత తక్కువ ధరలో Phone (4b)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ బేస్ మోడల్ 6GB RAM, 128GB స్టోరేజ్‌తో రూ.29,999 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి వచ్చింది.

ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు బ్రేక్:

Advertisement

ఈ ఏడాది నథింగ్ నుంచి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ర్యామ్, స్టోరేజ్ చిప్‌ల ధరలు పెరగడంతో ఖరీదైన ఫోన్‌ను విడుదల చేయడం కష్టమని కంపెనీ ఫౌండర్ కార్ల్ పేయ్ ముందే చెప్పారు. మరోవైపు, నథింగ్ సబ్‌ బ్రాండ్ సీఎమ్‌ఎఫ్ కూడా ఈ ఏడాది కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయలేదు. అయితే రెండు బ్రాండ్లు ఆడియో ఉత్పత్తులను మాత్రం మార్కెట్లోకి తీసుకొచ్చాయి.

Also Read: టెక్ ప్రపంచంలో ఊహకందని అద్భుతం.. శాంసంగ్ నుంచి 17 ఇంచుల ట్యాబ్లెట్, జేబులో పట్టేస్తుంది!

Advertisement

2027లో 6 కంటే ఎక్కువ ఫోన్లు:

నథింగ్ సహ వ్యవస్థాపకుడు, భారత విభాగం ప్రెసిడెంట్ అకిస్ ఎవాంజెలిడిస్ ఎక్స్‌లో కంపెనీ ప్లాన్‌ను వెల్లడించారు. 2026లో విడుదల చేసిన ఫోన్ల కంటే రెండింతలకుపైగా మోడళ్లను వచ్చే ఏడాది తీసుకురానున్నట్లు తెలిపారు. అంటే కనీసం 7 ఫోన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే వాటి పేర్లు, ఫీచర్లు, ధరలపై కంపెనీ ఇంకా వివరాలు వెల్లడించలేదు. తక్కువ ధరలో మరిన్ని మోడళ్లను తీసుకురావడం ద్వారా ఎక్కువ మంది కొనుగోలుదారులకు చేరువ కావాలని కంపెనీ చూస్తోంది.

విడుదలకు ముందే చూడొచ్చు:

ఢిల్లీలోని నథింగ్ ప్రధాన కార్యాలయంలో త్వరలో కో-క్రియేషన్ కార్యక్రమం జరగనుంది. ఇందులో ఎంపికైన కమ్యూనిటీ సభ్యులకు 2027లో రాబోయే ఫోన్లను ముందుగానే చూసే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. తమ అభిప్రాయాలను కంపెనీ బృందంతో నేరుగా పంచుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు నథింగ్ కమ్యూనిటీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: వాట్సప్‌లో ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే ఆ పని చేయండి.. లేదంటే మొత్తం ఊడ్చేస్తారు!

Tags

Related News

60 గంటల బ్యాటరీ లైఫ్‌తో..అద్భుతమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్!

రూ.1,748కే ఏడాది పాటు టెన్షన్ ఫ్రీ.. జియో కస్టమర్లు కోరుకున్న బెస్ట్ ప్లాన్ ఇదే!

నమ్మలేని ఫీచర్లు బడ్జెట్ ధరలోనే..డబ్‌స్టెప్ బజ్ X11 వైర్‌లెస్ హెడ్‌సెట్ పూర్తి రివ్యూ!

యాపిల్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తున్న iPhone 20 సీక్రెట్ ప్లాన్స్.. ఈసారి ఊహించని ఫీచర్లతో హిస్టరీ రిపీట్!

200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ఒప్పో రెనో 17 సిరీస్‌లో ఇవే స్పెషల్ ఫీచర్లు!

ఫోన్ పోయిందా? దొంగల చేతికి చిక్కకుండా సెక్యూరిటీ లాక్ వేయండిలా?

పిల్లల కోసం బెస్ట్ స్మార్ట్‌వాచ్..నాయిస్ జూనియర్ ఎక్స్ప్లోరర్ 2 ఫీచర్లు ఇవే!

Big Stories

Advertisement
×