E-Paper
Advertisement

బెస్ట్ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారా? Oppo Enco X4పై ఓ లుక్కేయండి

బెస్ట్ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారా? Oppo Enco X4పై ఓ లుక్కేయండి
Advertisement

Oppo Enco X4 review: ప్రస్తుత టెక్ ప్రపంచంలో రోజుకో కొత్త గాడ్జెట్ మార్కెట్లోకి వస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ కోసం కంపెనీలు అదిరి పోయే ఆడియో ప్రొడక్ట్స్‌ను అందిస్తున్నాయి. ఈ కోవకే చెందిన తాజా ప్రీమియం ఇయర్ బడ్స్ Oppo Enco X4. మార్కెట్లో ఇప్పటికే ఉన్న పెద్ద బ్రాండ్ల ఇయర్ బడ్స్‌కు గట్టి పోటీ ఇస్తూ, సరి కొత్త ఫీచర్లతో ఇవి కస్టమర్ల ముందుకు వచ్చాయి. అసలు ఈ ఇయర్ బడ్స్ ఎలా పనిచేస్తాయి? ధర ఎంత? ఇందులో ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్,బిల్డ్ క్వాలిటీ:

ఈ మోడల్ డిజైన్ విషయానికి వస్తే..ఇది చూడటానికి చాలా ప్రీమియంగా, ట్రెండీగా ఉంది. దీని ఛార్జింగ్ కేస్ కాంపాక్ట్ సైజ్‌లో.. గుండ్రని అంచులతో వస్తుంది. చేతిలో పట్టుకోవడానికి చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇవి గ్లేసియర్ వైట్ ,ఆరా వయొలెట్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. ఒక్కో ఇయర్ బడ్ బరువు కేవలం 5.6 గ్రాములు మాత్రమే ఉండటం వల్ల, చెవుల్లో పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగదు. అలాగే ఇవి IP55 డస్ట్ , వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. కాబట్టి వర్షంలో లేదా వ్యాయామం చేసే సమయంలో.. చెమట పట్టినా ఇవి పాడవకుండా ఉంటాయి.

సౌండ్ క్వాలిటీ, ఆడియో పర్ఫార్మెన్స్:

Advertisement

ఈ ఇయర్ బడ్స్ మెయిన్ హైలైట్ వీటి సౌండ్ క్వాలిటీ. ప్రముఖ ఆడియో బ్రాండ్ డైన్‌డియో సహకారంతో.. వీటిని ట్యూన్ చేశారు. ఇందులో.. 11mm ఊఫర్, 6mm ట్వీటర్తో కూడిన డ్యూయల్-డ్రైవర్ సెటప్ ఉంది.దీని వల్ల పాటల్లోని ప్రతి బీట్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. బేస్ లవర్స్ అయితే ఇది అద్భుతమైన ఫీల్ ఇస్తుంది. అంతే కాకుండా, AAC, SBC, LHDC, LC3 వంటి హై-రెస్ ఆడియో కోడెక్స్ సపోర్ట్ లభిస్తుంది. మీరు ఒప్పో ఫైన్ ఎక్స్ సిరీస్ ఫోన్‌లను వాడితే.. మరింత మెరుగైన లాస్‌ లెస్ ఆడియోను ఆస్వాదించవచ్చు.

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ :

ప్రయాణాల్లో లేదా రద్దీగా ఉండే ఆఫీసుల్లో.. బయటి సౌండ్స్ మనకు చికాకు తెప్పిస్తుంటాయి. దీనికోసం Oppo Enco X4 లో పవర్ ఫుల్ ఏఐ రియల్ టైమ్ అడాప్టివ్ ANC టెక్నాలజీని అందించారు. ఇది చుట్టు పక్కల ఉండే శబ్దాలను గమనించి దానికి తగ్గట్టుగా.. నాయిస్ క్యాన్సిలేషన్‌ను మారుస్తుంది. అలాగే.. ఇందులో ఉన్న ‘కన్వర్జేషన్ అవేర్‌నెస్’ ఫీచర్ చాలా ప్రత్యేకమైనది. ఎవరైనా మీతో మాట్లాడటం మొదలు పెడితే, ఇయర్ బడ్స్ ఆటోమేటిక్‌గా వాల్యూమ్ తగ్గించి ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌లోకి మారుతాయి. దీని వల్ల ఇయర్ బడ్స్ తీయకుండానే ఎదుటి వారితో మాట్లాడొచ్చు.

Advertisement

Also Read: 60 గంటల బ్యాటరీ లైఫ్‌తో..అద్భుతమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్!

బ్యాటరీ బ్యాకప్, కనెక్టివిటీ:

బ్యాటరీ లైఫ్ విషయంలో ఈ ఇయర్ బడ్స్ అస్సలు నిరాశపరచవు. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి మొత్తం 53 గంటల వరకు నాన్‌ స్టాప్ మ్యూజిక్ ప్లేబ్యాక్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఒకసారి ఛార్జ్ చేస్తే.. ఇయర్ బడ్స్ దాదాపు 13 గంటల వరకు బ్యాకప్ ఇస్తాయి (ANC ఆఫ్‌లో ఉన్నప్పుడు).అత్యవసర సమయంలో ..కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, గంటల తరబడి వాడేయెచ్చు. ఇక కనెక్టివిటీ కోసం ఇందులో.. లేటెస్ట్ బ్లూటూత్ సపోర్ట్ ఇచ్చారు. దీని వల్ల కనెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఒకేసారి రెండు డివైజెస్‌కు కనెక్ట్ చేసుకునే మల్టీ-డివైస్ సపోర్ట్ కూడా ఉంది.

Related News

రూ.60 వేల శాంసంగ్ టీవీ ఇంత తక్కువకే వస్తే ఎవరు వదులుకుంటారు? దీపావళికి డబుల్ ధమాకా!

బడ్జెట్‌లో బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ ఇదే..ఫీచర్స్ చూస్తే షాక్ అవుతారు!

స్టీవ్ జాబ్స్ రూల్స్‌ను బ్రేక్ చేసిన యాపిల్.. M7 చిప్‌లతో తిరుగులేని టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్స్!

ఎవరూ ఊహించని రేంజ్‌లో నథింగ్ మాస్టర్ ప్లాన్.. వచ్చే ఏడాది మార్కెట్లోకి 7 ఫోన్‌లు!

60 గంటల బ్యాటరీ లైఫ్‌తో..అద్భుతమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్!

రూ.1,748కే ఏడాది పాటు టెన్షన్ ఫ్రీ.. జియో కస్టమర్లు కోరుకున్న బెస్ట్ ప్లాన్ ఇదే!

నమ్మలేని ఫీచర్లు బడ్జెట్ ధరలోనే..డబ్‌స్టెప్ బజ్ X11 వైర్‌లెస్ హెడ్‌సెట్ పూర్తి రివ్యూ!

Big Stories

Advertisement
×