E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ డిష్ వాషర్ కావాలా?ఈ మోడల్ మీ కోసమే

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ డిష్ వాషర్ కావాలా?ఈ మోడల్ మీ కోసమే
Advertisement

Voltas Beko dishwasher review: ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్ లో కిచెన్ పనులను ఈజీ చేసుకునేందుకు ఎలక్ట్రిక్ గాడ్జెట్ల వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా.. భోజనం తర్వాత గిన్నెలు కడగడం అనేది చాలా మందికి పెద్ద తల నొప్పిగా మారుతుంటుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మార్కెట్లో డిష్ వాషర్ల హవా నడుస్తోంది. అయితే.. చాలా మంది వీటి ధర ఎక్కువగా ఉంటుందని భావిస్తుంటారు. అలాంటి.. వారి కోసం ప్రముఖ హోమ్ అప్లయెన్సెస్ బ్రాండ్ అయిన వోల్టాస్ బేకో అతి తక్కువ ధరలో.. ఈ మోడల్ అందుబాటులోకి తెచ్చింది.కేవలం రూ. 16,490 ధరకే లభిస్తున్న ఈ డిష్ వాషర్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, స్పేస్ మేనేజ్‌మెంట్:

ఈ డిష్ వాషర్ డిజైన్ విషయానికి వస్తే.. ఇది చాలా కాంపాక్ట్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. ఇది ఫ్రీ స్టాండింగ్ మోడల్ కాబట్టి, మీ కిచెన్ కౌంటర్‌టాప్‌పై లేదా కిచెన్ కార్నర్‌లో దీన్ని అమర్చుకోవడం చాలా ఈజీ. చిన్న కిచెన్ ఉండే.. ఇళ్లకు కూడా ఇది సరిగ్గా సరి పోతుంది. ఇందులో 8 ప్లేస్ సెట్టింగ్స్ సామర్థ్యం ఉంది. అంటే ఒకే సారి.. చిన్న కుటుంబానికి సరి పడా ప్లేట్లు, గ్లాసులు, గరిటెలు ,చిన్న పాటి గిన్నెలను ఈజీగా అమర్చుకోవచ్చు. దీని స్టెయిన్‌లెస్ స్టీల్ ఇంటీరియర్ డిజైన్ దీన్ని మరింత ట్రెండీగా మారుస్తుంది.

వాషింగ్ ప్రోగ్రామ్‌లు,క్లీనింగ్ పర్ఫార్మెన్స్:

Advertisement

మన వంటకాల్లో నూనె మసాలాలు ఎక్కువగా వాడతాం కాబట్టి, గిన్నెలు జిడ్డుగా.. మారుతుంటాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని.. ఈ మోడల్ లో ప్రత్యేకమైన వాషింగ్ ప్రోగ్రామ్‌లను అందించారు. ఇందులో ఇంటెన్సివ్, ఎకో, డెలికేట్ , క్విక్ వాష్ వంటి విభిన్న మోడ్స్ ఉన్నాయి. మీరు జిడ్డు ఎక్కువగా ..ఉన్న కడాయిలు లేదా కుక్కర్‌లను కూడా ‘ఇంటెన్సివ్’ మోడ్ ద్వారా చాలా శుభ్రం చేసుకోవచ్చు. అలాగే హాట్ వాటర్ వాషింగ్ ఫీచర్ ఉండటం వల్ల గిన్నెలపై ఉండే బ్యాక్టీరియా, క్రిములు పూర్తిగా నశిస్తాయి. దీనివల్ల గిన్నెలు మరింత హైజెనిక్‌గా మారుతాయి.

నీటి ఆదా:

చేతులతో గిన్నెలు కడిగేటప్పుడు చాలా నీరు వృథా అవుతుంది. కానీ ఈ డిష్ వాషర్ చాలా తక్కువ నీటిని వినియోగించుకుని అద్భుతమైన.. క్లీనింగ్ రిజల్ట్ ఇస్తుంది. ఇది తక్కువ కరెంట్‌ను మాత్రమే వినియోగించే ఎనర్జీ-ఎఫిషియంట్ డివైజ్. దీని వల్ల నెలవారీ కరెంట్ బిల్లు మీద కూడా పెద్దగా ప్రభావం పడదు. బిజీ షెడ్యూల్ ఉండే.. ఉద్యోగస్తులకు, మహిళలకు ఇది సమయాన్ని, శ్రమను రెండింటినీ ఆదా చేస్తుంది.

Advertisement

Also Read: నమ్మలేని ఫీచర్లు బడ్జెట్ ధరలోనే..డబ్‌స్టెప్ బజ్ X11 వైర్‌లెస్ హెడ్‌సెట్ పూర్తి రివ్యూ!

వాడకం:

ఈ డిష్ వాషర్‌ను ఆపరేట్ చేయడం చాలా ఈజీ. దీని ముందు భాగంలో ఉన్న డిస్‌ప్లే, బటన్ల ద్వారా మీకు కావలసిన వాషింగ్ ప్రోగ్రామ్‌ను ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ..చైల్డ్ లాక్ ఫీచర్ కూడా ఉండటం.. వల్ల ఇంట్లోని చిన్న పిల్లలు ముట్టుకున్నా.. సెట్టింగ్స్ మారకుండా ఉంటుంది. దీని ఆపరేటింగ్ సౌండ్ చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది పని చేస్తున్నప్పుడు ఎలాంటి సౌండ్ ఇబ్బంది పెట్టదు.

ధర:

ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ ధర రూ. 16,490 గా ఉంది. ప్రముఖ ఆన్‌ లైన్ స్టోర్లు, హోమ్ అప్లయెన్సెస్ షోరూమ్‌లలో ఇది కొనడనికి అందుబాటులో.. ఉంది. ఈ బడ్జెట్‌లో ఇన్ని ఫీచర్లు, ముఖ్యంగా గిన్నెలను శుభ్రంగా.. కడిగే అద్భుతమైన పర్ఫామెన్స్.. అందించడం నిజంగా గొప్ప విషయం. మీ కిచెన్ పనులను ఈజీ చేసుకోవాలనుకుంటే .. బడ్జెట్ ధరలో మంచి డిష్ వాషర్ కొనాలనుకుంటే.. ఈ మోడల్ నిస్సందేహంగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Related News

పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా?బెస్ట్ గాడ్జెట్ ఇదే

డేటా అక్కర్లేని వారికి జియో గుడ్ న్యూస్.. అపరిమిత కాల్స్ కోసం సరికొత్త చౌకైన ప్లాన్లు!

1,099కే నెక్ట్ లెవల్ ఫీచర్లున్నఇయర్ బడ్స్! డోంట్ మిస్

ఇంతకాలం ఈ విషయం తెలియక ఎంత ఇబ్బంది పడ్డామో.. ఫోన్ ఛార్జర్‌తోనే ట్రిమ్మర్‌కు ఛార్జింగ్!

రూ.60 వేల శాంసంగ్ టీవీ ఇంత తక్కువకే వస్తే ఎవరు వదులుకుంటారు? దీపావళికి డబుల్ ధమాకా!

బడ్జెట్‌లో బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ ఇదే..ఫీచర్స్ చూస్తే షాక్ అవుతారు!

బెస్ట్ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారా? Oppo Enco X4పై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×