TRIGGR Wukong Earbuds: టెక్నాలజీ మారుతున్న కొద్దీ.. సామాన్యులకు కూడా ప్రీమియం ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా.. ప్రయాణాలు చేసేటప్పుడు లేదా రద్దీ ప్రదేశాల్లో ఉండి పాటలు వినే వారికి లేదా ఆఫీస్ కాల్స్ మాట్లాడేవారికి.. ANC చాలా ముఖ్యం. ఇంతకు ముందు ఈ ఫీచర్ కేవలం వేల .. రూపాయల విలువైన ఇయర్‌బడ్స్‌లోనే ఉండేది. కానీ.. ఇప్పుడు మార్కెట్‌ను రూలు చేస్తున్న ‘TRIGGR Wukong’ TWS ఇయర్ బడ్స్ అత్యంత తక్కువ ధరకే..ఈ ఫీచర్‌ను అందిస్తూ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఇయర్‌బడ్స్ అతిపెద్ద హైలైట్ ఇందులో.. ఉండే 35dB ANC టెక్నాలజీ. మీరు రోడ్డుపై నడుస్తున్నప్పుడు.. లేదా బస్సు, ట్రెయిన్ వంటి ప్రయాణాల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల వచ్చే అనవసరమైన ట్రాఫిక్ సౌండ్స్, గొడవలను ఈ ఫీచర్ చాలా వరకు తొలగిస్తుంది. దీని వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కేవలం మీ మ్యూజిక్‌ని లేదా అవతలి వారి మాటలను స్పష్టంగా వినొచ్చు.
ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు.. గొంతు స్పష్టంగా వినిపించడానికి ఇందులో ENC సిస్టమ్‌ను వాడారు. మీరు రద్దీ ప్రాంతంలో ఉండి ఫోన్ చేసినా, మీ వాయిస్ మాత్రమే అవతలి వారికి స్పష్టంగా చేరేలా ఈ మైక్ టెక్నాలజీ అద్భుతంగా పని చేస్తుంది.
60 గంట బ్యాటరీ బ్యాకప్:
బడ్జెట్ గ్యాడ్జెట్లలో బ్యాటరీ త్వరగా అయిపోతుందనే టెన్షన్ ఉంటుంది. కానీ ట్రిగ్గర్ వుకాంగ్ ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తంగా 60 గంటల వరకు ప్లేటైమ్‌ను అందిస్తాయి. అంటే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. దాదాపు వారం రోజుల పాటు మళ్లీ ఛార్జ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కొద్దిసేపు చార్జ్ చేస్తే చాలు..గంటల తరబడి వాడొచ్చు.
ఈ ప్రైస్ రేంజ్‌లో.. లభించే చాలా తక్కువ ఇయర్ బడ్స్‌లో.. మాత్రమే ‘డ్యూయల్ పేరింగ్’ ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మీరు మీ ఇయర్ బడ్స్‌ను ఒకే సమయంలో..ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్ రెండింటికీ కనెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లో సినిమా చూస్తూనే..ఫోన్‌కి వచ్చే కాల్స్‌ని ఇబ్బంది లేకుండా.. ఎటెండ్ అవ్వడానికి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగ పడుతుంది.
Also Read: మీ వంటను ఈజీ చేసే..బెస్ట్ 5 స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్‌లు!
లో లేటెన్సీ మోడ్ : గేమ్స్ ఆడే వారికి సౌండ్ సింక్ అవ్వడం చాలా ముఖ్యం. ఇందులో ఉండే గేమింగ్ మోడ్ ఎలాంటి డిలే లేకుండా పర్ఫెక్ట్ ఆడియో ఫీల్ ఇస్తుంది.
స్టైలిష్ లుక్: చూడటానికి చాలా ట్రెండ్‌గా..మోడర్న్‌గా ఉండే ఈ ఇయర్‌బడ్స్ చెవుల్లో పెట్టుకోవడానికి ఎంతో కంఫర్టబుల్‌గా ఉంటాయి.తక్కువ బరువుతో పాకెట్‌లో ఈజీగా ఇమిడిపోతాయి.
ఈ మోడల్ అసలైన ఎంఆర్‌పి ధర ఎక్కువగా ఉన్నప్పటికీ..ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లలో ఆఫర్లతో కలిపి కేవలం రూ. 899 ధరకే అత్యంత చౌకగా లభిస్తున్నాయి.
రూ.1,000 లోపు బడ్జెట్‌లో.. 35dB ANC, 60 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్న ఏకైక గాడ్జెట్‌గా ఇది మార్కెట్లో రికార్డ్ సృష్టిస్తోంది.
తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం నాయిస్ క్యాన్సలేషన్, లాంగ్ బ్యాటరీ లైఫ్ , అదిరిపోయే .. సౌండ్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ‘ట్రిగ్గర్ వుకాంగ్’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ ట్రెండింగ్ గాడ్జెట్‌ను ఈరోజే మీ సొంతం చేసుకుని మీ మ్యూజిక్ ,కాలింగ్ ఫీల్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లండి!