E-Paper
Advertisement

స్టీవ్ జాబ్స్ రూల్స్‌ను బ్రేక్ చేసిన యాపిల్.. M7 చిప్‌లతో తిరుగులేని టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్స్!

స్టీవ్ జాబ్స్ రూల్స్‌ను బ్రేక్ చేసిన యాపిల్.. M7 చిప్‌లతో తిరుగులేని టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్స్!
Advertisement

Apple MacBook Pro: ఒకప్పుడు ‘ల్యాప్‌టాప్‌కి టచ్‌స్క్రీన్ దేనికి? అది ఐప్యాడ్ మార్కెట్‌ని దెబ్బతీస్తుంది’ అని స్టీవ్ జాబ్స్ గట్టిగా నమ్మేవారు. కానీ టెక్నాలజీ మారే కొద్దీ యాపిల్ తన ఆలోచనను మార్చుకోక తప్పలేదు. ఎంతో కాలంగా వినియోగదారులు కోరుకుంటున్న టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రోను కంపెనీ ఎట్టకేలకు మార్కెట్‌లోకి తెచ్చింది. కానీ, అంతర్జాతీయ ప్రసిద్ధ బ్లూమ్‌బెర్గ్ రిపోర్టర్ మార్క్ గుర్మాన్ చెప్పినదాని ప్రకారం.. యాపిల్ ఇక్కడితో ఆగిపోలేదు. రాబోయే రోజుల్లో M7 ప్రో, M7 మ్యాక్స్ చిప్‌లతో మరింత శక్తివంతమైన టచ్ ల్యాప్‌టాప్‌లను తేవడానికి సిద్ధమవుతోందని సమాచారం.

టచ్‌స్క్రీన్‌తో కొత్త అనుభవం:

ప్రస్తుతం యాపిల్ విడుదల చేసిన టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ తొలి అడుగు అయినప్పటికీ.. కంపెనీ చాలా జాగ్రత్తగా, సురక్షితమైన నిర్ణయాలనే తీసుకుంది. విండోస్ ల్యాప్‌టాప్‌లు ఎప్పటినుంచో ఆఫర్ చేస్తున్న ఫీచర్లకు పోటీగా దీన్ని కొద్దిగా సన్నగా, బరువు తక్కువగా రూపొందించారు. హీట్ మేనేజ్‌మెంట్ సరిగా ఉండేలా కూలింగ్ సిస్టమ్‌ను కాస్త మెరుగుపరిచారంతే తప్ప, ఇదొక పెద్ద సంచలనం అని చెప్పలేం.

Advertisement

Also Read: యాపిల్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తున్న iPhone 20 సీక్రెట్ ప్లాన్స్.. ఈసారి ఊహించని ఫీచర్లతో హిస్టరీ రిపీట్!

ఇంకా మార్పులు అవసరం:

ఈ కొత్త ల్యాప్‌టాప్‌లో కొన్ని కీలకమైన విషయాలను యాపిల్ పక్కన పెట్టింది. ఉదా: దీనిని పూర్తిగా మడతపెట్టి ట్యాబ్‌లా వాడే అవకాశం లేదు. అలాగే యాపిల్ పెన్సిల్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఇస్తే ఎక్కడ జనాలు ఐప్యాడ్‌లు కొనడం మానేస్తారో అన్న భయమే దీనికి ముఖ్య కారణమని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

M7 Pro, M7 Max చిప్స్‌తో:

Advertisement

వచ్చే ఏడాది రాబోయే సెకండ్ జనరేషన్ టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రోతో యాపిల్ రచ్చ చేయబోతోంది. ఇందులో అత్యంత పవర్‌ఫుల్ M7 ప్రో, M7 మ్యాక్స్ ప్రాసెసర్లను వాడనున్నారు. ఇవి ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లకు సపోర్ట్ చేస్తాయి. దీనివల్ల ల్యాప్‌టాప్ పనితీరు, స్పీడ్ ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయి.

ఐప్యాడ్‌కు పోటీ ఉంటుందా?

కేవలం ప్రీమియం ల్యాప్‌టాప్‌లకే పరిమితం కాకుండా.. ఎంట్రీ లెవెల్ 14-అంగుళాల మోడల్‌ను కూడా M7 చిప్‌తో కంపెనీ తీసుకురానుంది. ఇది కూడా సన్నని బెజెల్స్, తేలికపాటి డిజైన్‌తో రానుంది. యాపిల్ రాబోయే రోజుల్లో రెండు వేర్వేరు వెర్షన్లు ఉంచుతుందా లేదా ఒకే లైన్‌అప్‌లోకి టచ్‌స్క్రీన్‌ను తీసుకొస్తుందో చూడాలి.

Also Read: రూ.1,748కే ఏడాది పాటు టెన్షన్ ఫ్రీ.. జియో కస్టమర్లు కోరుకున్న బెస్ట్ ప్లాన్ ఇదే!

Tags

Related News

బెస్ట్ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారా? Oppo Enco X4పై ఓ లుక్కేయండి

ఎవరూ ఊహించని రేంజ్‌లో నథింగ్ మాస్టర్ ప్లాన్.. వచ్చే ఏడాది మార్కెట్లోకి 7 ఫోన్‌లు!

60 గంటల బ్యాటరీ లైఫ్‌తో..అద్భుతమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్!

రూ.1,748కే ఏడాది పాటు టెన్షన్ ఫ్రీ.. జియో కస్టమర్లు కోరుకున్న బెస్ట్ ప్లాన్ ఇదే!

నమ్మలేని ఫీచర్లు బడ్జెట్ ధరలోనే..డబ్‌స్టెప్ బజ్ X11 వైర్‌లెస్ హెడ్‌సెట్ పూర్తి రివ్యూ!

యాపిల్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తున్న iPhone 20 సీక్రెట్ ప్లాన్స్.. ఈసారి ఊహించని ఫీచర్లతో హిస్టరీ రిపీట్!

200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ఒప్పో రెనో 17 సిరీస్‌లో ఇవే స్పెషల్ ఫీచర్లు!

Big Stories

Advertisement
×