E-Paper
Advertisement

హ్యుందాయ్ ఐ20 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే?

హ్యుందాయ్ ఐ20 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే?
Advertisement

Hyundai i20 Price Hike: కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి హ్యుందాయ్ ఇండియా షాక్ ఇచ్చింది. ప్రముఖ ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ ఐ20 ధరలను కంపెనీ మరోసారి పెంచింది. ఇప్పటికే మారుతి బాలెనో, టయోటా గ్లాంజా లాంటి కార్ల నుంచి పోటీ ఎదుర్కొంటున్న ఐ20కి ఈ ధరల పెంపు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. తాజాగా ఈ కారు ధరలు ఎంత పెరిగాయి? ఇప్పుడు ఏ ధరకు లభిస్తోంది?  అనేది ఇప్పుడు చూద్దాం..

ఐ20 ధరలు ఎంత పెరిగాయి?

హ్యుందాయ్ ఐ20 కారుపై అన్ని వేరియంట్లకు ఒకే విధంగా ధరల పెంపు లేదు. కంపెనీ ఎంట్రీ లెవల్‌లో ఉన్న రెండు వేరియంట్లను మాత్రం పాత ధరలకే కొనసాగించింది. వీటిలో ఎరా పెట్రోల్ MT, మాగ్నా ఎగ్జిక్యూటివ్ పెట్రోల్ MT ఉన్నాయి. మిగిలిన అన్ని వేరియంట్ల ధరలను రూ.5,000 చొప్పున పెంచింది. దీంతో కొత్తగా ఐ20 కొనుగోలు చేయాలనుకునే వారు గతంలో కంటే కొంత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఐ20 ధర ఎంతంటే?

Advertisement

తాజా ధరల సవరణ తర్వాత హ్యుందాయ్ ఐ20 ఎక్స్-షోరూమ్ ధరలు రూ.6 లక్షల నుంచి రూ.10.68 లక్షల వరకు ఉన్నాయి. అయితే, ధరలు పెరిగినా, ఈ కారులో ఎలాంటి కొత్త ఫీచర్లు లేదా అదనపు మార్పులను కంపెనీ ప్రకటించలేదు. కేవలం ధరల సవరణ మాత్రమే చేసింది.

బాలెనో, గ్లాంజాతో గట్టి పోటీ

భారత మార్కెట్లో హ్యుందాయ్ ఐ20కు ప్రధాన పోటీదారులుగా మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా ఉన్నాయి. ఈ రెండు కార్లు ఇటీవల మిడ్-లైఫ్ అప్‌డేట్స్ పొందాయి. కొత్త ఫీచర్లు, ఆధునిక సాంకేతికతతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఐ20 ధరలు పెరగడం కంపెనీకి సవాలుగా మారవచ్చు. ముఖ్యంగా ధర, ఫీచర్లు పోల్చుకుని కారు కొనుగోలు చేసే కస్టమర్లు ఇతర మోడళ్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

2027లో హ్యుందాయ్ నుంచి కొత్త కార్లు

Advertisement

మరోవైపు హ్యుందాయ్ భవిష్యత్ ప్రణాళికలపైనా ఆటోమొబైల్ మార్కెట్లో ఆసక్తి నెలకొంది. 2027 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో కంపెనీ కొత్త వాహనాలను ప్రదర్శించే అవకాశం ఉంది. క్రెటా ఎలక్ట్రిక్ కంటే దిగువ స్థానంలో ఉండేలా కొత్త ఎలక్ట్రిక్ SUVను తీసుకురావాలని హ్యుందాయ్ భావిస్తోంది. దీనిని ఐయోనిక్ పి పేరుతో పరిచయం చేసే అవకాశం ఉంది.  2027 నాలుగో త్రైమాసికంలో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. దీంతో పాటు కియా కేరెన్స్ క్లావిస్ ఆధారంగా రూపొందించే నీరా MPV కూడా వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌లో పరిచయం కావచ్చని తెలుస్తోంది.

Read Also: అక్టోబర్ లో కార్ల అమ్మకాల జోరు, ఏ కంపెనీ ఎన్ని కార్లు అమ్మిందంటే?

Tags

Related News

అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. ఏ కంపెనీ ఎన్ని వాహనాలు అమ్మిందంటే?

750ccతో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంచలనం.. క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త బైక్!

అక్టోబర్ లో కార్ల అమ్మకాల జోరు, ఏ కంపెనీ ఎన్ని కార్లు అమ్మిందంటే?

పండుగ సీజన్‌లో EV కార్లపై అదిరిపోయే డీల్స్.. టాటా నుంచి ఎంజీ వరకు లక్షల్లో ఆఫర్లు!

అక్టోబర్‌లో హ్యుందాయ్ అమ్మకాల జోరు.. ఒక్క నెలలో ఎన్ని వేల కార్లు అమ్మిందంటే?

మహీంద్రా కార్లకు పండుగ సీజన్ బూస్ట్.. అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

మారుతి అభిమానులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 4 కొత్త కార్ల ఎంట్రీ!

Big Stories

Advertisement
×