E-Paper
Advertisement

Free AC Scheme 2026: ప్రభుత్వం గుడ్ న్యూస్.. తీవ్రమైన ఎండల దృష్ట్యా.. ఉచితంగా ఏసీల పంపిణీ!

Free AC Scheme 2026: ప్రభుత్వం గుడ్ న్యూస్.. తీవ్రమైన ఎండల దృష్ట్యా.. ఉచితంగా ఏసీల పంపిణీ!

Free AC Scheme 2026: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా అక్కడి నివాసితులకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్నవారు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వేసవి వేడి నుండి ఉపశమనం పొందేందుకు ఉచితంగా ఎయిర్ కండిషనర్ (AC) యూనిట్లను పంపిణీ చేస్తోంది. ఈ స్కీమ్ కు సంబంధించిన ముఖ్య వివరాలు.. ఏవిధంగా అప్లై చేసుకోవాలి వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పథకం పేరు ఏంటంటే?

న్యూయార్క్ స్టేట్ ప్రభుత్వం దీనిని ‘హోమ్ ఎనర్జీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ (Home Energy Assistance Program – HEAP)లో భాగంగా నిర్వహిస్తోంది. ‘కూలింగ్ అసిస్టెన్స్’ (Cooling Assistance) పేరుతో.. నిరుపేద కుటుంబాలకు వేసవిలో చల్లదనాన్ని అందించడానికి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది.

అర్హులు ఎవరంటే?

ఈ పథకం కింద ఉచితంగా ఏసీ పొందడానికి కొన్ని నియమ నిబంధనలు న్యూయార్క్ ప్రభుత్వం సూచించింది. దీని ప్రకారం.. దరఖాస్తుదారుడి కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిలోపు ఉండాలి. కుటుంబంలో ఎవరికైనా వేడి వల్ల తీవ్రమయ్యే ఆరోగ్య సమస్యలు (ఆస్తమా లేదా శ్వాసకోశ వ్యాధులు) ఉంటే ప్రాధాన్యత ఇస్తారు. ఇంట్లో 6 ఏళ్లలోపు పిల్లలు ఉన్నా, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు ఉన్నా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ స్కీమ్ కింద ఏసీ పొంది ఉంటే.. వారు అనర్హులు.

అర్హులకు లభించేవి ఇవే..

అర్హులైన వారికి ప్రభుత్వం ఒక ఎయిర్ కండిషనర్ యూనిట్ ఉచితంగా అందజేయనుంది. ఏసీ యూనిట్ ను ఇవ్వడంతో పాటు దానిని ఇంట్లో ఫిక్స్ చేయడానికి అయ్యే ఇన్ స్టాలేషన్ ఖర్చును సైతం రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వనుంది. అయితే ఏసీ ఫిక్స్ చేసిన తర్వాత.. దాని వాడకం వల్ల వచ్చే నెలవారీ విద్యుత్ బిల్లును మాత్రం యజమానే చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఉచిత ఏసీ పథకానికి అర్హత కలిగినవారు రెండు మార్గాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో అయితే.. న్యూయార్క్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ access.nyc.gov లేదా myBenefits.ny.gov లో లాగిన్ అయి దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్ లైన్ కోరుకుంటే.. మీ ప్రాంతంలోని స్థానిక ‘సోషల్ సర్వీసెస్’ లేదా ‘HEAP’ ఆఫీసులో దరఖాస్తు ఫారమ్ సమర్పించవచ్చు.

Also Read: దేశంలోనే బెస్ట్ పవర్ సేవింగ్ ఏసీలు.. ఇక రూ.500 లోపే కరెంటు బిల్లు.. వర్త్ వర్మా వర్త్!

అవసరమైన పత్రాలు

ఉచిత ఏసీ పథకానికి అవసరమైన పత్రాల వివరాలను సైతం న్యూయార్క్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ, సామాజిక భద్రత సంఖ్య (Social Security Number), అనారోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్.. దరఖాస్తులో భాగంగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ పథకానికి ఎవరు ముందుగా అప్లై చేస్తే వారికే ఉచితంగా ఏసీలు అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిధులు అయిపోయేవరకు మాత్రమే ఏసీలను పంపిణీ చేస్తామని స్పష్టం చేశాయి.

Also Read: Wearable AC: సోనీ సంచలనం.. షర్ట్ లోపలే ఏసీ.. ఇక ఎండ ఎంత ఉన్నా డోంట్ కేర్!

Related News

BSNL ధమాకా ఆఫర్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే.. 300 రోజులు పండగే!

ఏసీ బిల్లు తగ్గించే అద్భుత చిట్కా.. మేడ పైకి ఎక్కి ఇదొక్కటి చేయండి చాలు!

50 డిగ్రీల ఎండలోనైనా హాయిగా గుర్రుపెట్టి నిద్రపోవచ్చు.. ఈ Silent Sleep Split ACలు ఉంటే!

జియో యూజర్లకు భారీ షాక్.. రూ. 249 ప్లాన్ క్లోజ్.. ప్రత్యామ్నాయ బెస్ట్ ప్లాన్లు ఇవే!

Jio యూజర్లకు పండుగే.. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే.. టాప్-5 ప్లాన్‌లు ఇవే!

మీ ఫోన్ విపరీతంగా వేడెక్కుతోందా? బ్యాటరీ పేలకుండా వెంటనే ఇలా చేయండి!

ఐరన్ కూలర్ షాక్ కొడుతోందా? వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి!

Samsung Galaxy A36 ధర ఇంతలా తగ్గిందా? మే నెలలోనే బెస్ట్ ఆఫర్ ఇదే!

Big Stories

×