BigTV English

Nothing Phone 2a Plus: నథింగ్ నుంచి మరో ఫోన్.. ప్రాసెసర్ భలే భలే.. లాంచ్ ఎప్పుడంటే..?

Nothing Phone 2a Plus: నథింగ్ నుంచి మరో ఫోన్.. ప్రాసెసర్ భలే భలే.. లాంచ్ ఎప్పుడంటే..?

Nothing Phone 2a Plus Launching In July 31: స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్ నథింగ్ ఫోన్ కొత్త కొత్త మొబైళ్లను లాంచ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తమ స్మార్ట్‌ఫోన్లలో అదిరిపోయే ఫీచర్లను అందించి అట్రాక్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ Nothing Phone 2aని పరిచయం చేసింది. ఇది MediaTek Dimensity 7200 Pro చిప్‌సెట్‌తో వచ్చింది. అలాగే 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరాలోనూ తోపుగా నిలిచింది. ఏకంగా 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది.


ఇక ఇప్పుడు ఈ లైనప్‌లో రెండవ మోడల్‌గా Nothing Phone 2a Plus దేశీయ మార్కెట్‌లో లాంచ్ కావడానికి సిద్ధమైంది. రాబోయే ఈ ప్లస్ వేరియంట్ జూలై 31న ఆవిష్కరించబడుతుందని తెలుస్తోంది. ప్రస్తుత హ్యాండ్‌సెట్ కంటే మెరుగైన ఫీచర్లతో వస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. నథింగ్ సహ వ్యవస్థాపకుడు అకిస్ ఎవాంజెలిడిస్ ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ ప్లస్ వేరియంట్‌కు సంబంధించి ఓ అప్డేట్‌ను షేర్ చేయడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ ఫీచర్లు టీజ్ చేయబడనప్పటికీ.. Nothing Phone 2a Plus ఫోన్ 2a ‘బీఫ్డ్-అప్ వెర్షన్’ అవుతుందని తెలుస్తోంది.

నథింగ్ సహ వ్యవస్థాపకుడు అకిస్ ఎవాంజెలిడిస్ ఇటీవల (X) పోస్ట్‌లో రాబోయే ఫోన్ 2ఎ ప్లస్ స్మార్ట్‌ఫోన్ ‘‘మరింత ప్రాసెసింగ్ పవర్’’ అండ్ ‘‘హార్డ్‌వేర్ డిజైన్ మార్పులు అవసరం లేని కొన్ని ఇతర మెరుగుదలలతో’’ వస్తుందని అతను తెలిపాడు. అంటే ప్రస్తుత ఫోన్ 2a మోడల్‌లో ఉన్న MediaTek Dimensity 7200 Pro కంటే నథింగ్ ఫోన్ 2a ప్లస్ మరింత శక్తివంతమైన చిప్‌సెట్ ద్వారా మద్దతునిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ప్లస్ వేరియంట్ ఇప్పటికే ఉన్న 2ఏ వేరియంట్ మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.


Also Read: తక్కువ ధరలోనే నథింగ్ ఫోన్ (2a).. లాంచ్ ఎప్పుడంటే..?

ఇక భారతదేశంలో ఫోన్ 2a అందుబాటులో ఉండగా.. ఇప్పుడు దాని ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.. నథింగ్ ఫోన్ 2a భారతదేశంలో మార్చిలో ప్రారంభించబడింది. ఇది బ్లూ, రెడ్, ఎల్లో కలర్‌లతో కూడిన ప్రత్యేక డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ బేస్ 8GB + 128GB వేరియంట్ రూ. 23,999, మిడ్ 8GB + 256GB వేరియంట్ ధర రూ. 25,999, టాప్ 12GB + 256GB వేరియంట్‌ రూ.27,999 ధరగా కంపెనీ నిర్ణయించింది.

ఇక దీని స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. నథింగ్ ఫోన్ 2a కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సేఫ్టీతో 6.7-అంగుళాల 120Hz పూర్తి-HD+ (1,080×2,412 పిక్సెల్‌లు) AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ 4nm MediaTek డైమెన్సిటీ 7200 Pro SoC ద్వారా ఆధారితమైనది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత నథింగ్ OS 2.5తో రవాణా చేయబడుతుంది. ఇది వెనుక భాగంలో రెండు 50-మెగాపిక్సెల్ సెన్సార్‌లను, ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. ఫోన్ 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Tags

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×