BigTV English

UPSC Chairperson Manoj Soni resigns: యూపీఎస్పీ ఛైర్‌పర్సన్ పదవికి మనోజ్ రాజీనామా, ఫేక్ సర్టిఫికెట్ వ్యవహారమేనా?

UPSC Chairperson Manoj Soni resigns: యూపీఎస్పీ ఛైర్‌పర్సన్ పదవికి మనోజ్ రాజీనామా, ఫేక్ సర్టిఫికెట్ వ్యవహారమేనా?

UPSC Chairperson Manoj Soni resigns: యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు మనోజ్ సోనీ. ఐదేళ్లు సమయం ఉండగానే ఆయన రాజీనామా చేయడం అనేక అనుమానాలు మొదలయ్యాయి. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని అంటున్నారు. అయితే సోనీ రాజీనామాకు ఇంకా ఆమోదం లభించలేదు. మనోజ్‌సోనీ రాజీనామా వెనుక నకిలీ సర్టిఫికెట్ వ్యవహారమేనన్నది అంతర్గత సమాచారం.


మనోజ్ సోనీ తన రాజీనామాకు రాష్ట్రపతికి సమర్పించినట్లు సమాచారం. అయితే రాజీనామాను ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలుపలేదు. పదవి నుంచి రిలీవ్ అవుతారా? కొత్తవ్యక్తి వచ్చేవరకు కంటిన్యూ అవుతారా? అన్నది తేలాల్చిఉంది. ఒకవేళ రాష్ట్రపతి ఆమోదం తెలిపితే.. సోనీ స్థానంలో కొత్త చైర్‌పర్సన్ పేరును ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది.

‘ద హిందూ‘ సమాచారం ప్రకారం.. ఇంతకీ మనోజ్ సోనీ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకా డీటేల్స్ లోకి వెళ్తే.. 2005లో వడోదర‌లోని ఫేమస్ ఎంఎస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్స్‌లర్‌గా ఆయన నియమితుల య్యారు. కేవలం 40 ఏళ్లలో ఆ పదవిని అందుకున్నారు. అంతేకాదు దేశంలో అత్యంత చిన్న వయస్సులో వీసీగా బాధ్యతలు చేపట్టారాయన. మనోజ్‌సోనీని ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత ఆప్తుడిగా పొలిటికల్ సర్కిల్స్‌లో నేతలు చెబుతుంటారు.


2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2017లో మనోజ్‌సోనీ యూపీఎస్సీ కమిషన్‌లో సభ్యుడిగా చేరారు. ఆ తర్వాత గతేడాది మే 16న కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. 2029 వరకు ఆయనకు అవకాశం ఉంది. అయితే నెలరోజుల కిందటే ఆయన రాజీనామా చేశారంటూ కొత్తవాదన బయటకు వచ్చింది.

యూపీఎస్సీ పరీక్షలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రకు చెందిన ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌‌ నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించినట్టు తేలింది. దీంతో యూపీఎస్సీ కమిషన్ ఆమె సెలక్షన్‌ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు భవిష్యత్తులో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈ పరిణామాలే మనోజ్‌సోనీ రాజీనామాకు కారణాలు చెబుతున్నారు.

ALSO READ: అధికార పక్షాన్ని అదుపులో ఉంచే ‘షాడో క్యాబినెట్’ అంటే ఏమిటో తెలుసా?

ఒక్కసారి నెల కిందకి వెళ్తే.. నీట్ ఎగ్జామ్‌లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చీఫ్ సుబోధ్‌కుమార్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటన జరిగి నెల రోజుల్లోనే యూపీఎస్సీకి ఛైర్‌పర్సన్ మనోజ్‌సోనీ రాజీనామా చేయడంతో రాజకీయ రంగు పులుముకునే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Tags

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×