E-Paper
Advertisement

Nothing Phone 3: నథింగ్ ఫోన్ 3 ఇండియా లాంచ్ త్వరలోనే.. అద్భుత ఫీచర్లతో వన్ ప్లస్ 13కు పోటీనా?

Nothing Phone 3: నథింగ్ ఫోన్ 3 ఇండియా లాంచ్ త్వరలోనే.. అద్భుత ఫీచర్లతో వన్ ప్లస్ 13కు పోటీనా?
Advertisement

Nothing Phone 3| నథింగ్ ఫోన్ 3 లాంచ్ తేదీ గురించి అధికారికంగా ప్రకటించింది. కానీ ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ జూలై మొదటి వారంలో విడుదల కానుందని సమాచారం. సోషల్ మీడియా ద్వారా ఎన్నో రోజులుగా ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తున్న నథింగ్ కంపెనీ, 2023లో వచ్చిన నథింగ్ ఫోన్ 2 కంటే మెరుగైన డిజైన్, పనితీరు, కెమెరా నాణ్యతతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. నథింగ్ సీఈఓ పీట్ లౌ ఈ ఫోన్ ధరను కూడా ఇటీవల వెల్లడించారు.

నథింగ్ ఫోన్ 3 లాంచ్ తేదీ

Advertisement

నథింగ్ కంపెనీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో చేసిన పోస్ట్ ప్రకారం.. నథింగ్ ఫోన్ 3 జూలై 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు లాంచ్ కానుంది. ఈ ఫోన్ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. నథింగ్ ఫోన్ 2 విడుదలై రెండేళ్ల తర్వాత ఈ కొత్త మోడల్ రానుంది. ఈ ఫోన్ ధర సుమారు £800 (సుమారు రూ. 90,000) ఉండవచ్చని, కానీ భారతదేశంలో రూ. 65,000 నుంచి రూ. 70,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

నథింగ్ ఫోన్ 2తో పోలిస్తే ఈ ఫోన్ డిజైన్‌లో కంపెనీ పెద్ద మార్పు చేసింది. వెనుకవైపు ఉండే గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను మొదటిసారిగా తొలగించేసింది. ఈ విషయాన్ని ఇటీవల అధికారికంగా ధృవీకరించారు. చూడడంలో ఫోన్ 3 కెమెరా డిజైన్ వన్‌ప్లస్ 13 లాగే ఉంటుంది. నథింగ్ ఫోన్ 3ఎ సిరీస్‌లో ఉన్నట్లుగా మూడు కెమెరాల సెటప్‌ను కలిగి ఉంటుంది.

Advertisement

నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు

ఈ ఫోన్‌లో 6.77-అంగుళాల AMOLED LTPO డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్, 12GB RAM, 512GB స్టోరేజ్‌ను సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ విషయానికొస్తే, 5,500mAh బ్యాటరీతో 50W వైర్డ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. అదనంగా, ఈ ఫోన్‌లో గూగుల్ జెమినీ AI ఫీచర్లతో పాటు.. ఇందులో సర్కిల్-టు-సెర్చ్, స్మార్ట్ డ్రాయర్, వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్, బిల్ట్-ఇన్ AI అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వెనుకవైపు మూడు 50MP కెమెరాలు, ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా ఉంటాయి.

Also Read: ఇండియాలో ఇన్ఫినిక్స్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లు

నథింగ్ ఫోన్ 3 అధునాతన ఫీచర్లు, ఆకర్షణీయ డిజైన్‌తో స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకోనుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×