Nothing Phone 3A : బెస్ట్ డిజైన్స్ తో అదిరిపోయే ప్రాసెసర్ తో లేటెస్ట్ మోడల్ మొబైల్స్ ను తీసుకురాటానికి ప్రసిద్ధి చెందిన టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్. ఈ కంపెనీ ఇప్పటికే ఎన్నో లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొచ్చేసింది. తాజాగా ఈ ఏడాది జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో కొత్త మొబైల్ ను తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది.
బార్సిలోనాలో ఈ ఏడాది మార్చి 4న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ గ్రాండ్ గా జరగనుంది. ఇందులో నథింగ్ కంపెనీ నథింగ్ ఫోన్ 3A ను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతుంది. రూ.25వేల సెగ్మెంట్ లో బెస్ట్ అప్ గ్రేడ్స్ తో లేటెస్ట్ మొబైల్ ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది.
నథింగ్ కంపెనీ లండన్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ తయారీదారీ సంస్థ. ఈ కంపెనీ యూజర్స్ అవసరాలకు అనుగుణంగా లేటెస్ట్ ఫీచర్స్ తో మెుబైల్స్ ను తీసుకొస్తుంది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి ఎన్నో మెుబైల్స్ రాగా.. త్వరలోనే Nothing Phone 3A రాబోతుంది. ఇందులో Snapdragon 7s Gen 3 ప్రాసెసర్, 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరా సెటప్ తో మిడ్ రేంజ్ మెుబైల్ గా రాబోతున్నట్లు తెలుస్తుంది.
ఇండియా ధర –
ఇండియాలో నథింగ్ ఫోన్ (2a) ధర రూ. 23,999గా ఉంది. ఇక ఈ సిరీస్ లో రాబోతున్న ఫోన్ 3a ధర కూడా అదే రేంజ్ లో ఉంటుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంచనా ప్రకారం రూ. 23,999 – రూ. 25,999 రేంజ్ లో ఈ మెుబైల్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.
డిజైన్ డిస్‌ప్లే ఫీచర్స్ –
నథింగ్ ఫోన్ 3A సిగ్నేచర్ పారదర్శక బ్యాక్ ప్యానెల్, ఐకానిక్ గ్లిఫ్ LED లైట్స్ తో రాబోతుందని అంచనా. లేటెస్ట్ మోడల్ లో లైటింగ్ డిజైన్ తో ఈ మెుబైల్ రాబోతుందని తెలుస్తుంది. ఇక డిస్ ప్లే విషయానికొస్తే.. నథింగ్ ఫోన్ 3A మెుబైల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. భావిస్తున్నారు.
స్పెసిఫికేషన్స్ –
నథింగ్ ఫోన్ 3a మెుబైల్ Qualcomm Snapdragon 7s Gen 3 ప్రాసెసర్‌తో రాబోతుందని సమాచారం. ఈ కంపెనీ తీసుకువచ్చిన ముందు మెుబైల్స్ తో పోలిస్తే లేటెస్ట్ ప్రాసెసర్ ఇందులో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ Realme 14 Pro+ మరియు Redmi Note 14 Pro+ మెుబైల్స్ లో కనిపిస్తుంది .8GB RAM, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆపరేటింగ్ సిస్టమ్ 3.0తో రన్ అవుతుందని అంచనా. బ్యాటరీ 4,290mAh ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.
ఫోన్ 3a కెమెరా –
బెస్ట్ కెమెరా ఫీచర్స్ తో ఈ మెుబైల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఫోన్ 3a టెలిఫోటో లెన్స్‌తో డ్యూయల్ 50MP సెన్సార్‌తో వచ్చేస్తుందని అంచనా. ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉండనుంది. e-SIM సపోర్ట్ తో పనిచేస్తుందని అంచనా. రెండు ఫిజికల్ నానో-సిమ్‌లు లేదా ఫిజికల్ నానో సిమ్‌తో రాబోతుందని తెలుస్తుంది.
ALSO READ : క్రోమ్ వాడుతున్నారా.. ఆ ఒక్క సెట్టింగ్ మార్చకపోతే ఎంత ప్రమాదమో తెలుసా!