BigTV English
Advertisement

Google Chrome : క్రోమ్ వాడుతున్నారా.. ఆ ఒక్క సెట్టింగ్ మార్చకపోతే ఎంత ప్రమాదమో తెలుసా!

Google Chrome : క్రోమ్ వాడుతున్నారా.. ఆ ఒక్క సెట్టింగ్ మార్చకపోతే ఎంత ప్రమాదమో తెలుసా!

Google Chrome : ఇండియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ CERT-In గూగుల్ క్రోమ్ వాడే యూజర్స్ కు హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా మ్యాక్, క్రోమ్ బుక్, విండోస్ వాడుతున్న యూజర్స్ వెంటనే అప్రమత్తం అవ్వాలని.. లేదంటే పెను ప్రమాదం పొంచి ఉందని తెలిపింది.


CERT-In క్రోమ్ బ్రౌజర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కొన్ని డేంజరస్ లోపాలను బయటపెట్టింది. ఈ లోపాలను ఉపయోగించుకొని హ్యాకర్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉందని.. సిస్టమ్ ను తమ కంట్రోల్ లోకి తీసుకొనే ఛాన్స్ ఉందని తెలిపింది. సిస్టమ్ ను క్రాస్ చేస్తే ప్రమాదం కూడా ఉందని.. అందుకే బ్రౌజర్ తో పాటు ఆపరేటింగ్ సిస్టంను వెంటనే అప్డేట్ చేయాలని హెచ్చరించింది.

మ్యాక్ యూజర్స్ కు హై అలర్ట్ –


మ్యాక్ వాడుతున్న యూజర్స్ కు ప్రమాదం ఎక్కువగా ఉందని, పాత వెర్షన్ వాడే వారికి హ్యాకర్స్ నుంచి ప్రమాదం తప్పదని హెచ్చరించింది. ముఖ్యంగా మ్యాక్ వాడుతున్న గూగుల్ క్రోమ్ యూజర్లకు సిస్టమ్ లో రెండు లోపాలు ఉన్నాయని తెలిపింది. అందులో (CIVN-2025-0007, CIVN-2025-0008) లో లోపాలు ఉన్నాయని గుర్తించింది.

క్రోమ్ వెర్షన్ 132.0.6834.83/8r కంటే పాత వెర్షన్ వాడే యూజర్స్ కు ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని తెలిపింది. ఈ లోపాలు ఉన్న సిస్టమ్స్ గుర్తించే హ్యాకర్స్ కోడ్స్ పంపించి సిస్టమ్ ను క్రాస్ చేస్తే ఛాన్స్ ఉంటుంది. దీనినే డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అంటారని CERT-In తెలిపింది.

సిస్టమ్ అప్డేట్ కానప్పుడు డివైజ్ రౌండ్ సర్టిఫికెట్ సెక్యూరిటీ ఫీచర్స్ ను సైబర్ నేరగాళ్లు తేలిగ్గా దాటేగలరని హెచ్చరించింది. మెమొరీ ఎర్రర్స్, నావిగేషన్ లో ఎర్రర్స్, బ్రౌజర్ ఎక్స్ఎన్షన్ లలో ఉన్న లోపాలను గుర్తించి తేలికగా హ్యాక్ చేస్తుందని తెలిపింది.

విండోస్ యూజర్స్ కు హై అలర్ట్ –

విండోస్ వాడుతున్న యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని.. క్రోమ్ వెర్షన్ 132.0.6834.110/111 కంటే పాత వెర్షన్లు వాడే యూజర్స్ కు ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే అప్రమత్తం అవ్వాలని హెచ్చరిస్తుంది.

క్రోమ్ బుక్ కు ప్రమాదమే –

క్రోమ్ బుక్ వాడుతున్న యూజర్లకు సైతం ప్రమాదం పొంచి ఉంది. క్రోమ్ఓఎస్ వెర్షన్ 16093.68.0 (బ్రౌజర్ వెర్షన్ 132.0.6834.94) కంటే పాత వెర్షన్లు వాడుతుంటే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది.

డెస్క్ టాప్, క్రోమ్ బుక్, లాప్టాప్ పాత వెర్షన్స్.. గూగుల్ క్రోమ్ లేదా క్రోమ్ఓఎస్ రన్ చేస్తున్న యూజర్స్ కు ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్ యూజర్స కు ప్రమాదం కాస్త తక్కువ అయినప్పటికీ.. డెస్క్ టాప్ వాడే యూజర్స్ అప్రమత్తంగా ఉండాలి. లేటెస్ట్ వెర్షన్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. సిస్టమ్ ను సెక్యూర్ గా ఉంచుకోవడానికి ఆటోమేటిక్ అప్డేట్ ఆప్షన్ ను అనేబుల్ చేసుకోవాలి.

అప్డేట్ విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా సిస్టమ్ లో డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సిస్టమ్ క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా డివైజ్ ను హ్యాకర్లు తమ కంట్రోల్ లోకి తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది.

ALSO READ : చైనా డీప్ సీక్ పై సైబర్ దాడి.. ట్రంప్ స్పందన ఏంటంటే!

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×