Anchor Roshan: యాంకర్స్ అనగానే సుమ, ఉదయభాను, సుధీర్ ఇలా రకరకాల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య ఈవెంట్స్ లో కంటే యూట్యూబ్ ఛానెల్స్ లో యాంకర్స్ బాగా ఫేమస్ అవుతున్నారు. అలా ఫేమస్ అయినా యాంకర్స్ లో రోషన్ ఒకడు. రోషన్ గురించి యూట్యూబ్ చూసేవాళ్లకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ సెలబ్రిటీల హోమ్ టూర్స్ చేస్తూ.. వారి గురించి ప్రేక్షకులకు తెలిసేలాగా చేస్తూ ఉంటాడు.
కొత్తగా వచ్చిన, ఫేమస్ అయిన నటీనటుల గురించే కాకుండా పాత హీరోయిన్లు.. ఇప్పుడేం చేస్తున్నారో కూడా ప్రేక్షకులకు చూపిస్తూ ఉంటాడు. ఇక్కడే కాదు వారు దేశవిదేశాల్లో ఉన్నా కూడా.. వారి ఇంటికి వెళ్లి హోమ్ టూర్స్ చేస్తూ ఉంటాడు. ఇండస్ట్రీలో కూడా రోషన్ కు మంచి మంచి స్నేహాలు ఉన్నాయి. ఇప్పటివరకు రోషన్ టీవీ షోస్ లలో పాల్గొన్నది చాలా రేర్. అడపాదడపా జరిగే ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంటాడు. కానీ, మొదటిసారి రోషన్.. ఫ్యామిలీ స్టార్స్ ప్రోగ్రామ్ కు గెస్ట్ గా వచ్చాడు.
సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో.. ప్రతి వారం కొంతమంది సెలబ్రిటీలను గెస్టులుగా పిలిచి వారితో కొన్ని గేమ్స్ ఆడిస్తుంటాడు. ఇక చివరిలో వారి ఫ్యామిలీల గురించి.. జీవితంలో వారు రిగ్రెట్ అయిన విషయాల గురించి అడిగి ఎమోషనల్ అయ్యేలా చేస్తాడు. ఇక ఈ వారం ఫ్యామిలీ స్టార్స్ కు యాంకర్స్, సింగర్స్ కలిసి వచ్చారు. యాంకర్ శివ, రోషన్, శివ జ్యోతి, మంజూష, సౌమ్య రావు .. సింగర్స్ సాకేత్, మంగ్లీ సిస్టర్ ఇంద్రవతి చౌహన్ తో పాటు మరో ఇద్దరు సింగర్స్ గెస్టులుగా వచ్చారు. వారితో సుధీర్ ఒక ఆట ఆదుకున్నాడు.
Chiranjeevi: ఎక్స్ పీరియం పార్కు.. హీరోయిన్ తో డ్యాన్స్ అంటే కష్టం
ఇక గేమ్స్ తరువాత యాంకర్ శివకు, రోషన్ కు మధ్య ఒక ఇంటర్వ్యూ పెట్టారు. ఇద్దరు వివాదాస్పద యాంకర్స్ మధ్య ఘాటు ప్రశ్నల మధ్య చర్చ జరిగింది. నీ యాంకరింగ్ జనాలందరికీ నచ్చుతుంది అని నువ్వు అనుకుంటున్నావా అని శివ.. రోషన్ కు ప్రశ్న వేశాడు. దానికి సమాధానంగా రోషన్ సైతం అదే ప్రశ్నను శివకు తిరిగి అడిగాడు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇక ఆ తరువాత ఒక్కోక్కరు తమ జీవితంలో అనుభవించిన పెయిన్ ను.. ఆ సమయంలో వారికి తోడుగా ఉన్నవారి గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు.
అషు, శివ జ్యోతి, జబర్దస్త్ పవిత్ర.. తమ జీవితంలో జరిగిన సంఘటలను చెప్తూ వెక్కి వెక్కి ఏడ్చారు. రోషన్ సైతం.. తన జీవితంలో జరిగిన పెయిన్ ఫుల్ స్టోరీ చెప్పడంతో పాటు తనకు ధైర్యం ఇచ్చిన వ్యక్తిని చూపించాడు. ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. రోషన్.. చిరు గురించి మాట్లాడుతూ.. ” ఒక మనిషి మన వెనుక నిలబడి.. నువ్వెళ్లు.. నీకేదైనా నేను ఉంటాను అని ధైర్యం ఇచ్చిన వ్యక్తి చిరంజీవి. అన్నయ్యకు జీవితాంతం కాదు పది జన్మలు ఎత్తినా తమ్ముడుగా పుట్టాలని నేను కోరుకుంటాను” అని కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట సిరలు గా మారింది.