Viral News: ఆ ఆలయం ఓం నమః శివాయ నామస్మరణతో మారుమ్రోగింది. కార్తీక మాసం కాదు.. కార్తీక పౌర్ణమి కూడా కాదు. కానీ ఆ ఆలయంలో జరిగిన వింతకు భక్తులు పరవశించి శివనామస్మరణ సాగించారు. ఆ శివాలయంలో అద్భుతాన్ని చూసేందుకు స్థానిక భక్తులే కాక, ఇతర గ్రామాల నుండి కూడా తండోపతండాలుగా తరలి వచ్చి ఆ అద్భుతాన్ని వీక్షించారు. ఇంతకు అసలేం జరిగిందంటే?
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ రోడ్డులోని అయ్యప్ప స్వామి దేవాలయం వెలసి ఉంది. నిరంతరం స్వామి వారికి భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రీతిలో గురువారం కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చారు. అయితే ఉన్నట్లుండి ఆలయంలోని శివాలయం వద్దకు ఒక నాగు సర్పం వచ్చింది. వచ్చిన సర్పం అలా వచ్చి ఇలా వెళ్తుందని భక్తులు ముందుగా భావించారు. కానీ వచ్చిన నాగుపాము అలా చేయలేదు.
నాగుపాము ఆలయంలోని శివలింగం వద్దకు వెళ్ళింది. అక్కడ శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి అలాగే నిలబడి పోయింది. పాము పడగ విప్పి కొద్దిసేపు బుసలు కొట్టింది. భక్తులను చూస్తూ నాగుపాము అలాగే ఉండిపోవడంతో, భక్తులకు ముందుగా ఏమి తోచలేదు. అనంతరం ఆలయ పూజారి ఆజ్ఞ మేరకు అందరూ ఓం నమః శివాయ నామ స్మరణం గావించారు. అలాగే పసుపు, కుంకుమలు చల్లి సర్పానికి పూజలు చేశారు.
ఈ విషయం చిన్నగా పక్క గ్రామాల వారికి కూడా తెల్సింది. ఇక అంతే మరికొద్ది క్షణాల్లో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తుల శివ నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. ఇదొక అద్భుతమని, ఇటువంటి అరుదైన దృశ్యాన్ని చూడడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు భక్తులు తెలిపారు. కాగా శివలయానికి సాధారణంగా పాము వచ్చిందని భావించినా, ప్రదక్షిణలు చేయడం, భక్తులను చూసి అలాగే ఉండిపోవడం చూస్తే, శివయ్య మహిమ అంటూ ఆలయ అర్చకులు తెలిపారు.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ రోడ్డులోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘటన
శివలింగం వద్ద నాగుపాము వచ్చి ఉండటంతో పూజలు చేస్తున్న భక్తులు pic.twitter.com/kVO7NjcEd7
— BIG TV Breaking News (@bigtvtelugu) December 19, 2024