OnePlus 13R vs iQOO Neo 10 Pro : వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్.. స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్, అడ్వాన్స్డ్ డిస్ ప్లేతో ఇండియాలో లాంఛ్ అయ్యేందుకు సిద్ధమైంది. అలానే ఐక్యూ నియో 10 ప్రో కూడా దాదాపుగా ఇవే స్పెసిఫికేషన్స్‌తో విడుదల కానుంది. దీంతో రెండు ఫోన్లు మంచి కాంపిటీషన్ ఇవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు స్మార్ట్ ఫోన్ల ఫీచర్స్, ధరలు, సహా ఇతర స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం…
ఎప్పుడు విడుదల కానున్నాయంటే? –
వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ Ace 5 ప్రో రీసెంట్‌గానే చైనాలో విడుదల అయింది. త్వరలోనే ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్లోనూ రిలీజ్ కానుంది. దీంతో పాటే వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ జనవరి 7న లాంఛ్ కానుంది. అలానే ఐక్యూ నుంచి కూడా ఐక్యూ నియో 10 ప్రో వచ్చే ఏడాది విడుదల కానుంది. అలా ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్లో యూజర్స్‌కు అందుబాటులో ఉన్నాయి.
వన్ ప్లస్ 13R స్పెసిఫికేషన్స్
వన్ ప్లస్ 13R 6.78 అంగుళాల 8T LTPO అమోలెడ్ డిస్‌ప్లేను 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఒప్పో కిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో కలిగి ఉంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో పాటు గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌లను నిర్వహించడానికి ఆడ్రినో 750 GPUతో రన్ అవుతుంది. గరిష్టంగా 16GB LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆప్టిక్స్ కోసం, OISతో కూడిన 50MP సోనీ IMX906 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉండొచ్చు. ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ షూటర్ ఉంది.
ఇంకా డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్, లాస్ట్ జనరేషన్లో ఇచ్చిన ఆప్టికల్ సెన్సార్‌కు బదులుగా అల్ట్రాసౌండ్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ సారి ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా చైనాలో విడుదలైన Ace 5 Prలోo 6,100mAh బ్యాటరీతో వచ్చింది, అయితే ఇప్పుడు ఇండియా మార్కెట్లో లాంఛ్ అయ్యే 13ఆర్ బ్యాటర్ కాస్త చిన్నగా ఉండనుంది. iQOO 13, Realme GT 7 ప్రో వంటి స్మార్ట్ ఫోన్‌లలో ఉండే బ్యాటరీ తరహాలోనే ఉండనుంది. మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ OnePlus 13R ఆండ్రాయిడ్ 15 ఆధారిత లేటెస్ట్ OxygenOS 15పై రన్ అవుతుంది.
iQOO నియో 10 ప్రో స్పెసిఫికేషన్స్:
iQOO నియో 10 ప్రో 6.78 అంగుళాల 1.5 8T LTPO అమోలెడ్ డిస్‌ప్లేను 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో, 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్ సెటప్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 16 జీబీ LPDDR5X ర్యామ్, గరిష్టంగా 1TB UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వివో లేటెస్ట్ ఫన్ టచ్ ఓఎస్‌తో పని చేస్తుంది. 13R తరహాలోనే, Neo 10 Pro చైనీస్ వేరియంట్ 6,100mAh బ్యాటరీతో వస్తుంద. అయితే ఇండియన్ వేరియంట్ కాస్త చిన్న బ్యాటరీతో పాటు 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రావొచ్చు.
ఫోన్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ఫ్రంట్ సైడ్‌లో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP షూటర్ ఉండే అవకాశం ఉంది. ధర విషయానికొస్తే, వన్ ప్లస్ 13R 12జీబీ ర్యామ్ /256జీబీ స్టోరేజ్ మోడల్ 3399 యువాన్ల ధరతో ప్రారంభమవుతుంది. 16GB RAM/1TB స్టోరేజ్ వేరియంట్ 4699 యువాన్ల వరకు అందుబాటులో ఉంటుంది. ఐక్యూ నియో 10 ప్రో 12జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ చైనాలో 3199 యువాన్ల ధరతో ప్రారంభమవుతుంది. 1TB ర్యామ్/16జీబీ స్టోరేజ్ వేరియంట్ 4299 యువాన్లతో అందుబాటులో ఉండనుంది.
ALSO READ : రూ.7000లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కొనాలా? అదిరిపోయే టాప్ ఆఫ్షన్స్ ఇవే!