BigTV English

Rajamouli: 25 ఏళ్ల రజినీకాంత్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన రాజమౌళి.. చెప్పి మరీ సాధించాడుగా!

Rajamouli: 25 ఏళ్ల రజినీకాంత్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన రాజమౌళి.. చెప్పి మరీ సాధించాడుగా!

Rajamouli: తెలుగు సినిమా నుండి ముందుగా వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన డైరెక్టర్ ఎవరు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు రాజమౌళి. ఆయన టాలీవుడ్‌ను ముందుగా పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లారు. అసలు ఆయన బ్రేక్ చేయని రికార్డ్ అంటూ లేదని ఫ్యాన్స్ చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ‘బాహూబలి’ రెండు పార్ట్స్‌లో తెరకెక్కించి కొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు. ఆ తర్వాత ఆయన తెరకెక్కించే సినిమా ఎలా ఉండబోతుందా అని ఆలోచించిన వారిని ‘ఆర్ఆర్ఆర్’తో తృప్తిపరచారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ఎలా తెరకెక్కిందని చెప్తూ ఒక డాక్యుమెంటరీని విడుదల చేశారు మేకర్స్. అందులో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు మేకర్స్.


రజినీకాంత్ రికార్డ్

ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాను తెరకెక్కించారు రాజమౌళి. ఈ సినిమాతో ఏకంగా ఆస్కార్‌ను ఇండియాకు తీసుకొచ్చారు. అంతే కాకుండా ‘ఆర్ఆర్ఆర్’ మరెన్నో రికార్డులు కూడా బద్దలుకొట్టింది. ఒకే ఏడాదిలో ఈ మూవీని తెరకెక్కించి విడుదల చేస్తానని మాటిచ్చిన రాజమౌళి.. మేకింగ్ కోసమే మూడేళ్లు తీసుకున్నారు. అసలు ఈ సినిమా తెరకెక్కించడానికి అంత సమయం ఎందుకు పట్టింది, దానికోసం మేకర్స్ అంతా ఎంత కష్టపడ్డారు అని చెప్తూ ‘ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్’ (RRR Behind And Beyond) అనే డాక్యుమెంటరీ విడుదలయ్యింది. అందులో రజినీకాంత్ గురించి, ఆయన రికార్డ్ గురించి ప్రస్తావించారు రాజమౌళి.


Also Read: అలా చేసినందుకు ఒక ముసలావిడ నన్ను కొట్టింది.. ‘96’ డైరెక్టర్ కామెంట్స్

చెప్పి చేశారు

‘‘దాదాపు మూడు దశాబ్దాల క్రితం 1998లో రజినీకాంత్ ముత్తు సినిమా జపాన్‌లో విడుదలయ్యింది. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన ఏకైక తమిళ సినిమాగా రికార్డ్ అందుకుంది. ఆర్ఆర్ఆర్ (RRR) కూడా ముత్తు రికార్డ్ టచ్ చేస్తే బాగుంటుందని ఆశపడ్డాం’’ అని తెలిపారు రాజమౌళి. నిజంగా తను ఆ డాక్యుమెంటరీలో చెప్పినట్టుగానే చెప్పి మరీ సాధించి చూపించారు. ప్రస్తుతం రాజమౌళి ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రజినీకాంత్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోను స్పెషల్‌గా షేర్ చేస్తున్నారు. తను కేవలం హీరో మాత్రమే కాదు.. ఒక ట్రెండ్ సెట్టర్ అని హ్యాపీగా ఫీలవుతున్నారు. జపాన్‌లో 25 ఏళ్ల పాటు ఆయన సెట్ చేసిన రికార్డ్‌ను ఎవరూ బ్రేక్ చేయలేకపోవడం విశేషం.

రికార్డ్ బ్రేక్

‘ఆర్ఆర్ఆర్’తో రజినీకాంత్ (Rajinikanth) 25 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేశారు రాజమౌళి (Rajamouli). ఈ మూవీ ఇండియాలో మాత్రమే కాకుండా జపాన్‌లో కూడా విడుదలయ్యింది. ఇండియాలో ఎలా అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్ చేశారో.. అలాగే జపాన్‌లో ప్రమోషన్ చేయడం కోసం కూడా టీమ్ అంతా అక్కడికి బయల్దేరింది. అక్కడ ‘ఆర్ఆర్ఆర్’కు రీచ్ పెరిగేలా చేసింది. మొత్తానికి జపాన్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డ్ సాధించింది. కానీ ఎంతైనా ‘ముత్తు’ సమయంలోని టికెట్ రేట్లు, మార్కెట్ పరిస్థితి అంతా గమనిస్తే.. అదే ఇప్పటికీ అక్కడ తిరుగులేని సినిమా అని రజినీకాంత్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×