E-Paper
Advertisement

OnePlus Ace 3 Pro Launched: తుక్కు రేగ్గొట్టాడు.. 24జీబీ ర్యామ్, 6100mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో కొత్త ఫోన్ లాంచ్!

OnePlus Ace 3 Pro Launched: తుక్కు రేగ్గొట్టాడు.. 24జీబీ ర్యామ్, 6100mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో కొత్త ఫోన్ లాంచ్!
Advertisement

OnePlus Ace 3 Pro launched with 24GB RAM and 6100mAh Battery: ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus ఎట్టకేలకు ‘OnePlus Ace 3 Pro’ని చైనీస్ మార్కెట్లో లాంచ్ చేసింది. OnePlus Ace 3 Pro స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 8T LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌కి సంబంధించి పూర్తి ఫీచర్లు, ధర, స్పెసిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

OnePlus Ace 3 Pro Price

Advertisement

OnePlus Ace 3 Pro.. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ 3,199 యువాన్లుగా నిర్ణయించబడింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 36,730గా ఉంది. అలాగే 16GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 3499 యువాన్లు.. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 40,170గా ఉంది. ఇక 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 3799 యువాన్.. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.43,610గా కంపెనీ నిర్ణయించింది.

అలాగే 24GB ర్యామ్ + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర 4399 యువాన్ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.50,500గా ఉంది. ఇంకా 16GB ర్యామ్ + 512GB సిరామిక్ స్టోరేజ్ వేరియంట్ ధర 3999 యువాన్లు అంటే సుమారు రూ.45,905.. చివరిగా 24GB ర్యామ్ + 1TB సిరామిక్ స్టోరేజ్ వేరియంట్ ధర 4699 యువాన్లు అంటే సుమారు రూ.53,950గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ జూలై 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ టైటానియం మిర్రర్ సిల్వర్, గ్రీన్ ఫీల్డ్ బ్లూ, సూపర్‌కార్ పింగాణీ కలెక్షన్ అనే మూడు కలర్ వేరియంట్లలో వస్తుంది.

Advertisement

Also Read: ఫొటో అట్రాక్షన్ ఫోన్.. వివో నుంచి రూ.9,999లకే కొత్త 5జీ మొబైల్.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే..?

OnePlus Ace 3 Pro Specifications

OnePlus Ace 3 Pro.. 2780×1264 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల 8T LTPO AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్ట బ్రైట్‌నెస్ 4500 నిట్‌ల వరకు అందిస్తుంది. డాల్బీ విజన్‌తో కూడిన ఈ డిస్‌ప్లే మూలన గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో వస్తుంది. అలాగే ఈ ఫోన్ 6100mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 100W SuperVOOC ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్‌ను దుమ్ము, ధూళి నుంచి రక్షించేందుకు IP65 రేటింగ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ స్టీరియో స్పీకర్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా కలర్‌ఓఎస్ 14.1పై పనిచేస్తుంది.

ఇక కెమెరా విషయానికొస్తే.. OnePlus Ace 3 Pro వెనుక భాగంలో OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ Sony IMX890 ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ Sony IMX355 అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. ఇది 2 మెగాపిక్సెల్ హోవే OV02B మాక్రో కెమెరాతో అందించబడింది. ఇక సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ Samsung S5K3P9 సెల్ఫీ కెమెరా అందించబడింది. OnePlus Ace 3 Proలో Adreno 750 GPUతో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ సిమ్, 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, Beidou, GPS, టైప్ C పోర్ట్ వంటివి ఉన్నాయి.

Tags

Related News

అమెజాన్ బంపరాఫర్.. వన్‌ప్లస్ 13 పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

Big Stories

Advertisement
×