BigTV English

Vivo T3 Lite 5G Launch: ఫొటో అట్రాక్షన్ ఫోన్.. వివో నుంచి రూ.9,999లకే కొత్త 5జీ మొబైల్.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే..?

Vivo T3 Lite 5G Launch: ఫొటో అట్రాక్షన్ ఫోన్.. వివో నుంచి రూ.9,999లకే కొత్త 5జీ మొబైల్.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే..?

Vivo T3 Lite 5G First Sale in India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నుంచి తన లైనప్‌లో ఉన్న Vivo T3 Lite 5G భారతదేశంలో గురువారం ప్రారంభించబడింది. ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, IP64-రేటెడ్ బిల్డ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో లాంచ్ అయింది. ఇది గ్లోబల్ కంపెనీ వెబ్‌సైట్‌లో అధికారికంగా లిస్ట్ చేయబడిన Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌కు రీబ్యాడ్జ్ వెర్షన్‌గా కనిపిస్తుంది. వచ్చే నెల ప్రారంభంలో దీని సేల్ స్టార్ట్ కానుంది. అయితే ఇప్పుడు భారతదేశంలో Vivo T3 Lite 5G ధర, ఆఫర్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


Vivo T3 Lite 5G భారతదేశంలో 4GB ర్యామ్+ 128GB స్టోరేజ్ వేరియంట్ ఎంపిక కోసం రూ.10,499 ప్రారంభ ధరలో లాంచ్ అయింది. అలాగే 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,499గా ఉంది. దీనిని Flipkart, Vivo India వెబ్‌సైట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా జూలై 4న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సేల్‌లో బ్యాంక్‌ కార్డులపై భారీ తగ్గింపులు పొందవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు Vivo T3 Lite 5G కొనుగోలు సమయంలో రూ. 500 తక్షణ తగ్గింపు పొందుతారు. అప్పుడు దీని బేస్ ధర రూ.9999కి తగ్గుతుంది. కాగా Vivo T3 Lite 5G మెజెస్టిక్ బ్లాక్, వైబ్రంట్ గ్రీన్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది.

Vivo T3 Lite 5G Specifications


Vivo T3 Lite 5G 6.56-అంగుళాల HD+ (1,612 x 720 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది 840nits బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. అలాగే 6nm ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 6300 SoC ద్వారా 6GB వరకు RAM + 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడింది. RAMని 6GB వరకు అదనంగా పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14తో ఫోన్ రన్ అవుతుంది.

Also Read: Honor 200 Pro: ఉఫ్.. చెమటలు పట్టిస్తున్న హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్.. మరే ఫోన్లు వద్దంటారేమో..!

ఆప్టిక్స్ కోసం.. Vivo T3 లైట్ 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో AI-బ్యాక్డ్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అలాగే సెల్పీల కోసం ఫోన్ ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను పొందుతుంది. Vivo T3 Lite 5G.. 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అంతేకాకుండా దుమ్ము, ధూళి రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

Tags

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×