OnePlus Nord CE4 @ Rs 1749: మార్కెట్‌లోకి రకరకాల మోడళ్లు దర్శనమిచ్చి ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ప్రముఖ బ్రాండెడ్ తయారీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను తీసుకొచ్చి అమ్మకాల్లో జోరు కనబరిచాయి. అందులో వన్‌ప్లస్ కంపెనీ ఒకటి. ఈ నెల ప్రారంభంలో వన్‌ప్లస్ కంపెనీ భారతదేశంలో Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అంతేకాకుండా ఏప్రిల్ 4 నుంచి ఈ ఫోన్ అమెజాన్‌తో సహా మరికొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.
అయితే ఈ ఫోన్ సేల్ అమెజాన్‌లో ప్రారంభమైన మొదటి రోజే భారీ అమ్మకాలను నమోదు చేసి రికార్డు సృష్టించింది. దాదాపు 20K నుంచి 25K విభాగంలో వన్‌ప్లస్ నార్డ్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా అవతరించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారుల విపరీతంగా ఇష్టపడుతున్నారని తెలిపింది.
ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాల విషయానికొస్తే.. వన్‌ప్లస్ నార్డ్ సిఈ4.. 8బీజీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ రూ.24,999గా నిర్ణయించింది. అలాగే 8 జీబీ ర్యామ్ + 256 జీబీ వేరియంట్‌ను రూ.26,999గా తీసుకొచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో మంచి బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి.
Also Read: ‘మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా’ ఫీచర్స్ లీక్.. ఆ ఫోన్ కంటే స్పీడ్ ఎక్కువే..!
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1250 వరకు, డెబిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.395 వరకు తగ్గింపు లభిస్తుంది. వన్‌కార్డ్ క్రెడిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. వీటితో మరింత తక్కువ ధరకే ఈ మొబైల్‌ను కొనుక్కోవచ్చు.
ఈ ఆఫర్ కాకుండా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. 8/128జీబీ వేరియంట్‌పై రూ.23,250 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే 8/256 జీబీ వేరియంట్‌పై రూ.25000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు వరుసగా ఈ మొబైల్స్‌ను.. రూ.1749, రూ.1999లకే కొనుక్కోవచ్చు. అయితే ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ కండీషన్ మంచిగా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అలాంటప్పుడే భారీ మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ఫోన్ వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరాలో 50MP Sony LYT-600 సెన్సార్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను కూడా కలిగి ఉంది. రెండవ కెమెరా 8MP అల్ట్రావైడ్ సెన్సార్. సెల్ఫీ కోసం ముందు భాగంలో 16MP కెమెరాను అందించారు.