BigTV English

Korea elections: ఫలితాలు తారుమారు, విపక్షం వైపే ఓటర్లు, ప్రపంచవ్యాప్తంగా..

Korea elections: ఫలితాలు తారుమారు, విపక్షం వైపే ఓటర్లు, ప్రపంచవ్యాప్తంగా..

Korean elections: 2024 అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఎన్నికల సంవత్సరం. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కొన్నిదేశాల్లో ఎన్నికలు పూర్తయి కొత్త పాలకులు గద్దె నెక్కారు. మరికొన్ని దేశాల్లో ఎన్నికల సన్నాహాలు జరుగుతున్నాయి. ఇండియాలో ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చేశాయి. యూరోపియన్ యూనియన్‌కి జూన్, అమెరికాకు నవంబర్‌‌లో ఎన్నికలు జరగ నున్నాయి. ఇప్పటికే రష్యా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మెక్సికో, ఇరాన్, తైవాన్, భూటాన్, మాల్దీవులు వంటి దేశాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కొన్ని దేశాల్లో అధికార పార్టీ కంటిన్యూ కాగా, మరి కొన్నిదేశాల్లో విపక్షాలు అధికారంలోకి వచ్చాయి.


తాజాగా ఈ జాబితాలోకి దక్షిణకొరియా కూడా వచ్చేసింది. రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి ఊహించని షాక్ తగలింది. ప్రతిపక్షాలు అఖండ విజయాన్ని సాధించాయి. కొరియా పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో దాదాపు 4.4 కోట్ల మంది ఓటర్లు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పక్షానికి ఓటర్లు షాకిచ్చారు. 300 సీట్లకు గాను కేవలం 109 స్థానాలను సరిపెట్టుకుంది. మరో మూడేళ్లు పదవిలో కొనసాగనున్న అధికార యూన్ సూక్ యోల్‌కు ప్రస్తుత ఫలితాలు ఇబ్బందికరంగా మారాయి.

ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు పార్లమెంటుపై పూర్తి ఆధిపత్యం వచ్చే అవకాశం లేదు. అధ్యక్షుడు వీటో చేసిన బిల్లులను ఆమోదించాలన్నా, ఆయన్ని పదవి నుంచి దించాలన్న కనీసం 200 సీట్లు కావాల్సి ఉంది. అయితే కొంతలోకొంత ప్రతిపక్షాలు పార్లమెంటుపై పట్టు బిగించే అవకాశముంది. ఒకప్పటి మాదిరిగా యోల్ తన అధికారాన్ని చెలాయించడం కష్టమే అవుతుంది.


ALSO READ:  లక్ష కోట్ల మోసం.. వియత్నాం బిలియనీర్‌కు మరణశిక్ష..

కొరియా దీపం అగ్రరాజ్యానికి చాలా కీలకం. ముఖ్యంగా చైనా, నార్త్‌కొరియా ఎదుర్కోవాలంటే సౌత్‌కొరియా కీలకంగా మారింది. చీటికి మాటికీ కిమ్ తన క్షిపణులతో అలజడి సృష్టించినా.. అగ్రరాజ్యం సహాయంతో ధీటుగా  ఎదుర్కొంది యోల్ సర్కార్. మరి ప్రభుత్వం మారితే ఇప్పుడున్న విదేశాంగ పాలసీని కంటిన్యూ చేస్తుందా? అనేది ఇక్కడ కీలకంగా మారింది. మరి రానున్న రోజుల్లో అక్కడి రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×