BigTV English

OnePlus Nord CE4 Lite 5G: వన్‌ప్లస్ బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరకే దక్కించుకోవచ్చు.. సేల్ ఎప్పుడంటే..?

OnePlus Nord CE4 Lite 5G: వన్‌ప్లస్ బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరకే దక్కించుకోవచ్చు.. సేల్ ఎప్పుడంటే..?
Advertisement

OnePlus Nord CE4 Lite 5G Sale on June 27th: OnePlus తన కొత్త బడ్జెట్ ఫోన్ OnePlus Nord CE4 Lite 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌‌‌ఫోన్ ధర రూ. 20 వేల కంటే తక్కువగా ఉంటుంది. ఇది గతేడాది 108MP కెమెరాతో విడులైన OnePlus Nord CE 3 Lite 5Gకి సక్సెసర్‌గా తీసుకొచ్చింది. మీరు కొత్త OnePlus ఫోన్‌ను రూ. 20 వేల కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఫోన్ సూపర్ సిల్వర్, మెగా బ్లూ, అల్ట్రా ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లతో వస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


Nord CE 3 Lite 5G 120Hz రిఫ్రెష్ రేట్, 680nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతే కాకుండా Nord CE4 Lite 5G 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 2100నిట్‌ల పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది.

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే OnePlus Nord CE 3 Lite 5G ఫోన్‌లలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఇందులో 108MP ప్రైమరీ లెన్స్‌తో 2MP మాక్రో, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అయితే Nord CE4 Lite 5G 50MP ప్రైమరీ, 2MP డెప్త్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. రెండు డివైస్‌లలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ పోర్ట్రెయిట్ మోడ్, డెడికేటెడ్ నైట్ మోడ్, డ్యూయల్-వ్యూ, టెక్స్ట్ స్కానర్. మరెన్నో వంటి కెమెరా ఫీచర్లతో కూడా వస్తుంది.


Also Read: పెద్ద అప్‌గ్రేడ్‌లతో ఐఫోన్ 16.. సెప్టెంబర్‌లో లాంచ్.. ఫీచర్లు చూస్తే రచ్చే..!

రెండు స్మార్ట్‌ఫోన్లలో Qualcomm Snapdragon 695 ప్రాసెసర్ ఉంటుంది. Nord CE 3 Lite 5G  ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఆధారంగా ఆక్సిజన్ 13.1 సాఫ్ట్‌వేర్ స్కిన్‌ను పొందగా, కొత్త Nord CE4 Lite 5G ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 14 సాఫ్ట్‌వేర్ స్కిన్‌ ఉంటుంది. OnePlus రెండింటికి రెండు మెయిన్ అప్‌డేట్లను మూడు సంవత్సరాల పాటు, సేఫ్టీ అప్‌డేట్‌లను 4 సంవత్సరాల పాటు అందజేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

Nord CE4 Lite 5G పెద్ద 5500mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం హ్యాండ్‌సెట్ 5G, Wi-Fi 5, GPS, బ్లూటూత్ 5.1 మరియు USB టైప్-సికి సపోర్ట్ ఇస్తుంది. IP54-రేటెడ్ హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.

Also Read: iQOO Smartphone Price Cut: దిమ్మతిరిగే డీల్.. 5G ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్!

ధర విషయానికి వస్తే 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం స్మార్ట్‌ఫోన్ ధర రూ. 19,999. 8GB + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 22,999. ICICI, OneCard క్రెడిట్ కార్డ్‌లతో కంపెనీ రూ. 1,000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. వినియోగదారులు OnePlus Nord CE4 Liteని జూన్ 27న మధ్యాహ్నం 12 గంటలకు Amazon, OnePlus India వెబ్‌సైట్, OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, ఆథరైజ్‌డ్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు.

Tags

Related News

Amazon Offers: 99 రూపాయలకే మొబైల్‌ ఫోన్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో అదిరే ఆఫర్

Samsung Galaxy Ultra Neo: 6000mAh బ్యాటరీతో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. బడ్జెట్‌లో అల్ట్రా అనుభవంతో శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్

VIVO X90 Pro 2025: డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌తో వివో X90 ప్రో లాంచ్,.. స్టాక్ అయిపోయేలోపే ఫోన్ కొనేయండి

Realme GT 8 Pro: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, 320W ఛార్జింగ్.. ఫ్లాగ్‌షిప్ అనుభవంతో రియల్‌మీ GT 8 ప్రో.. ధర ఎంతంటే?

Realme Gaming Phone: రియల్ మి ఫ్లాగ్‌షిప్ గేమింగ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్.. రూ.60 వేల ఫోన్ ఇప్పుడు రూ.42000కే

Smartphone Comparison: హానర్ మ్యాజిక్ 8 vs వన్‌ప్లస్ 13 vs గెలాక్సీ S25 5G.. ఏది బెస్ట్?

Motorola Moto G85 5G: 7800mAh బ్యాటరీ, 120డబ్య్లూ ఫాస్ట్ ఛార్జింగ్.. హై ఎండ్ ఫీచర్లతో మోటొ ఫోన్ బడ్జెట్ ధరలో..

Free Wifi Hacking: ఉచిత వైఫైతో ప్రమాదం… మీ ఫోన్, కంప్యూటర్ అంతా హ్యాక్.. ఈ జాగ్రత్తలు పాటించండి

Big Stories

×